BigTV English

Pawan kalyan tour in pithapuram: షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?

Pawan kalyan tour in pithapuram: షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?

Pawan kalyan tour in pithapuram: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతలు పార్టీల మారడం కాసేపు పక్కనబెడితే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.


ఈ నేపథ్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి రానున్నారు. తొలుత రెండురోజుల పర్యటన ఖరారు చేసినప్పటికీ, కేవలం ఒక్కరోజుకే కుదించినట్టు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. మరి కొన్ని ప్రారంభోత్సవాలు చేయనున్నారట.

సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గన్నవరం నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నేరుగా కాకినాడ మీదుగా పిఠాపురం వెళ్లనున్నారు.


ససాతన ధర్మాన్ని కాపాడేందుకు నారసింహ వారాహి సేన విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేనలో ఇదొక విభాగం అన్నమాట. ఇటు ఏపీ, అటు తెలంగాణలోనూ ఈ విభాగం పని చేయనుంది. దీని ద్వారా అన్ని మతాలను గౌరవిస్తామని ఆ మధ్య తిరుపతి వారాహి సభలో ఓపెన్‌గా చెప్పారు పవన్ కల్యాణ్.

ALSO READ: కార్తీక సోమవారం  ఎఫెక్ట్.. పుష్కరిణి వద్ద రద్దీ.. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రాక.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

పిఠాపురం వేదికగా సనాతన ధర్మం పరిరక్షణకు కొత్తగా ఓ విభాగాన్ని పవన్‌ కల్యాణ్ ప్రారంభిస్తారని హిందూ సంఘాలు భావిస్తున్నాయి. అయితే షెడ్యూళ్లలో మార్పులు జరగడంతో కేవలం శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలకు డిప్యూటీ సీఎం పరిమితం కావచ్చని అంటున్నారు.

ఇంతకీ పవన్ మదిలో ఏముంది? హిందూ సంఘాలు భావించినట్టుగా పిఠాపురంలో పరిరక్షణకు ప్రత్యేకంగా వింగ్‌ను ఏర్పాటు చేస్తారా? సమయంలో లేదని కొద్దిరోజులు బ్రేక్ ఇస్తారా? అన్నది వెయిట్ అండ్ సీ.

Related News

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Chandrababu OG: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్, చంద్రబాబు ఏం అన్నారంటే?

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

TDP Leader Arrest: నకిలీ మద్యం కేసులో.. టీడీపీ నేత సురేంద్ర బాబు అరెస్ట్

Auto Driver Sevalo Scheme: ఆటోల్లో చంద్రబాబు, పవన్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు

Vijayawada News: ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం.. మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

Ambati Rambabu: అమెరికాలో అంగరంగ వైభవంగా.. అంబటి రాంబాబు కూతురు పెళ్లి, రిసెప్షన్ ఎక్కడ?

Amaravati News: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఇక మీరెందుకు? కళ్లెం వేయాల్సిందే

Big Stories

×