E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్ చేసిన రాజు 

Brahmamudi Serial Today Episode May 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్ చేసిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: మదన్‌ను తాను ప్రేమిస్తున్నానని కానీ మీ ఇద్దరికి పెళ్లి చేయబోతున్నారు అంటూ స్వాతి, ఇందుతో బాధపడుతుంటే.. నీ ప్రేమను నేను ఓడిపోనివ్వను.. ఎలాగైనా నీ ప్రేమను గెలిపిస్తాను.. నేను చెప్తున్నాను కదా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పగానే.. స్వాతి సరే అక్కా అని చెప్తుంది.

మరోవైపు లక్కీ ఒరేయ్‌ నేను ఒకటి అడుగుతాను చెప్తావా..? అని అడగ్గానే.. ఏంటో అడగరా అంటాడు రాజు. మొన్న పది లక్షలు ఏం చేశావు చెప్పరా..? ఆ పది లక్షలు ఏం చేశావు అని అడగ్గానే.. నేను వేరే అవసరానికి వాడుకున్నాను అంటూ రాజు చెప్పగానే.. ఏం అవసరంరా ఏ అవసరం ఉండి మొన్న పంజాగుట్ట హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లావు.. అసలు హాస్పిటల్‌ లో ఎవరిని కలవడానికి వెళ్లావు.. నేను చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగాను. కలిసి తిరిగాను.. నీ జీవితంలో ఏ సీక్రెట్‌ లేవని నమ్మాను మామ కానీ నన్నే ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. ఐశ్వర్యకు ఆ పది లక్షలు ఇచ్చి నా లైఫ్‌ ను సెటిల్‌ చేసుకుందాం అనుకున్నాను.. కానీ నీ స్వార్థం నువ్వు చూసుకుంటావనుకోలేదు.. అంటూ లక్కీ అడగ్గానే.. రాజు కోపంగా స్వార్థమా…? చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగాను అన్నావు.. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది. అంటూ కోప్పడగానే.. లక్కీ అవున్రా నాకు అదే అర్థం అయింది. అసలు ఆ డబ్బులు నువ్వు ఎవరి కోసం ఖర్చు పెట్టావు.. చెప్పరా..? అని నిలదీయగానే.. రాజు నేను చెప్పను అంటాడు.

Advertisement

దీంతో లక్కీ నన్ను పరాయివాడిని చేస్తున్నావా..? అని అడగ్గానే.. నేనేం నిన్ను పరాయివాడిని చేయలేదు అని రాజు చెప్పగానే.. మరెందుకు రా నాతో దాస్తున్నావు.. సరే ఈ విషయం నాతో దాస్తున్నావో.. నీ గుండెల్లో మోస్తున్నావు నాకు తెలియడం లేదు కానీ ఆ పది లక్షలు ఐశ్వర్యకు ఇస్తే నా లైఫ్‌ సెట్‌ అవుతుందిరా దాని గురించి ఏం చేయాలో అది ఆలోచించు అంటూ వెళ్లిపోతాడు. ఇంతలో రాజుకు ఇందు ఫోన్‌ చేస్తుంది. రాజు ఎందుకు ఫోన్‌ చేశావు అని అడగుతాడు. ఎలా ఉన్నావు అని అడుగుతావు అనుకుంటే ఎందుకు ఫోన్‌ చేశావు అంటున్నావేంటి..? అంటూ తనకు రేఖ చేయబోయే పెళ్లి గురించి చెప్పి తనకు పెళ్లి ఇష్ట లేదని ఈ పెళ్లిని నువ్వే ఆపాలని.. నువ్వు పెళ్లి ఆపితే ఎంత డబ్బైనా ఇస్తానని చెప్తుంది ఇందు. దీంతో ఇప్పటికిప్పుడు పెళ్లి ఆపమంటే ఎలా చెప్పు అంటాడు రాజు. దీంతో ఇందు, రాజును కన్వీన్స్‌ చేసి పెళ్లి ఎలా ఆపాలో చెప్తుంది. ఇందు మాటలకు రాజు షాక్‌ అవుతాడు. ఇందు ప్లాన్ చెప్పి ఓకేనా నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే చాలు అంటుంది. రాజు కూడా అయితే నేను అడిగినట్టు డబ్బు ఇవ్వాలి అంటాడు. ఇందు సరే అంటుంది.

మరోవైపు భ్రమరాంబ మదన్‌, ఇందుల పెళ్లిని ఎలాగైనా ఆపాలని ఆలోచిస్తుంది. భ్రమరాంబను చూసిన శేషు వెటకారంగా మాట్లాడతాడు. దీంతో భ్రమరాంబ కోపంగా శేషును తిడుతుది. దీంతో ఇద్దరు కలిసి పెళ్లిని ఆపే ప్లాన్‌ ఆలోచిస్తారు. మరోవైపు భూషణ్‌, రేఖతో మనం ఎన్ని చేసినా ఫెయిల్‌ అవుతున్నాం. కనీసం ఈ పెళ్లైనా చేస్తామా.. అని డౌట్‌ క్రియేట్ చేయగానే.. ఎలాగైనా ఈ పెళ్లి చేయాలి ఎవరు దిగొచ్చినా ఈ పెళ్లిని మాత్రం ఆపలేరు అంటూ చెప్తుంది.

Advertisement

మరుసటి రోజు అందరూ కలిసి రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వెళ్లి పెళ్లి చేసుకుందాం పదండి అంటూ రేఖ పిలవగానే.. అందరూ వస్తారు. ఇందు మాత్రం నేను ముందు గుడికి వెళ్లి గౌరీ పూజ చేసుకుని వస్తానని చెప్తుంది. అందుకు రేఖ ఒప్పుకోదు. అయినా వినకుండా అపర్ణ, ఇందు, రేఖను రిక్వెస్ట్‌ చేస్తారు. ఆంటీ మీరంటే నాకు అభిమానం, భయం రెండు ఉన్నాయి. గుడికి వెళ్లి వస్తాను అంటూ అడుగుతుంది. దీంతో రేఖ భ్రమరాంబ వస్తుంది అందరూ వెళ్లి రండి అంటూ చెప్పగానే.. సరే అంటూ అందరూ కలిసి వెళ్తారు. కారు డ్రైవర్‌గా రాజు వస్తాడు. భ్రమరాంబ, ఇందు కారులో గుడికి వెళ్తుంటారు. కారులో వెళ్తున్న భ్రమరాంబ ఇందును తిడుతుంది. పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అంటూ నిలదీస్తుంది. ఇంతలో రాజు కారు ఆపేసి కత్తితో భ్రమరాంబను బెదిరిస్తూ.. కారులోంచి దిగమని చెప్తాడు. ఎందకని అడగ్గానే.. ఇందును కిడ్నాప్‌ చేయడానికి వచ్చానని చెప్పి భ్రమరాంబను కారు దించేసి ఇందును తీసుకుని వెళ్లిపోతాడు రాజు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×