E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపిన రాఖీ  

Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపిన రాఖీ  
Advertisement

Brahmamudi serial today Episode: 

పబ్బులో ఉన్న ఇందుతో రాఖీ మాట్లాడుతుంటాడు.. తనకు రోజూ ఇలాంటి పార్టీలు ఉంటాయని చెప్తాడు. నేను వెళ్లిన ప్రతిచోట తాగుతూనే ఉంటాను, కానీ నా పీఏ మాత్రం అలర్ట్‌గా ఉండాలి. తనకి తాగే అలవాటు ఉండకూడదు. మీకు ఆ అలవాటుందో లేదోనని టెస్ట్ చేశాను. అందులో మీరు పాస్ అయ్యారు.. ఇంతకీ మీలో ఉన్న స్ట్రాంగ్ క్వాలిటీ ఏంటీ..? అని రాఖీ అడగ్గానే.. ఇందు తనకు కష్టపడి పని చేయడం ఇష్టం.. ఏదైనా ఒక పని మొదలుపెడితే పూర్తయ్యే వరకు కష్టపడతాను అని ఇందు చెప్పగానే.. రాఖీ వెంటనే.. అయితే మీకు రాత్రిపూట వర్క్ చేయడం  ఇష్టమేనా? అని అడగ్గానే.. ఇందు రాత్రి పూట బయటకు రావడం చాలా కష్టం.. ఎంత పని ఉన్నా ఇంటి దగ్గరి నుంచే పూర్తి చేస్తానని చెప్తుంది.

దీంతో రాఖీ నువ్వు ఎక్కడి నుంచి పనిచేస్తే నాకేంటి…? వర్క్ కంప్లీట్‌ చేస్తే చాలు అంటూ రాఖీ చెప్తుండగానే.. పక్కనే తన ఫ్రెండ్‌ మెల్లగా మరి మన పని ఎలా పూర్తవుతుంది అంటూ అడగ్గానే.. రాఖీ తన ఫ్రెండ్‌ను తిడుతూ.. అవును ఇంతకీ వర్క్‌ విషయంలో సొంతంగా ఆలోచిస్తావా… లేక నేను చెప్పిందే ఫాలో అవుతావా..? అని ఇందును అడగ్గానే.. ఇందు వెంటనే.. సొంతంగా ఆలోచిస్తాను.. అలాగే మీరు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే దానిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను.. అంటుంది. దీంతో రాఖీ నేను ఏం చెబితే అది చేసేవాళ్లు నాకెందుకు, నా తప్పుల్ని సరిదిద్దేవాళ్లే నాకు కావాలి.. కానీ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Advertisement

ఇంతకు ముందు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా అనగానే.. ఇందు కొంచెం భయంగా నేను ఏదైనా త్వరగా నేర్చుకుంటాను సార్‌.. నాకు ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ సార్‌ అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో రాఖీ మీరు నాతో కలిసి పనిచేయడానికి నీకేమైనా భయంగా ఉందా? అంటూ అడగ్గానే.. దీంతో ఇందు నిజాయితీగా ఉన్నవాళ్లే స్ట్రిక్ట్‌గా పని చేస్తారు.. నేను నిజాయితీగా పనిచేస్తే చాలు కదా మీ దగ్గర.. వర్క్‌ చేస్తూ.. మిమ్మల్ని చూసి భయపడితే జాబ్ ఎలా చేస్తాను సార్‌.. అంటూ ఇందు చెప్తుంటే.. రాఖీ మాత్రం నువ్వు ఏదో టెన్షన్‌ పడుతున్నట్టు ఉన్నావు.. నీకు ఏదైనా.. ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకొస్తాను ఉండు.. అంటూ వెళ్తాడు రాఖీ..

మరోవైపు ఇంట్లో ఏవో లెక్కలు వేస్తూ కూర్చున్న రేఖ దగ్గరకు భ్రమరాంభ వచ్చి ఇంత రాత్రి అయినా ఏం లెక్కలు వేస్తున్నావు రేఖ అని అడుగుతుంది. దీంతో రేఖ రేపు ఆ ఇందూ సంతకం పెట్టాక మనకి వచ్చే ఆస్తి విలువ ఎంతో లెక్క కడుతున్నాను వదిన.. ఏయే ఆస్తులు ఎక్కడున్నాయో అంచనా వేస్తున్నాను..అని చెప్పగానే.. వీళ్లకు వైజాగ్‌, విజయవాడలో కూడా ఆస్తులు ఉన్నాయా..? అని భ్రమరాంభ అడగ్గానే..

Advertisement

రేఖ అయ్యో వదిన వైజాగ్‌, విజయవాడనే కాదు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉన్నాయి.. లేకపోతే మా అమ్మ అంతలా ఎందుకు కష్టపడుతుంది. తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టి తనకు ఆస్తి రావాలని ఎందుకు ఆశపడుతుంది అంటూ చెప్పగానే.. భ్రమరాంభ ఆశ్చర్యంగా అమ్మో ఇంత ఆస్తి ఉందా..? ఈ ఆస్థి  కోసం ఇన్నేళ్లు ఎదురుచూడటంతో ఎలాంటి తప్పు లేదమ్మా… ఆ ఇందును చదివించకుండా.. బయటకు పంపించకుండా ఇన్నేళ్లు బాగానే కంట్రోల్‌లో పెట్టుకున్నావు కానీ, నువ్వు అడగ్గానే సంతకం చేస్తుందా..? అంటూ అనుమానం వ్యక్తం చేయగానే.. రేఖ నవ్వుతూ.. అది సంతకం చేయాలంటే చదువుకుని ఉండాలి కదా.. వేలిముద్ర వేస్తుంది అని చెప్తుంది రేఖ.

మరోవైపు ఇందు ఇంకా ఇంటికి రాలేదని అపర్ణ టెన్షన్‌ పడుతుంది. లోపల భ్రమరాంబ మాత్రం ఆస్థి మొత్తం మన చేతికి వచ్చాక ఈ గుంపును ఇంకా భరించాలా..? అని అడగ్గానే.. ముందు ఆస్థి రాని వచ్చాక ఇందు  మీద కసి తీర్చుకుంటాను అంటూ రేఖ దగ్గుతుంది. దీంతో భ్రమరాంభ గట్టిగా ఒసేయ్‌ ఇందు మంచినీళ్లు తీసుకురా అని చెప్తుంది. మంచినీళ్లు అపర్ణ తీసుకెళ్తే.. రేఖ, భ్రమరాంబ అనుమానపడతారు. ఇందు ఎక్కడ అని అడగ్గానే.. శివరాం ఇంటికి వెళ్లి వచ్చి అలిసిపోయి జ్వరంగా ఉందని పడుకుంది అని చెప్పగానే.. భ్రమరాంబ అనుమానంగా రూంలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ దుప్పటి కప్పుకుని స్వాతి పడుకుని ఉంటుంది. అపర్ణ ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×