BigTV English

Brahmamudi Serial Today November 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  అనామికను దిగజారి బతుకుతున్నావన్న కళ్యాణ్‌ – క్లయింట్స్‌ ముందు రాజ్‌ ను పొగడ్తలతో ముంచెత్తిన కావ్య

Brahmamudi Serial Today November 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  అనామికను దిగజారి బతుకుతున్నావన్న కళ్యాణ్‌ – క్లయింట్స్‌ ముందు రాజ్‌ ను పొగడ్తలతో ముంచెత్తిన కావ్య

Brahmamudi serial today Episode:  స్వరాజ్‌ కంపెనీతో బిజినెస్‌ చేయమని వెళ్లిపోయిన క్లయింట్స్‌ అందరూ కావ్యను కలవడానికి క్యూ కడుతుంటారు. కావ్య అపాయింట్‌ మెంట్ కావాలని రాజ్‌కు ఫోన్‌ చేస్తుంటారు. వాళ్ల ఫోన్లతో విసిగిపోయిన రాజ్‌ అందరితో వెటకారంగా మాట్లాడుతుంటాడు. ఇంతలో రాజ్‌ క్యాబిన్‌ లోకి వచ్చిన శృతి గుడ్‌ మార్నింగ్‌ మేనేజర్‌ గారు అంటుంది. దీంతో రాజ్ కోపంగా శృతిని చూస్తూ..  నేను మేనేజర్‌ ను అని గుర్తు చేస్తున్నావా..? అంటాడు. అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు. సార్‌ పాత మేనేజర్‌ ను పిలిచి పిలిచి అలవాటై పోయింది అంటుంది శృతి.


నువ్వు ఏ ఉద్దేశంతో పిలిచావో.. మీ మేడం ఏ ఉద్దేశంతో పిలిపిస్తుందో అర్థం కానంత పిచ్చోన్ని అనుకున్నావా..? అయినా మీ మేడం అపాయింట్‌ కోసం ఎవరెవరో నాకు కాల్‌ చేస్తున్నారేంటి? అని రాజ్‌ అడగ్గానే మేడం అపాయింట్‌ మెంట్స్‌ అన్ని మేనేజర్‌ గా చూసుకోవడం మీ బాధ్యత కదా సార్‌ అని చెప్తుంది శృతి. దీంతో రాజ్‌ ఇరిటేటింగ్‌ గా నేను ఈ కంపెనీకి మేనేజర్‌ నా..? ఆవిడకు పర్సనల్‌  అసిస్టెంట్‌ నా..? అంటాడు. దీంతో శృతి.. కోపంలో కూడా మీరు మేనేజర్‌ ను అని ఒప్పుకున్నారు సార్‌ అంటూ వెళ్లిపోతుంది.

రాజ్‌ కోపంగా కావ్య చాంబర్‌ లోకి వెళ్తాడు. కావ్య చూసి చూడనట్టు ఉంటుంది. దీంతో రాజ్‌ నేను వచ్చింది కనబడలేదా..? అని అడుగుతాడు. అందుకే తల ఎత్తి చూశాను కదా? కూర్చోండి అంటుంది కావ్య. అక్కర్లేదులే… ఎందుకు వచ్చానో అడగవా..? అంటాడు రాజ్‌. ఇందాక వచ్చిన మీకే ఎందుకు వచ్చారో తెలియదా..? అని కావ్య అడగ్గానే రాజ్‌ ఇరిటేటింగ్‌ గా పొగరు అంటాడు. దీంతో కావ్య ఏంటి ఏమన్నారు అని కోపంగా అడుగుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్దం జరగుతుంది. తర్వాత రాజ్‌ నీ అపాయింట్‌ మెంట్ కావాలని పాత క్లయింట్స్‌ అడుగుతున్నారు అని చెప్తాడు. సరే లంచ్‌ తర్వాత మీటింగ్‌ అరైంజ్‌ చేయండి అని కావ్య చెప్తుంది.


కళ్యాణ్‌ ఆటో నడపడం అనామిక చూస్తుంది. కళ్యాణ్‌ ఆటోకు తన కారును ఎదురుగా తీసుకెళ్లి కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి చూశావా..? నన్ను కాదనుకున్నందుకు నీ బతుకు ఎంత దిగజారిపోయిందో అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. దీంతో కళ్యాణ్‌ నా కాళ్ల మీద నేను నిలబడటం దిగజారిపోవడం కాదు. పరాయి మగాడి పక్కన కారులో కూర్చున్నావు చూడు నీది దిగజారిపోయిన బతుకు అంటూ కౌంటర్‌ ఇస్తాడు కళ్యాణ్‌. దీంతో అనామిక కోపంగా కళ్యాణ్‌ తిడితే కళ్యాణ్‌ కామ్‌ గా వెళ్లిపోతుంటాడు. ఇంతలో అనామిక కళ్యాణ్‌ను ఫోటో తీస్తుంది. ఎందుకు ఫోటో తీశావని సామంత్‌ అడిగితే.. ఆ దుగ్గిరాల కుటుంబ పరువు తీయడానికి ఇదే మనకు ఆయుధం అంటుంది అనామిక.

మీటింగ్‌ కు వచ్చిన క్లయింట్స్ తో తనను ఎందుకు కలవాలనుకున్నారని అడుగుతుంది కావ్య. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏయ్‌ ఏం మాట్లాడరేంటయ్యా… మేడంతో మాట్లాడాలని ఫోన్‌ లో నా బుర్ర తిన్నారు. ఇక్కడకు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంటయ్యా..? అని అడుగుతాడు. ఇంతలో ఒక క్లయింట్‌ ఫోన్‌ లోనే మీకు అంతా చెప్పాము కదా సార్‌ అంటాడు. దీంతో రాజ్‌ కోపంగా ఏంటి నేను మీకు మీడియేటర్‌ లాగా కనిపిస్తున్నానా..? ఏం చెప్పాలో ఆవిడతోనే చెప్పండి అంటాడు రాజ్‌. ఇంతలో కావ్య మా కంపెనీతో బిజినెస్‌ వద్దు అనుకుని వెళ్లిపోయారు కదా? మరి నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అని అడుగుతుంది.

అలా అనుకుని వెళ్లడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు  తెలుసుకున్నాం మేడం అంటాడు ఒక క్లయింట్‌..  నిన్నటి వరకు ఈ కంపెనీ మీకు నష్టాలు తెచ్చిపెడుతుంది అనుకున్న మీరు సడెన్‌ గా ఇప్పుడు ఇలా ఎందుకు అనుకుంటున్నారు అని కావ్య అడుగుతుంది. దీంతో  కారణం ఆ అనామిక మేడం. ఆవిడ తన కంపెనీలో జాయిన్‌ అయితే ఎక్కువ లాభాలు తీసుకొస్తానని నమ్మించారు. అదే సమయానికి ఇక్కడ రాహుల్‌ మాతో సరిగ్గా డీల్‌ చేయకపోతే అదే సరైన నిర్ణయం అనుకున్నాము అని చెప్తారు. అనామిక ను తింగరిది.. బిజినెస్‌ చేయడం రాదని తిడతారు. తర్వాత కావ్య బిజినెస్‌ డీల్‌ మాట్లాడి అందరితో అగ్రిమెంట్‌ పేపర్స్‌ పై సంతకాలు తీసుకుంటుంది.

సిటీలోనే పెద్ద యాడ్‌ డైరెక్టర్‌‌ ను పిలిచి ఒక డాక్యుమెంటరీ చేయాలని డబ్బు ఎంతైనా పర్వాలేదని చెప్తుంది. అతను సరేనని చెప్తాడు. అయితే ఇది ఒక ఆటోడ్రైవర్‌ (కళ్యాణ్‌) మీద చేయాలని ఇందులో ట్విస్టు ఏంటంటే మీరు డాక్యుమెంటరీ చేస్తున్నట్టు ఆ ఆటో డ్రైవర్‌‌ కు తెలియకూడదని చెప్తుంది.  సరేనని డైరెక్టర్‌ చెప్తాడు. దీంతో అతనికి అడ్వాన్స్‌ ఇస్తుంది అనామిక.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం పై నర్మదకు అనుమానం.. శ్రీవల్లి దొరికినట్లేనా? చందు పై రామరాజు సీరియస్..

Intinti Ramayanam Today Episode: పల్లవి చెంప పగలగొట్టిన అవని.. తమ్ముడి కోసం అవని షాకింగ్ నిర్ణయం..

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఫాలో చేసిన రాజ్‌ – క్యాన్సర్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన కావ్య

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 11th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

×