BigTV English

Air Hostess Earnings: ఏడాది సంపాదన ఒక్కనెలలోనే.. అందాలతో వ్యాపారం చేసే ఎయిర్ హోస్టెస్!

Air Hostess Earnings: ఏడాది సంపాదన ఒక్కనెలలోనే.. అందాలతో వ్యాపారం చేసే ఎయిర్ హోస్టెస్!

Air Hostess Earnings| ధనమేరా అన్నిటికీ మూలం అన్ని అన్నారు పెద్దలు. అందుకే డబ్బు ఆశ అందరికీ ఉంటుంది. ధన ఎంత సంపాదించినా తక్కువే. అందుకే అందరూ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు.. సంపాదించే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఇప్పుడు చేసే పనికంటే మరో పనిచేస్తే.. ఇంకా ఎక్కువ సంపాదించ వచ్చు అని తెలిస్తే చాలు అటువైపు వెళ్తిపోతుంటారు. అలాంటి పనే ఒక మహిళా ఎయిర్ హోస్టెస్ చేసింది. కానీ ఆమె చేస్తున్న కొత్త పని సరియైనదో కాదో మీరే నిర్ణయించాలి.


వివరాల్లోకి వెళితే.. ‘అలన్నా పౌ’ అనే యువతి 18 ఏళ్ల వయసులోనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం సాధించింది. ఆమె రెండేళ్లపాటు ఆ ఉద్యోగం చేసిన తరువాత ఆమె తనకు వచ్చే సంపాదన చాలా తక్కువ అని భావించింది. ఆమె వార్షిక వేతనం 49000 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ.26 లక్షలు). ఆ ఒక్కసారి విమానంలో డ్యూటీ చేస్తే.. రోజుకు 14 గంటలు పనిచేయాలి. రెగులర్ గా ట్రిప్పులకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఆమె చాలా అలసటగా ఫీలయ్యేది. కానీ తన స్నేహితులు, ఫ్లైట్ లో పరిచయమయ్యే కస్టమర్లందరూ ఆమె చాలా అందంగా ఉన్నావని ప్రశంసించేవారు.

Also Read: ‘చనిపోయిన నీ భర్త రక్తం అది.. నీవే శుభ్రం చేయాలి’.. దళిత గర్భవతికి ఆస్పత్రిలో అవమానం


కొంతమంది అయితే అలన్నా ను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా పనిచేయాలని సూచించారు. అయితే అలన్నా ముందుగా ఆ పనిచేయాలా వద్దా అని సంశయంలో పడింది. అప్పుడు ఆమెకు ఒక ప్లాన్ తట్టింది. ఉద్యోగం మానేయకుండా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేద్దామని ఆమె భావించింది. అందుకోసం కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసి.. రోజు తన వీడియోలు షేర్ చేసేది. ఆమె వీడియోలు చూసిన చాలామంది ఆమెకు అడల్డ్ కంటెంట్ క్రియేటర్ గా మారాలని సూచించారు. కానీ అలన్నాకు తన శరీరం చూపించాలంటే మొదట్లో సిగ్గుగా ఉండేది. అయినా ధైర్యం చేసి బికినీ ఫొటోలు షూట్ చేసి అప్ లోడ్ చేసింది.

ఆ వీడియోలకే విపరీతంగా వ్యూస్ వచ్చాయి. ఆ ఛానెల్ ద్వారా ఆమె మొదటి నెలలోనే తన ఎయిర్ హోస్టెస్ గా సంపాదించే దాని కన్నా ఎక్కువ సంపాదించింది. కేవలం ఒక్క నెలలోనే ఆమె తన అడల్ట్ ఫొటోలు, వీడియోల ద్వారా 60000 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ.32 లక్షలు). ఆ డబ్బులు చూసి అలన్నా సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతో ఆమె రెగులర్ వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది. ఒకవైపు విమానంలో ఫ్లైట్ అంటెండెంట్ గా డ్యూటీలో ఉన్నా.. తనతోటి విమాన సిబ్బంది కన్నా విలాసవంతమైన హోటల్ రూమ్ లు అద్దెకు తీసుకొని ట్రిప్ కు వెళ్లిన సమయంలో కూడా ఇంటర్నెట్ లో వీడియోలు షేర్ చేసేది.

కానీ ఆమె అడల్ట్ కంటెంట్ సోషల్ మీడియాలో పెడుతున్న విషయం.. ఆమె కంపెనీకి తెలిసిపోయింది. దీంతో ఆమెను ఉద్యోగానికి రాజీనామా చేయమని కంపెనీ తెలిపింది. కంపెనీ నియమాల ప్రకారం.. ఆమె అడల్ట్ కంటెంట్ క్రియేటర్ చేయడంతో తమ పరువు పోయిందని చెప్పారు.

ఇప్పుడు అలన్నా వయసు 21. ఆమె వద్ద కోట్ల సంపాదన ఉంది. ఆమె ఖరీదైన వస్తువులు మాత్రమే కొంటుంది. జీవితంలో ప్రతిరోజు విలాసవంతంగా గడుపుతుంది. ఒకప్పుడు తనకు ఇష్టం లేకపోయినా అడల్ట్ కంటెంట్ క్రియేటర్ గా మారి ఎంజాయ్ చేస్తోంది.

Related News

Japanese Pet Trend: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Comedy video: లిఫ్ట్ బయట ఈ పిల్లోడు చేసిన పని చూస్తే.. నవ్వు ఆపకోలేరు భయ్యా..!

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

Big Stories

×