E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లిన ఇందు 

Brahmamudi Serial Today Episode May 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లిన ఇందు 
Advertisement

Brahmamudi serial today Episode: రాజు కత్తితో బెదరిస్తూ భ్రమరాంబను కారులోంచి దించేస్తాడు. దీంతో భ్రమరాంబ కారు దిగి వెళ్లిపోతున్నట్టు నటిస్తూ.. రాజు చేతిలో కత్తి లాక్కుని రాజును బెదిరిస్తుంది. దీంతో రాజు కారు దిగి భ్రమరాంబను బెదిరించి కత్తి లాక్కుని ఇందును తీసుకుని వెళ్లిపోతాడు.

మరోవైపు మదన్‌ను పెళ్లికొడుకుని చేస్తుంటారు రేఖ, భూషణ్‌. మదన్‌ మాత్రం డల్లుగా చూస్తూంటాడు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటి నాన్న ఇలా మూడీగా ఉన్నావు ఈ రోజు నీ పెళ్లి కొంచెం సంతోషంగా ఉండు..అంటూ రేఖ చెప్పగానే.. భూషణ్‌ వాడికి ఇష్టం లేని పెళ్లి కదా ఇంకేం సంతోషంగా ఉంటాడు అనగానే.. రేఖ నువ్వేం బాధపడకు నాన్న నేను చెప్పడం వల్లే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు.. దీనివల్ల నీ లైఫ్‌ బాగుంటుంది. అంతే కానీ నీకు ఏ ప్రాబ్లమ్‌ రాదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పని వల్ల మీ అమ్మమ్మ ఎన్నో ఏళ్ల కింద కల నిజం కాబోతుంది. మేమంతా ఇన్నాళ్లుగా చేయలేనిది నువ్వు చేయబోతున్నావు.. నీ వల్ల దుగ్గిరాల ఆస్థి మొత్తం మన చేతుల్లోకి రాబోతుంది అని చెప్పగానే.. భూషణ్‌ కూడా అవునురా నువ్వు ఈ ఇంటికే యువరాజు అవబోతున్నావు.. నీతో పాటు మేము కూడా కోటీశ్వరులం అవబోతున్నాం. ఇక మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇన్నాళ్లు మేము డబ్బుకోసం పది మంది చుట్టు తిరిగాం.. ఇక మీదట ఆ డబ్బు కోసం ఆ పది మందే మన చుట్టూ తిరుగుతారు.. అని చెప్తాడు.

Advertisement

రేఖ కూడా అవును నాన్న నువ్వు కేవలం ఇందు మెడలో తాళి కట్టు మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను.. ఇక నుంచి నీ లైఫ్‌ చాలా అద్బుతంగా ఉంటుంది అంటూ చెప్తుండగానే.. అప్పుడే రూంలోకి స్వాతి వస్తుంది. స్వాతిని చూసిన మదన్‌ ఏయ్‌ స్వాతి పెళికొడుకు గెటప్‌లో ఎలా ఉన్నాను.. ఈ డ్రెస్‌ నాకు సూట్‌ అయిందా..?అని అడగ్గానే.. స్వాతి డల్లుగా చాలా బాగున్నావు బావ. డ్రెస్‌ కూడా చాలా బాగుంది అని చెప్తుంది. థాంక్యూ స్వాతి.. కానీ ఏం చేస్తాం.. పోయి పోయి ఒక చదువు రాని దద్దమ్మను పెళ్లి చేసుకుంటున్నాను అని మదన్‌ చెప్పగానే.. మరి అంత ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం ఎందుకు..? అంటుంది. స్వాతి మాటలకు రేఖ, భూషణ్‌ షాక్‌ అవుతారు. ఇంతలో మదన్‌ మా మమ్మీ కోసం అని చెప్తాడు. దీంతో స్వాతి మీ మమ్మీ కోసం ఏమైనా చేస్తావా..? బావ అని అడగ్గానే.. అవును ఏమైనా చేస్తాను అంటూ మదన్‌ చెప్తుండగానే.. రేఖ కోపంగా ఏయ్‌ ఏంటే నేను సైలెంట్‌గా ఉన్నానని ఏదేదో అడిగేస్తున్నావు.. ఇంతకీ మీ మమ్మీ గుడి నుంచి వచ్చిందా..? చెప్పు మీ అక్క గుడి నుంచి వచ్చిందా..? అని అడగ్గానే.. స్వాతి రాలేదు అని చెప్పగానే.. అందరూ హాల్లోకి వెళ్తారు.

అపర్ణను పిలిచి ఇందు ఇప్పటి వరకు రాలేదు ఏంటి..? అంటూ కోప్పడుతుంది. దీంతో అపర్ణ నన్ను అడగడం ఏంటి..? నా మనవరాలికి తోడుగా పంపించావు కదా మీ వదినకు ఫోన్‌ చేసి కనుక్కో అని చెప్పగానే.. భూషణ్‌ ఫోన్‌ చేయబోతుండగానే.. భ్రమరాంబ కంగారుగా పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది. ఇందు ఎక్కడ అని అడగ్గానే..ఇంకెక్కడి ఇదు రేఖ వాడెవడో వచ్చి ఎత్తుకెళ్లిపోయారు అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ, సుభాష్‌ బాధపడుతుంటే.. మీ నాటకం బాగుంది.. ఇంతకీ ఇందును ఎక్కడ దాచారు చెప్పండి.. అంటూ రేఖ తన గన్‌ తీసి అపర్ణను కాల్చేస్తానని ఏయిమ్‌ చేస్తుంది. నేను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే నేను ఎంతదూరం అయినా పోతానని నీకు తెలియదా..? చెప్పు ఆంటీ నీ మనవరాలు ఎక్కడ ఉంది… చెప్పు ఆంటీ నీ ప్రాణాలు కావాలో.. మనవరాలు కావాలో తేల్చుకో.. అనగానే.. అపర్ణ కోపంగా ఏంటి చంపేస్తావా..? కాల్చేస్తావా..? అంటుంది. దీంతో రేఖ కోపంగా షూట్ చేస్తాను అంటుంది.

Advertisement

అపర్ణ కోపంగా షూట్‌ చేయ్‌ అనగానే.. రేఖ కాల్చబోతుంటే.. రాజు ఆగండి అంటూ అరుస్తాడు. అందరూ గుమ్మం వైపు చూడగానే.. రాజు, ఇందు పెళ్లి చేసుకుని వస్తారు. వాళ్లను చూసిన అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ, సుభాష్‌ ఆశ్చర్యపోతారు. రాజు లోపలికి వెళ్లి అందరికీ నమస్కారం కొత్తగా బంధాలు ఏర్పరుచుకున్న నా బంధుమిత్రులందరికీ నమస్కారం అంటూ చెప్తుంటే.. అపర్ణ ఏవండి నా కొడుకు.. నాన్న రాజ్‌.. అంటూ ఏడుస్తూ.. ఎమోషనల్‌ అవుతుంటే.. రేఖ కోపంగా ఆంటీ తను నీ కొడుకు కాదు.. తనకు ఈ ఇంటికి అసలు సంబంధం లేదు అంటూ ఇందును కొట్టబోతుంటే.. రాజు అడ్డుపడతాడు.. రాజు మాటలుక అపర్ణ, సుభాష్‌ ఎమోషనల్ అవుతారు. రేఖ, మిగతావారు షాక్‌ అవుతారు.

రేఖ.. రాజును కూడా తిడుతుంది. ఎవడ్రా నువ్వు అంటూ నిలదీస్తుంది. ఏంటి ఈ నాటకం అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఇందు నిజంగానే ఈ తాళి నా మెడలో కట్టాడు ఆంటీ అంటూ ఇందు చెప్తుంది. దీంతో భ్రమరాంబ, శేషు మనసులో హ్యాపీగా ఫీలవుతారు. ఇందును పెళ్లి చేసుకునేంత పరిచయం నీకెక్కడిది అంటూ రేఖ అడగ్గానే.. ఇందును కిడ్నాప్‌ చేసినప్పుడు పరిచయం అయింది అంటూ తనే ఆ కిడ్నాపర్‌ అన్న నిజం చెప్తాడు రాజు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×