E-Paper
Advertisement

Smartphone Sales Decline: భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు.. కొనుగోలు చేయడానికి వినియోగదారుల వెనుకడుగు.. కారణాలు ఇవే

Smartphone Sales Decline: భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు.. కొనుగోలు చేయడానికి వినియోగదారుల వెనుకడుగు.. కారణాలు ఇవే
Advertisement

Smartphone Sales Decline| దేశవ్యాప్తంగా మొబైల్ షాపులు వెలవెలబోతున్నాయి. కస్టమర్లు స్మార్ట్‌ఫోన్లు కొనడానికి ఆసక్తి చూపడం లేదు. గత కొన్ని నెలలతో పోలిస్తే కస్టమర్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో బాగా తగ్గారు. ఆఫ్‌లైన్ దుకాణాలతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అమ్మకాలు మందగిస్తున్నాయి. చాలా మంది తమ ఫోన్ అప్‌గ్రేడ్ చేయడాన్ని ఆపేస్తున్నారు. దీని కారణం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం.

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి అనిశ్చితిగా మారింది. ఇప్పుడు ఈ పరిస్థితి కారణంగానే భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ డిమాండ్‌ తగ్గిపోయింది. తగ్గిస్తోంది. చాలా మంది వినియోగదారులు కొత్త ఫోన్ కొనడాన్ని వాయిదా వేస్తున్నారు.

భారీగా తగ్గిన ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు

Advertisement

మిడ్-రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. బడ్జెట్ మోడల్స్ కంటే ఈ ఫోన్లు చాలా ఖరీదైనవి. కస్టమర్లు ఇప్పుడు ఇంటి అవసరాలు, రోజువారీ ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ఈ ట్రెండ్‌ను గుర్తించింది. వినియోగదారులు ఇప్పుడు అవసరమైన వస్తువులకే డబ్బు ఖర్చు చేస్తున్నారని చెప్పింది.

పెరుగుతున్న హోమ్ అప్లయన్సెస్ డిమాండ్

స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గినా, ఎయిర్ కండిషనర్లు, రెఫ్రిజిరేటర్లు బాగా సేల్ అవుతున్నాయి. వేసవి వేడి ఎక్కువగా ఉండటంతో కూలింగ్ అప్లయన్సెస్ అవసరమవుతున్నాయి. ఇండక్షన్ కుక్‌టాప్‌లకు కూడా డిమాండ్ పెరిగింది. LPG సరఫరా అనిశ్చితిగా ఉండటంతో ఇవి ఉపయోగకరంగా మారాయి. వినియోగదారులు ఇప్పుడు రోజువారీ సౌకర్యాలు, ఇంటి సౌకర్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు తగ్గే అవకాశం

Advertisement

మార్కెట్ నిపుణులు ఈ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు (ఇతర దేశాల నుంచి దిగుమతులు) తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) ఆసియా పసిఫిక్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత త్రైమాసిక కాలంలో 27 నుంచి 28 మిలియన్ యూనిట్లు మాత్రమే షిప్ అవుతాయి. గత సంవత్సరం అదే కాలంలో 32 మిలియన్ యూనిట్లు షిప్ అయ్యాయి. ఈ
సంఖ్య స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ బలహీనంగా ఉందని, వినియోగదారులు తక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలియజేస్తోంది.

పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు 

జియోపాలిటికల్ టెన్షన్స్, యుద్ధ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దీంతో రవాణా, తయారీ ఖర్చులు కూడా పెరిగిపోతాయి. స్మార్ట్‌ఫోన్ కాంపోనెంట్ల దిగుమతి ఖర్చు కూడా ఎక్కువైంది. బ్రాండ్ల ధరలను పెంచకుండా, పోటీని కాపాడుకోవాలి. ఇది లాభాలపై ఒత్తిడి తెస్తోంది.

Also Read: వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా ఇంటికి చేరలేదా? సులభంగా ఇలా ఫిర్యాదు చేయండి

మారుతున్న వినియోగదారుల ఖర్చు అలవాట్లు

అనిశ్చితి సమయంలో అవసరమైన వస్తువులకు ప్రాధాన్యం ఇస్తారు. స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ అంత అత్యవసరం కాదని భావిస్తున్నారు. డబ్బు ఆదా చేసుకోవాలని చూస్తున్నారు. రిటైలర్లు సంవత్సరం చివర్లో డిమాండ్ మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. యుద్ధ పరిస్థితులు మెరుగైతే మళ్లీ కొనుగోళ్లు పెరుగుతాయి. ప్రస్తుతం ప్రపంచ ఘర్షణలు కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×