E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాఖీతో గొడవ పెట్టుకుని కొట్టిన రాజు  

Brahmamudi Serial Today march 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాఖీతో గొడవ పెట్టుకుని కొట్టిన రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: డ్రింక్‌లో మత్తు మందు కలిపి రాఖీ తీసుకుని ఇందు దగ్గరకు వెళ్తాడు. రాఖీని చూసిన ఇందు సార్‌ ఇంతకీ నా జాబ్‌ విషయం ఏం చేశారు అని అడుగుతుంది. దీంతో రాఖీ నీకో ఆఖరి టెస్ట్‌ ఉంది. అందులో నువ్వు సక్సెస్‌ అయితే గ్యారంటీగా ఆ జాబ్‌ నీదే కానీ దానికి ఇంకా టైం ఉంది. ముందు ఈ జ్యూస్‌ తాగు అంటూ రాఖీ ఇవ్వబోతుంటే.. ఇందు తీసుకోబోతుంటే.. రాజు, తన ఫ్రెండ్‌ గొడవపడుతూ వచ్చి రాఖీని తగులుతారు.. జ్యూస్‌ కిందపడిపోతుది. రాఖీ కోపంగా చూస్తుంటాడు. రాజు, ఇందును చూసి ఆశ్చర్యంగా నువ్వా అంటాడు.. ఇందు కూడా నువ్వా దేన్నో ఒక దాన్ని గుద్దేయడం ఇలా పడేయండం తప్పా నీకు వేరే పని చేత కాదా..? అంటూ తిడుతుంది.

దీంతో రాజు సిచ్యుయేషన్‌ ఏంటో తెలియకుండా ఎదుటివాళ్లను  ఎడాపెడా తిట్టడం తప్పా నీకు వేరే పని లేదా..? అంటాడు. ఇంతలో రాఖీ కోపంగా హలో గుద్దిన దానికి సారీ చెప్పకుండా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావేంటి..? అనగానే.. రాజు కోపంగా పడిపోయింది ఏమన్నా ప్లాటినమా..? గోల్డా..? ఆప్రాల్ ఆరేంజ్‌ జ్యూసే కదా..? కావాలంటే రెండు కొనిస్తానులే.. అనగానే.. ఇందు కోపంగా ఎంతసేపు వస్తువులు, డబ్బు అంతేనా..? ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌ ను పట్టించుకోవా..? అనగానే.. ఏంటి ఇప్పుడు  జ్యూస్‌ కోసం ఫీల్‌ అవుతున్నావా..? ఇప్పుడు నిన్ను గుండెల మీదకు తీసుకుని ఓదార్చాలా ఏంటి..? అంటూ రాజు అటుంటే. రాఖీ కోపంగా ఏంట్రా వాగుతున్నావు అంటాడు.

Advertisement

దీంతో రాజు కోపంగా రా ఏంట్రా  ఎలా పడితే అలా నోరు జారకు బ్రదర్‌ ఆ తర్వాత నా చెయ్యి జారుతుంది. ఆ తర్వాత నీ ఇంట్లో ఏం జారుతాయో నేను గ్యారంటీ ఇవ్వలేను.. అనగానే.. రాఖీ కోపంగా ఏంటి ఇందు ఇదంతా అసలు ఎవ్వడు వీడు.. ఇంత చీఫ్‌గా మాట్లాడుతున్నాడేంటి..? అని అడగ్గానే.. ఇందు సార్‌ ఇతను ఎవరో నాకు నిజగానే తెలియదు సార్‌ అని చెప్పగానే.. రాఖీ మరింత కోపంగా తెలియకుండానే నీతో ఇంత క్లోజ్‌గా మాట్లాడుతున్నాడా..? వీడి వాలకం చూశావా..? పక్కా ఏదో బస్తీ నుంచి వచ్చినట్టు ఉన్నాడు అనగానే.. రాజు ఫ్రెండ్‌ కోపంగా మా వాణ్ని ఏ మాటైతే అనకూడదో ఆ మాటే అనేశావు..? అయిపోయావురా..? నువ్వు అంటాడు. దీంతో రాఖీ కూడా అంటానురా మళ్లీ మళ్లీ అంటానురా..? నేను అనకపోతే వీడేమైనా రాజకుమారుడు అయిపోతాడా..? అసలు నిన్ను కాదురా..? లోపలికి రానిచ్చినందుకు ఈ పబ్బు ఓనరును అనాలి.. మార్కెట్‌ లో కొన్న బట్టలు వేసుకుని వస్తే..నువ్వు నేను సమానం అయిపోతామా..? అనగానే..

రాజు కోపంగా రాఖీని కొడతాడు..కోపంగా రేయ్‌ నేనేదో జీవితంలో కష్టపడి ఎదగాలనుకుంటే.. ఇలా అవమానించి తొక్కేయాలని చూస్తార్రా..? చూడు బస్తీలో పుట్టడం నా తప్పు కాదు.. కానీ అదే బస్తీలో చస్తే మాత్రం అది నా తప్పు అవుతుది. ఇంకెప్పుడు అలా పర్సనల్‌ గా అటాక్‌ చేయకు.. అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. ఇందు కోపంగా ఏయ్‌ అసలు నీకు బుద్దుందా..? అలా కొడతావేంటి..? అని అడగ్గానే.. రాఖీ కోపంగా స్టాఫిట్ ఇందు మీ ఇద్దరికి ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి. అంతేకానీ నన్ను కొట్టిస్తావా..? అంటాడు. దీంతో ఇందు భయంగా అయ్యో సార్‌ ఇతనికి నాకు ఏ సంబంధం లేదు సార్‌ అని చెప్పగానే.. స్టాపిట్‌ ఇక జీవితంలో నా కంపెనీలో నీకు ఎలాంటి జాబ్‌ దొరకదు.. అంటూ రాఖీ వెళ్లిపోతాడు..

Advertisement

తర్వాత ఇందు రాజును తిట్టి వెళ్లబోతూ.. కాలు జారి కింద పడబోతుంటే రాజు పట్టుకుంటాడు.. ఇందు తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు స్మగ్లర్‌ ను పట్టుకోవడానికి వెంకట్ ను తీసుకుని వెళ్లి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంది. మరోవైపు లక్కీ రాజు బైక్‌ తీసుకుని తాగిన మత్తులో ఉన్న ఐశ్వర్యను బైక్‌ మీద ఎక్కించుకుని వెళ్తాడు. అంతా ఇందు చూసి ఫాలో అవుతుది. రోడ్డు మీదకు వెళ్లిన లక్కీ, ఐశ్వర్యను పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కింద  పట్టుకెళ్తారు..మరోవైపు స్మగ్లర్‌ ను తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లిన నందును వాళ్ల బాబాయ్‌ తిడుతుంటాడు. అదే స్టేషన్‌ లో ఐశ్వర్య, లక్కీలను పోలీసులు విచారిస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×