E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ సీఈవోగా రాజు, అదిరిపోయిన ఇందు ప్లాన్ 

Brahmamudi Serial Today Episode May 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ సీఈవోగా రాజు, అదిరిపోయిన ఇందు ప్లాన్ 
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు, రాజులకు బెడ్‌ రూం ఇస్తుంది రేఖ. దీంతో రాజు బెడ్‌ రూంలోకి వెళ్లి హ్యాపీగా ఫీలవుతుంటాడు. అప్పుడే ఇందు రూంలోకి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. బెడ్‌ మీద పడి దొర్లుతూ.. చూశావా..? డబ్బులు ఎందుకు దండగ అన్నావు కానీ డబ్బులు ఉంటే ఎంత సుఖం ఉంటుందో అని రాజు చెప్పగానే.. ఇందు ప్లాష్‌బ్యాక్‌ గుర్తు చేసుకుంటుంది. రాజు మాత్రం చూడు డబ్బుంటే ఎంత సుఖాన్ని ఇస్తుందో చూడు.. ఫుడ్డు బెడ్డు ఎంత సుఖాన్ని ఇస్తుందో చూడు.. ఇప్పుడు కానీ ముసుగు తన్ని పడుకుంటే.. తెల్లారేసరికి మెలుకువ రాదు.. అంటూ పడుకోబోతుంటే.. ఇందు కోపంగా రాజును తిట్టి నేను మనిషిని కాదా..? నాకు నిద్ర రాదా అనగానే.. అయితే దా వచ్చి పడుకో నాకు నిద్రలో కాలేసే అలవాటేం లేదు రా వచ్చి పడుకో అనగానే.. నువ్వు ఎవరు అంటూ కోపంగా ఇందు అడగ్గానే.. నేను నీకు అద్దె మొగుడిని అంటాడు. గుర్తుందిగా అద్దె మొగుడివని.. నువ్వు వెళ్లి ఆ మూలన పడుకో.. అంటూ రాజుకు చెప్పగానే.. రాజు కోపంగా తిట్టుకుంటూ వెళ్లి దూరంగా పడుకుంటాడు.

స్వాతి రూంలో పడుకున్న ఐశ్వర్య నిద్రపట్టక ఇబ్బంది పడుతుంది. స్వాతి మాత్రం గురక పెడుతూ నిద్రపోతుంటుంది. ఐశ్వర్య కోపంగా స్వాతిని తిడుతూ.. అబ్బా అస్సలు కంపర్ట్‌గా లేదు.. పన్నెండు అవుతుంది. ఇక్కడ పడుకోవడం చాలా కష్టంగా ఉంది. దీని అంతటకీ ఆ ఇందునే కారణం ఇందు నాకే నిద్ర లేకుండా చేస్తావా..? అనుకుంటూ బాధపడుతుంది. ఇంతలో స్వాతి నిద్రలో ఐశ్వర్య మీద చేతులు వేస్తుంది. కాళ్లు వేస్తుంది. ఐశ్వర్య ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటే.. నిద్రలో దొర్లుతూ వచ్చి ఐశ్వర్యను వాటేసుకుంటుంది ఐశ్వర్య కోపంగా స్వాతి నిద్రలేపి తిడుతుంది.

Advertisement

మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే.. రాజు, ఇందును చూస్తుంటాడు. అప్పుడే నిద్ర లేచిన ఇందు వెంటనే రాజును చూసి గోడవ పడుతుంది. ఎందుకు చూస్తున్నావు.. అసలు ఏం చూస్తున్నావు అంటూ అడుగుతుంది. రాజు ఏం చూడలేదని చెప్పినా వినకుండా ఇందు నాకు తెలుసులే నువ్వేం చూశావో నీ ఆలోచన ఎప్పుడూ అవే కదా అంటుంది. దీంతో రాజు హలో నేను ఎప్పుడూ డబ్బు మనిషినే నువ్వునుకున్నట్టు ఆలోచనలు ఏం రావు నాకు అయినా ఎప్పుడూ నన్ను అబ్జర్వ్‌ చేయడం తప్పా నిన్న అనుకున్నదాని గురించి ఏం ఆలోచించావు అని రాజు అడగ్గానే.. ఇందు తాను సీఈవోగా పోటీ చేస్తే రేఖకు అనుమానం వస్తుంది. అందుకే సీఈవోగా కూడా నువ్వే పోటీ చేయాలని చెప్తుంది. ఇందు మాటలకు రాజు షాక్‌ అవుతాడు.

నేను సీఈవోనా..? ఒరేయ్‌ రాజుగా బంపర్‌ ఆఫర్‌ తగిలిందిరా..? ముందు అద్దె మొగుడు.. ఇప్పుడు సీఈవో ఓరేయ్‌ రాజుగా మీ దశ తిరిగిపోతుందిరా..? అని మనసులో అనుకుని సంతోషిస్తుంటే.. హలో ఏం ఆలోచిస్తున్నావు.. మళ్లీ ఏంటి లెంతీగా ఏదో ప్లాన్‌ చేస్తున్నావు అంటుంది. రాజు చేత బోర్డు మెంబర్స్‌కు కాల్ చేయించి వాళ్లు సీఈవోగా రాజును ప్రపోజ్‌ చేయమని రిక్వెస్ట్ చేయమని సూచిస్తుంది. రాజు అలాగే చేస్తాడు. బోర్డు మెంబర్స్‌ కు కాల్ చేసి మాట్లాడతాడు. ఆ బోర్డు మెంబర్‌ తాను రేఖ మనిషిని అని రాజు తిట్టి రేఖకు నిజం చెప్తానని అనడంతో రాజు కాల్ కట్‌ చేస్తాడు. రాజు భయంగా వీడు రేఖకు చెప్పడు కదా..? అనగానే.. కచ్చితంగా చెప్తాడు. అంతకన్నా ముందే నేనే వెళ్లి ఈ విషయం ఆంటీకి చెప్తాను అంటూ ఇందు వెళ్లి రేఖకు విషయం చెప్తుంది. దీంతో రేఖ నవ్వుతూ.. వాడనుకున్నంత ఈజీ కాదు సీఈవో అవ్వడం వాడికి ఎవ్వరూ సపోర్ట్ చేయరు.. అందరూ నాకే సపోర్టు చేస్తారు అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×