Bhogapuram Airport: ఏపీలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం చివరిదశకు చేరడంతో మిగతా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిగ్నల్ వ్యవస్థల పరీక్షల్లో భాగంగా రన్‌వేపై విమానంతో ట్రయల్ రన్ నిర్వహించింది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్టు పనులు జోరందుకున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పనుల్లో కీలక అడుగు పడింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సాంకేతిక పరీక్షలు చేపట్టింది. ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం చివరి దశకు చేరింది.
ఈ క్రమంలో రన్‌వే సిగ్నల్ వ్యవస్థ వంటి పనులు జోరందుకున్నాయి. ఏటీసీ టవర్ నుంచి వచ్చే సంకేతాలపై AAI, DGCAలు పరీక్ష నిర్వహించాయి. చిన్నపాటి విమానంతో ట్రయల్ రన్ చేపట్టారు. ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం చక్కర్లు కొట్టింది. రన్‌వేకు దగ్గరగా వచ్చి ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించింది. మళ్లీ పైకి ఎగిరినట్టు పని చేస్తున్న కార్మికులు చెబుతున్నారు.
నిర్మాణ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ సముద్రం వైపు వెళ్లిపోయింది. రాష్ట్ర విడిపోయిన తర్వాత పదేళ్ల తర్వాత విమానం ఎగరడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. కొందరైతే ఈ దృశ్యాలను వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ALSO READ: పూరీ రథయాత్ర.. ఏపీ మీదుగా వందలాది ప్రత్యేక రైల్లు
నార్మల్‌గా నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్టుల చేయాల్సిన పనులు కోసం చిన్నచిన్న మార్పులను పరిశీలించడానికి అప్పుడప్పుడు ట్రయల్ రన్ నిర్వహిస్తారు నిర్వహిస్తుంది ఎయిర్‌పోర్టు అథారిటీ. ఇందులోభాగంగానే భోగాపురం ఎయిర్‌పోర్టులో విమానం గాల్లో చక్కర్లు కొట్టి వెళ్లిందని చెబుతున్నారు.
వీలైనంత త్వరగా విమానాశ్రయానికి సంబంధించిన పనుల్ని వేగవంతం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచన. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపి వేసే అవకాశముందని అంటున్నారు. భోగాపురంతోపాటు గన్నవరం, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
ఏపీలో భోగాపురం, గన్నవరం, తిరుపతి కాకుండా మరో నాలుగైదు ఎయిర్‌పోర్టులను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది చంద్రబాబు సర్కార్. కుప్పంతోపాటు తూర్పుగోదావరిలో ప్లాన్ చేస్తోంది. ఎయిర్ కనక్టవిటీ ఎప్పుడైతే పెరుగుతుందో విదేశీ టూరిస్టులు తాకిడి పెరగడం ఖాయమని అంచనా వేస్తోంది.
ఇదే క్రమంలో విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. మొత్తానికి ఏపీని సివిల్ ఏవియేషన్ హబ్‌గా చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.