E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ నుంచి మాట తీసుకున్న ఇందు  

Brahmamudi Serial Today march 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ నుంచి మాట తీసుకున్న ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode: ఆస్థి మొత్తం రేఖకు వచ్చే వరకు తనను ఏమీ చేయదని అప్పటి వరకు నన్ను బెదిరించడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.. నాన్నమ్మ నాకోసం అమ్మానాన్నలు చేసిన త్యాగాలు చాలు నా వల్ల మీకు ఏదైనా జరిగితే ఆ బాధను నేను జీవితాంతం నా గుండెల్లో మోయాలి. ఆ శిక్ష చావడం కంటే చాలా పెద్దది నాన్నమ్మ అంటూ ఏడుస్తేంటే.. అపర్ణ ఓదారుస్తుంది. ఇందు అలా మాట్లాడుక మన వంశానికి నువ్వు వారసురాలివి మాత్రమే కాదు మా ఆశయాలకు ఒక్కగానొక్క ఆశవి నువ్వు ఈ కుటుంబాన్ని నమ్ముకుని ఎన్నో వేల మంది బతుకుతున్నారు.. వాళ్లందరి భవిష్యత్తువు నువ్వు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి.. నిండు నూరేళ్లు బతకాలి వాళ్లందరికీ నువ్వు ఆసరా అవ్వాలి అని చెప్పగానే.. ఇందు బాధగా అలా జరగాలంటే నువ్వు నాకు ఒక మాటివ్వు అని అడగ్గానే.. అపర్ణ చూస్తుండిపోతుంది.

మరోవైపు లక్కీని రాజు తిడుతుంటాడు. ఒరేయ్‌ ఆ శ్రీకాంత్‌ గాడు చాలా మంచోడు అని తీసుకెళ్లావు.. యాభై వేలతో ఐదు లక్షలు సంపాదించొచ్చు అనుకున్నాను.. తీరా చూస్తూ ఆ ల్యాప్‌టాప్స్‌ పడేయడానికి తప్పా దేనికి పనికి రావు.. ఆ ల్యాప్‌టాప్‌తో సంపాదించిన డబ్బులన్నీ ఆ లాప్‌టాప్స్‌కే పోయాయిరా అంటూ బాధపడుతుంటే లక్కీ మావ జీవితం అంటే ఒక యుద్దంరా.. యుద్దంలో గెలుపోటములు ఎంత సాదారణమో బిజినెస్‌లో లాభనష్టాలు అంతే కామన్‌ రా.. అంత మాత్రానికి అతిగా ఆలోచించి బిపీ, షుగర్‌ లు తెచ్చుకుని మన అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటామా..? మావ ఓటమికి లొంగిపోయే వాడు కాదు మావ నా ఫ్రెండ్‌.. జరిగిన నష్టాన్ని కూకటి వేళ్లతో మర్చిపోయి మళ్లీ కొత్తగా నాతో బిజినెస్‌ చేసేవాడేరా నా ఫ్రెండ్‌ ఏం జరిగినా నేనున్నాను అంటూ తప్పులు క్షమించి నన్ను విజయం వైపు నడిపించేవాడేరా నా ఫ్రెండ్‌ అదిరా నా ఫ్రెండ్‌ అంటూ రాజును పొగుడుతుంటే..

Advertisement

రాజు కోపంగా లక్కీని కొడతాడు.. మనం మోసపోయాం.. నీ ఫ్రెండ్‌ గాడి వల్ల బ్లాక్‌లో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా  డబ్బులు లేకుండా చేశావు కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టావు కదా అంటూ లక్కీని కొడుతుంటే.. ఇంతలో వాళ్ల ఫ్రెండ్‌ రాంబాబు కారులో దిగుతాడు.. రాంబాబను చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. తినడానికి తిండి కూడా లేని నువ్వేంట్రా కారులో దిగుతున్నావు అని అడగ్గానే.. రాంబాబు నేను పెళ్లి చేసుకున్నాను ఇలా కారులో దిగాను అని చెప్పగానే.. రాజు, లక్కీ షాక్‌ అవుతారు. అదేంట్రా పెళ్లి అయితే ఎవడైనా లాక్ అవుతారు కానీ ఇలా రిచ్‌ అయిన వాడిని ఫస్ట్‌ టైం చూశానురా అనగానే..

రాంబాబు ఒక రిచ్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని యాభై వేలు రాజు చేతిలో పెట్టి ఎంజాయ్‌ చేయండి అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు ఏడుస్తూ.. నాన్నమ్మ మాట ఇవ్వు అని అడుగుతుంది. దీంలో అపర్ణ మాట ఇస్తూ.. సరే ఇందు ఈరోజు నుంచి నా గుండెను రాయి  చేసుకుని మౌనంగా భరిస్తాను.. నువ్వు చెప్పినట్టు గానే చేస్తాను. కానీ నువ్వు కూడా నాకు ఒక మాటివ్వు.. అని అడగ్గానే.. ఇందు ఏంటది అని అడుగుతుంది. దీంతో అపర్ణ నువ్వు మా కోసం ఈ ఆస్తిని వదులుకోవడానికి వీల్లేదు.. ఆ రేఖ చేతుల్లో ఒడిపోకూడదు. ఏం జరిగినా సరే మీ అమ్మా నాన్నలు అనుకున్నది జరిగి తీరాలి అని చెప్పగానే.. దీంతో ఇందు ఏడుస్తూ.. అది నా చేతుల్లో లేదు.. దానికి కాలమే సమాధానం చెప్పాలి అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

రాంబాబును ఇన్సిఫిరేషన్‌ గా తీసుకున్న రాజు, లక్కీ డబ్బున్న అమ్మాయిల కోసం వెతుకుతుంటారు. లక్కీకి ఐశ్వర్య ఎదురుపడుతుంది. దీంతో లక్కీ నాకు వెతుక్కునే అవసరం లేదురా ఐశ్వర్య ఉంది అంటూ వెళ్తాడు. మరోవైపు ఇంట్లో భోజనం చేస్తున్న భ్రమరాంబ అనుమానంగా ఇందు, అపర్ణ నువ్వు చెప్పినట్టు వింటారా..? అని అడగుతుంది. దీంతో ఇప్పుడే చూపిస్తాను ఉండు అంటూ రేఖ, భ్రమరాంబ ఇద్దరూ కలసి అపర్ణను ఇందును రెచ్చగొడతారు.. అపర్ణ కోపంగా చూస్తుంటే.. ఇందు మాత్రం కూల్ గా ఉంటుంది. ఎంత రెచ్చగొట్టినా ఇందు, అపర్ణ మాత్రం కూల్‌గానే ఉంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×