E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబకు రాజు వార్నింగ్    

Brahmamudi Serial Today Episode May 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబకు రాజు వార్నింగ్    
Advertisement

Brahmamudi serial today Episode: రాజు తన డబ్బుల్లో ఎందుకు కోత కోశావని అడగ్గానే.. తన నడుము చూశావని.. తనను టచ్‌ చేశావని.. అందుకే నీకు ఇచ్చే డబ్బుల్లోంచి పందొమ్మిది వేలు కట్ చేశానని వెయ్యి రూపాయలు కరెక్టుగా ఇచ్చానని చెప్తుంది ఇందు. దీంతో రాజు షాక్‌ అవుతాడు. కోపంగా ఇది పెద్ద మోసం ఇలాంటి మోసం నేను ఎక్కడా చూడలేదు. అమ్మో అమ్మో మాట్లాడేటప్పుడే కొసరి కొసరి రోజుకు పదివేలు ఫిక్స్‌ చేశావు. ఇప్పుడు వేలకు వేలు కట్‌ చేస్తే నాకేం మిగులుతుంది అంటూ అడగ్గానే..  ఇందు అమాయకంగా అందుకు నేనేం చేయలేను కదా రాజు అంటుంది. దీంతో రాజు కోపంగా ఇలంటి ఫిట్టింగ్‌లు అన్ని పెట్టి కటింగ్‌లు చేస్తావనే మీ రేఖ ఆంటీ కంపెనీలో ఇరవై లక్షలు దొబ్బేసింది. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా..? అనడంతో

ఇందు కోపంగా ఇదిగో రేపటి పేమెంట్‌ అయినా ఈ కటింగ్‌ అయినా లేకుండా కరెక్టుగా ఇవ్వాలి. అనగానే.. ఇందు అది నువ్వు చేసే ఫర్మమెన్స్‌ బట్టి ఉంటుంది. అలాగే ఇక నుంచి డైలీ పేమెంట్స్‌ ఏమీ ఉండదు వీక్లీనే ఇస్తాను అని చెప్పడంతో రాజు కోపంగా మనసులో డైలీనే దిక్కులేదు ఇక వీక్లీ ఏమిస్తుందో అనుకుంటూ.. లేదు నాకు ఏరోజు ఆరోజే కావాలి అని చెప్పగానే.. లేదు నాకు అడ్జస్ట్‌ కావడం లేదు అని ఇందు చెప్పగానే.. ఏంటి నువ్వు నువ్వు కండాషన్‌ పెడితే నేను ఓకే చెప్తున్నాను.. నేను కండీషన్‌ పెడితే నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు అయినా నీ పాటికి నువ్వు రూల్స్‌ మార్చడం ఏంటి..? అని అడగ్గానే..

Advertisement

అది నా ఇష్టం నేను ఇక్కడ ఏంది చెబితే అదే జరగాలి లేదంటే.. నీ ఇష్ట అని ఇందు చెప్పగానే.. రాజు అయితే నేను వెళ్లిపోతాను అంటాడు. ఇందు కూడా అయితే వెళ్లిపో అంటుంది. దీంతో రాజు నిజంగానే వెళ్లిపోతాను అని చెప్పగానే.. ఇందు కూడా నిజంగానే వెళ్లిపో రాజు అనగానే.. నువ్వు వెళ్లమనగానే.. వెళ్లకుండా ఎలా ఉంటాను.. గుడ్‌ బై జన్మలో ఇక నీ ముఖం కూడా చూడను అంటూ వెళ్లబోతూ.. రాజు ఆగిపోయి అదేంటి కనీసం ఆగమని కూడా అడగడం లేదు.. అయినా ఇప్పుడు నేను బయటకు వెళితే నాకు చిల్లి గవ్వ కూడా దొరకదు.. అంటూ రాజు ఆగిపోతాడు. దీంతో ఇందు వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడ ఉండటం నాకెంత అవసరమో..? నీకు అంతే అవసరం అంటూ రాజును తీసుకుని భోజనానికి వెళ్తుంది ఇందు.

అందరూ భోజనం చేస్తుంటే.. రేఖ ప్లాన్ ప్రకారం రాజును మాటల్లో పెట్టి వాళ్ల పెళ్లి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. అందుకోసం రాజు నువ్వు ఇందును ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు.. అని అడగ్గానే.. పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాను అని రాజు చెప్పగానే.. భూషణ్‌ కల్పించుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇందు కన్నా అందమైన వాళ్లు.. చదువుకున్న వాళ్లు తెలివైన వాళ్లు బయట చాలా మందే ఉన్నారు కదా..? మరి వాళ్లల్లో ఎవరినో చేసుకోకుండా ఇందునే ఎందుకు చేసుకున్నావు అని అడగ్గానే.. రాజు నవ్వుతూ నిజం చెప్పమంటారా..? లేక అబద్దం చెప్పమంటారా..? అని అడగ్గానే.. రేఖ నిజమే చెప్పు రాజు అంటుంది. దీంతో రాజు ఇందుకు ఏం తక్కువ అచ్చ తెలుగు పదహారణాల అమ్మాయిలా ఉంటుంది. తను నడుస్తుంటే నది పారుతున్నట్టు. మేఘాలు గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది. తను ఆ డ్రెస్‌ వేసుకుంటే.. అంటు చెప్పబోతుటే..

Advertisement

ఆ డ్రెస్‌కే అందం వచ్చినట్టు ఉంటుంది అంటావు అని శేషు చెప్పగానే.. భలే కరెక్టుగా చెప్పావు మామయ్య అందుకే ఇందును కాదనుకోలేక నా తిప్పలేవో నేను పడి పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే.. భ్రమరాంబ అనుమానంగా అంటే నువ్వు కేవలం తనను ఇష్టపడటం వల్లే పెళ్లి చేసుకున్నావన్నమాట.. అని అడగ్గానే.. ఇష్టమే కాదు అత్తయ్య ప్రేమించాను కూడా అని రాజు చెప్పగానే.. రేఖ ఆ ప్రేమ ఇప్పటికీ ఉందా..? అని అడుగుతుంది. దీంతో రాజు ఎందుకు లేదు రోజురోజుకు తన మీద ప్రేమ రెట్టింపు అవుతుంది అని చెప్పగానే.. రేఖ సరే ఇంతకీ  నువ్వు ఏం చేస్తుంటావు..? అని అడగ్గానే..

రాజు ఏం చేస్తాం టైంకు ఇంత తింటాం.. టైంకు నిద్రపోతాం.. సరదాగా ఫ్రెండ్స్‌తో అలా అలా తిరిగేస్తుంటాం.. అని చెప్పగానే.. రేఖ కోపంగా బతకడానిక ఏం చేస్తుంటాం అని అడగ్గానే.. ఏమీ చేయని ఇప్పుడు చేస్తాను.. అసలు ఇందును పెళ్లి చేసుకోవడానికి ఇందు ఈ ఆస్థికి ఏకైక వారసురాలు కదా..? ఈ ఆస్థి కోసం ఇందును పెళ్లి చేసుకున్నాను. అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. శేషు మాత్రం మనసులో నవ్వుకుంటూ నాకైతే ఆ రాజు గాడు ఆస్థిని తన గుప్పిల్లో పెట్టుకుని వీళ్లను ఓ ఆటాడుకుంటాడని అర్థం అవుతుంది అనుకుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×