E-Paper
Advertisement

Adireddy Audio Controversy: ఆదిరెడ్డి అప్పారావు ఆడియో ఇష్యూ.. ఎపిసోడ్‌కు విజయారెడ్డి ముగింపు

Adireddy Audio Controversy: ఆదిరెడ్డి అప్పారావు ఆడియో ఇష్యూ.. ఎపిసోడ్‌కు విజయారెడ్డి ముగింపు
Advertisement

Adireddy Audio Controversy: ఏపీలో రాజకీయాల ఒరవడి మారింది. ఇటీవల కాలంలో రాజకీయ నేతలు ఫోన్ ఆడియోలు లీక్ కావడం, ఆపై దుమారం రేగడం మొదలవుతోంది. తాజాగా అలాంటి వ్యవహారం గడిచిన రెండు రోజులుగా ఓ కుదుపు కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై స్వయంగా ఓ మహిళ రంగంలోకి దిగి అసలు గుట్టు బయటపెట్టింది. దీంతో ఆడియో వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది.  అసలేం జరిగింది?

ఆదిరెడ్డి అప్పారావు ఆడియో వ్యవహారం కలకలం

Advertisement

తూర్పుగోదావరి రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ వ్యవహారం గడిచిన రెండురోజులుగా ఓ కుదుపు కుదుపేస్తోంది. ఈ వ్యవహారంపై ఇంటా బయటా దుమారం రేగడంతో విజయారెడ్డి అనే మహిళ క్లారిటీ ఇచ్చింది. ఆడియోలో ఉన్నది మా అత్త చంద్రకళని అని తేల్చి చెప్పింది.

తన ప్రాణాలు కాపాడింది ఆదిరెడ్డి అప్పారావు అని స్పష్టం చేసింది. తన నుంచి భర్తను విడగొట్టి మరొక మహిళతో వివాహం చేసేందుకు మా అత్త కుట్రలు చేస్తోందని ఆరోపించింది.  తనకు నాలుగేళ్ల కిందట ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఓ ఎస్సైతో వివాహం జరిగిందని విజయారెడ్డి తెలిపింది. జాన్ అనే వ్యక్తిని మా అత్త చంద్రకళ దగ్గర బంధువు అని చెప్పి మోసం చేసి వివాహం చేసుకున్నారని తెలిపారు.

Advertisement

ఆడియోలో ఉన్నది మా అత్త- ఆడియో ఎపిసోడ్‌కు విజయారెడ్డి ముగింపు

ఆ తర్వాత వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని తేల్చి చెప్పింది. ఈ విషయం తనకు తెలియడంతో భర్త నుంచి తనను దూరం చేసేందుకు చంద్రకళ చేయని ప్రయత్నం లేదని చెప్పింది. ఇవాళ తాను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు ఆదిరెడ్డి అప్పారావు అని తేల్చిచెప్పింది. పరువు ప్రాణంగా బతుకున్న ఫ్యామిలీ మాదని, మా అత్తతో నరకం అనుభవించానని మనసులోని మాట బయటపెట్టింది.

తనకు-తన భర్తకు విడాకులు ఇవ్వాలని స్కెచ్ వేసిందని తెలిపింది. తనను ఆ ఇంట్లో నుంచి పంపించేందుకు జరిగిన కుట్రను సైతం వివరించింది. కేవలం ఆస్తి కోసం మా కుటుంబాన్ని మోసం చేసి వివాహం చేసుకున్నారని తెలిపారు. రమాదేవి గురించి వివరణ ఇచ్చింది. తన భర్త పని చేసే ఆఫీసులో రమాదేవి పని చేస్తున్నట్లు వివరించింది.

ALSO READ:  జనసేన కాదు.. కామసేన.. టీటీడీ చైర్మన్ రాసలీలలపై రోజా సంచలన వ్యాఖ్యలు

వారిద్దరి కలిపి.. తనను భర్త నుంచి వేరు చేసేందుకు మా అత్త స్కెచ్ వేసిందన్నారు. కొందరు నేతలు ఈ ఆడియోను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. దీనికి సంబంధించి ఆదిరెడ్డి అప్పారావు- చంద్రకళ అనే మహిళతో మాట్లాడిన ఫోన్ వీడియో బయటకు వచ్చింది. ఆ ఆడియోను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని దుమ్మెత్తి పోయడం వైసీపీ నేతల వంతైంది. మొత్తానికి ఆదిరెడ్డి ఆడియో వ్యవహారానికి విజయారెడ్డి ముగింపు ఇచ్చింది.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×