E-Paper
Advertisement

Brahmamudi Serial Today October 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కనకం ఇంట్లోంచి వెళ్లిపోయిన రాజ్ – కావ్యను కన్వీన్స్ చేసిన అపర్ణ

Brahmamudi Serial Today October 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కనకం ఇంట్లోంచి వెళ్లిపోయిన రాజ్ – కావ్యను కన్వీన్స్ చేసిన అపర్ణ
Advertisement

Brahmamudi serial today Episode:  కనకం ఇంటికి వచ్చిన దుగ్గిరాల కుటుంబం. అందరూ డెకరేషన్‌ పనిలో ఉండగా అపర్ణ, ఇందిరాదేవి కిచెన్‌లోకి వెళ్తారు. వారి వెనకాలే వెళ్లిన కనకం అయ్యో మీరు వంట చేయడం ఏంటి అని బాధపడుతుంది. మీకేం కావాలో చెప్పండి చిటికెలో చేస్తాను అంటుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా కనకం నెత్తిమీద మొట్టికాయ వేసి ఓసే పిచ్చిదానా మనం నాటకం ఆడుతున్నాము.. అది మర్చిపోయి నువ్వు తిరిగితే రాజ్‌ పసిగట్టేస్తాడు అని చెప్తుంది. దీంతో అవును కదా? మనం నాటకం ఆడుతున్నాం. ఆ విషయమే మర్చిపోయాను అంటూ ఇప్పుడు చూడండి నాటకం ఎలా రక్తి కట్టిస్తానో అని చెప్తుంది.

తన రూంలోకి వెళ్ళిన కనకం. బ్లడ్‌ బాటిల్‌ ఎక్కడ పెట్టానా అని వెతుకుతుంది. ఇంతలో రాజ్… కనకం రూంలోకి వస్తాడు. అత్తయ్య గారు నేను మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. నిన్న మీతో మాట్లాడిన తర్వాత నా ఫ్రెండ్స్‌ లో ఉన్న డాక్టర్స్‌ అందిరితో  మాట్లాడాను. అందులో ఒకరు క్యాన్సర్‌ స్పెషలిస్టు.. అని తెలిసింది. అతనికి మీ గురించి మొత్తం చెప్పాను. మీ రిపోర్ట్స్‌ ఒకసారి చూస్తానన్నాడు. మీరు రిపోర్ట్స్‌ ఇస్తే అతనికి నేను సెండ్‌ చేస్తాను అని చెప్తాడు రాజ్‌.

Advertisement

కనకం షాక్‌ అవుతుంది. లేని రిపోర్ట్స్‌ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి. రిపోర్ట్స్‌ లేవంటే ఇప్పుడు అల్లుడిగారికి అనుమానం వస్తుంది.  అని మనసులో అనుకుంటూ కంగారు పడుతుంది. ఇంతలో రాజ్ మరోసారి అత్తయ్య గారు రిపోర్ట్స్‌ మీరు ఇస్తే అవి నేను డాక్టర్‌ కు పంపిస్తాను అంటాడు. అయితే సరే బాబు కానీ ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి బాబు. ఇవాళ మొత్తం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను.  రేపు మీకు రిపోర్ట్స్‌ మాత్రమే కాదు. నేను కూడా డైరెక్టుగా డాక్టర్‌ దగ్గరకే వస్తాను. అప్పుడు నన్నే టెస్ట్‌ చేయోచ్చు అని చెప్తుంది. దీంతో అవును అత్తయ్య ఈ హ్యాపీ మూమెంట్‌లో మీరు మళ్లీ బాధపడటం ఎందుకులే అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు.

రూంలోకి బయటకు వస్తున్న కనకానికి  కావ్య  ఎదురుపడుతుంది. కనకం ఎటూ వెళ్లకుండా అడ్డుపడుతుంది. దీంతో కనకం ఏంటే ఇలా అడ్డుపడుతున్నావు అని అడుగుతుంది. అమ్మా  ఇక్కడ ఏం జరుగుతుంది అని పశ్నిస్తుంది. దీంతో కనకం ఇరిటేటింగ్‌ గా రామాయణం అంతా విని రాముడికి సీత ఏమౌతుంది అని అడిగిందట నీలాంటిది. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం అవ్వటం లేదా? మా పెళ్లి రోజును మీ అత్తారింటి వాళ్లు గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేస్తున్నారు అని చెప్తుంది కనకం.

Advertisement

అవునా అదే అడుగుతున్నా వాళ్లు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది కావ్య. అది నన్నడిగితే నాకెలా తెలుస్తుందే..? వెళ్లి వాళ్లనే అడుగు అంటుంది కనకం. అవునా వాళ్లు రావడానికి కారణం నువ్వు కదా? నువ్వే ఏదో చేశావు. మా అత్తగారు చేశారంటే ఏమో కానీ మీ అల్లుడు గారు వచ్చి చేస్తున్నారంటేనే నాకు డౌట్‌ గా ఉంది. నువ్వే ఏదో చేశావు అంటూ కావ్య నిలదీస్తుంటే అపర్ణ వచ్చి కావ్యను పక్కకు తీసుకెళ్లి తాము ఆడుతున్న నాటకం గురించి చెప్తుంది. కావ్య కన్వీన్స్‌ అవుతుంది.

ఆఫీసులో పని చేసే శరత్‌ కు అపర్ణ ఫోన్‌ చేసి రాజ్‌ వెంటనే ఆఫీసుకు వచ్చేలా చేయమని చెప్తుంది. అలాగేనని శరత్‌ కొత్త నెంబర్‌ నుంచి రాజ్ కు ఫోన్‌ చేసి ఆఫీసులో గోల్డ్‌ లెక్కల్లో తేడా వస్తుందని మీరు వెంటనే రావాలని లేకపోతే విషయం బయటకు తెలిస్తే మనకు పెద్ద ప్రాబ్లమ్‌ అవుతుందని చెప్తాడు. దీంతో రాజ్ కంగారుగా వెంటనే ఆఫీసుకు వెళ్తాడు. ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ఎంత చెప్పినా వినడు. ఆగమని బతిమాలినా ఆగకుండా రాజ్‌ వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లగానే అపర్ణ మళ్లీ శరత్‌ కు ఫోన్‌ చేసి రాజ్‌ ఆఫీసుకు వస్తున్నాడు. నువ్వు వెంటనే కొత్త నెంబర్‌ సిమ్‌ తీసేసి.. రాజ్‌ రాగానే నువ్వు ఫోన్‌ చేయలేదని చెప్పు అని శరత్‌ కు చెప్తుంది అపర్ణ. సరేనంటాడు శరత్‌.

కనకం ఇంటికి అప్పు, కళ్యాణ్‌ వస్తారు. వాళ్లను చూసిన ధాన్యలక్ష్మీ ఎదురుగా వెళ్లి కళ్యాణ్‌ను ప్రశ్నిస్తుంది. అత్తగారింట్లో ఫంక్షన్‌ అనగానే పరుగెత్తుకొచ్చావు. మన ఇంట్లో నీ తల్లి బాధపడుతుంది అని ఎప్పుడు నీకు గుర్తుకు రాలేదా? అంటుంది. అసలు ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? అంటూ నిలదీస్తుంది. దీంతో కళ్యాణ్‌ ఆలోచించాను కాబట్టే ఆ ఇంటికి రాలేదు అమ్మా అంటూ నువ్విలాగే మాట్లాడితే ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్లిపోతాను అంటాడు కళ్యాణ్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Big Stories

Advertisement
×