E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ట్రాప్ లో పడిపోయిన రేఖ 

Brahmamudi Serial Today march 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ట్రాప్ లో పడిపోయిన రేఖ 
Advertisement

Brahmamudi serial today Episode:   

శివరామ్‌ ఇంటికి ఇందును వంట చేయడానికి పంపిస్తానన్న రేఖను అపర్ణ తిడుతుది. ఎంత ధైర్యం ఉంటే నా మనవరాలిని ఆ ఇంటికి పంపిస్తానని చెప్తావు అంటుంది. దీంతో రేఖ కోపంగా పంపిచడానిక ధైర్యమే ఉండాలా..? అంటూ తిడుతుంది. దీంతో భ్రమరాంబ ఆయన ఎవరైనా మామూలు మనిషి అనుకుంటున్నావా..? కోటీశ్వరుడు ఆయన దృష్టిలో మంచిగా ఉంటే కోట్లు కలిసి వస్తాయి అని చెప్పగానే.. అపర్ణ మరింత కోపంగా అలాంటప్పుడు నువ్వే వెళ్లి  వంట పని చేసుకో ఇంకా సరిపోదు అనుకుంటే వాళ్ల బూట్లు కూడా పాలిష్‌ చేసుకో అంతే కానీ నా మనవరాలిని ఎక్కడికి పంపించను.. అని చెప్తుండగానే.. ఇందు దగ్గరకు వెళ్లి నాన్నమ్మ నువ్వు ఊరుకో అంటుంది. దీంతో అపర్ణ కోపంగా ఏంటే ఊరకునేది ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అంటుంది.

దీంతో రేఖ వాళ్ల ఇంటికి వెళ్లి పని చేయడానికి నీ మనవరాలికి లేని అభ్యంతరం లేనప్పుడు నీకు ఉండటం ఏంటి..? అనగానే.. అపర్ణ కోపంగా ఇంటికి వచ్చిన అతిథి  ముందు మీ పరువు తీయడం ఎందుకు అని అలా అని ఉంటుంది. నా మనవరాలు ఎప్పటికీ అలాంటి పని చేయదు.. చెప్పు ఇందు ఆ పని చేయడం నీకు ఇష్టం లేదని చెప్పుతో కొట్టినట్టు వీళ్లందరికీ అర్థం అయ్యేలా చెప్పు.. అనగానే.. భ్రమరాంబ కూడా కోపంగా ఏంటే అలా నీళ్లు నములుతావు అడుగుతుంది కదా.? మీ ముసలి నాన్నమ్మ సమాధానం చెప్పు.. రేఖ మాటకు విలువ ఇచ్చి ఒప్పుకున్నానని సమాధానం చెప్పమ్మా..? అనగానే.. అపర్ణ కోపంగా ఇందు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరింటికి వెళ్లి పని చేయాలసిన అవసరం అంతకన్నా లేదు.. నీ మనసులో ఉన్నది ఇది అని వీళ్లందరికీ చెవులు పగిలేలా చెప్పు.. అంటూ అడగ్గానే.. ఆ వంట పని చేయడానికి వెళ్లడం  నాకు ఇష్టమే నాన్నమ్మ అని చెప్పగానే.. అపర్ణ షాక్‌ అవుతుంది.

Advertisement

భ్రమరాంబ నవ్వుకుంటుంది. రేఖ మాత్రం ఫినిష్‌ వినిపించింది కదా ..? నీ మనవరాలు ఏమందో..? దానికే నొప్పి లేనప్పుడు నువ్వెందుకు ఇంత ఆవేశపడుతున్నావు..  అంటుంది. భ్రమరాంబ కూడా చేసిన గొడవ చాలు కానీ మిగిలిపోయిన ఫుడ్డు చాలా ఉంది వెళ్లి మింగండి అని చెప్పగానే.. అపర్ణ కోపంగా చూస్తుంది. ఇందు అపర్ణను తీసుకుని వెళ్లిపోతుంది. భ్రమరాంబ మాత్రం రేఖ అది పని చేయడానికి ఒప్పుకుంది. శివరాం గారు కూడా నీకు బిజినెస్‌లో హెల్ప్ చేస్తానని ఒప్పుకున్నారు కదా..? ఇంకా నీ ముఖంలో ఆనందం కనిపించడం లేదేంటి..?  అని అడగ్గానే.. రేఖ అనుమానంగా అంతా బాగానే ఉంది కానీ ఈ ఇందు అంత సులభంగా ఎలా ఒప్పుకుందా అని ఆలోచిస్తున్నాను.. అని చెప్పగానే..భ్రమరాంబ మాత్రం అంతగా ఆలోచించడానికి ఏముంది..? మనల్ని ఎదిరించి బతకలేనని అర్థం చేసుకుని ఉంటుంది అని చెప్పగానే.. రేఖ అంతే అంటావా..? అంటుంది. ముమ్మాటికీ అంతే అని భ్రమరాంబ చెప్పగానే.. రేఖ ఆలోచనలో పడిపోతుంది.

మరోవైపు రూంలోకి వెళ్లిన అపర్ణ అసలు నీకు తెలివి ఉండే ఒప్పుకున్నావా..? ఎవరో ఇంటికి నువ్వు వెళ్లి వంట చేయడం ఏంటి..? అని ఇందును తిడుతుంది. ఇందు అంతా తెలిసే ఒప్పుకున్నానని చెప్తుంది. దీంతో అపర్ణ కోపంగా తెలిసి కాదు మూర్ఖంగా ఆలోచించి ఒప్పుకున్నావు.. ఆ రేఖ చెప్పినట్టుగా వినుకుంటూ పోతే ఈ రోజు పని మనిషిగా వెళ్లమంది రేపు బానిసగా వెళ్లమంటుంది అనగానే.. స్వాతి కూడా అవును అక్కా ఈ విషయంలో నువ్వు తొందర పడ్డావు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించాల్సింది అనగానే.. అపర్ణ కూడా చూశావా నీ చెల్లెలుకే తప్పు అనిపిస్తుంది. అలాంటిది నువ్వెలా ఒప్పుకున్నావే అనగానే.. ఇందు కాసేపను నన్ను మాట్లాడనిస్తారా..? ఎంత సేపు మీరు చెప్పేదే కానీ నన్ను మాట్లాడనిస్తారా..? అనగానే.. అపర్ణ కోపంగా ఏం చెప్తావు ఇంకా ఏం చెప్తావు ఆ రేఖ మమ్మల్ని ఏం చేస్తుందోనని భయపడి ఒప్పుకున్నాను అంటావు అంతేగా అనగానే..

Advertisement

ఆ రేఖ ఏం చెప్పినా నేను తలూపడానికి గంగిరెద్దును కాదు నాన్నమ్మ మీ మనవరాలిని మీకేం అనిపిస్తుంది నాన్నమ్మ ఆ శివరాం గారికి నిజంగానే నా వంట నచ్చి పిలుస్తున్నాడు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించగానే.. అపర్ణ, స్వాతి అందుకే పిలిచారు అని ఒకేసారి చెప్తారు.. దీంతో ఇందు అలా పిలవమని చెప్పిందే నేను అనగానే.. అపర్ణ, స్వాతి షాక్ అవుతారు. శివరాం గారికి నేను ఎవరో తెలియదు అనుకుని రేఖ ఆంటీ నేను వేసిన ప్లాన్‌ లో భాగంగా నన్ను శివరాం గారి ఇంటికి వెళ్లమని చెప్పింది. అని చెప్పగానే.. అసలు ఆ శివరాం గారు నీకెలా తెలుసు అని అడుగతారు. దీంతో జరిగిన ఫ్లాష్‌ బ్యాక్ చెప్తుంది ఇందు. కారులో వెళ్తున్న శివరాంకు  హార్ట్‌స్ట్రోక్‌ వచ్చినప్పుడు తాను చేసిన సాయం గురించి చెప్తుంది. తాను ముందే శివరాంకు చెప్పిన విషయం చెప్తుంది. దీంతో అపర్ణ, స్వాతి షాక్‌ అవుతారు.

మరోవైపు పబ్బులో ఉన్నా రాజు ఎలా ఫుల్లుగా మందు తాగాక బిల్లు ఎలా కట్టాలో ఆలోచిస్తుంటాడు. ఇంతలో రాజు ఫ్రెండ్‌ పక్కకు వెళ్లి వెంకట్‌కు ఫోన్‌ చేస్తాడు. పబ్బులో నీ గర్ల్‌ఫ్రెండ్ ఉంది అని చెప్పగానే.. వెంకట్‌ వెంటనే పబ్బుకు వెళ్తాడు. వెంకట్‌కు మందు బాటిల్‌ పట్టించి వీడియో తీసి సోషల్‌ ఫోటో పెడతామని ఆ ఫోటో వాళ్ల నాన్న చూస్తారని చెప్పి బ్లాక్‌ మెయిల్‌ చేసి బిల్లు కట్టిస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×