BigTV English

Jaggareddy clarification: నావల్ల కాదు, డ్రాపవుతున్నానన్న జగ్గారెడ్డి.. కారణం అదేనా?

Jaggareddy clarification: నావల్ల కాదు, డ్రాపవుతున్నానన్న జగ్గారెడ్డి.. కారణం అదేనా?

Jaggareddy clarification: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ముక్కుసూటిగా మాట్లాడే నేత. ఈ విషయంలో ఎవరేమనున్నా పట్టించుకోరు. చెప్పాల్సిన నాలుగు మాటలు సుత్తి లేకుండా ఓపెన్‌గా చెబుతారు. అందుకే జగ్గారెడ్డి ఏం చెప్పినా నమ్ముతారు కూడా. సమస్య ఏంటో తెలీదుగానీ ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది? ఇంతకీ ఆయనేమన్నారు?


సంగారెడ్డి పేరు ఎత్తితే చాలు.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పేరు వినిపిస్తుంది. ఆ విధంగా మార్చుకున్నారాయన. దాదాపు ఆరు పదుల వయసుకు దగ్గరవుతున్న ఆయన, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని దసరా రోజున బయటపెట్టారు.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని మనసులోని మాట బయటపెట్టారు జగ్గారెడ్డి. కాకపోతే దానికి ఓ మెలిక పెట్టారు. ఎన్నికల బరిలో తాను దిగనని, భార్య నిర్మలారెడ్డి అవకాశం ఇవ్వాలన్నది ఆయన ఆలోచన. తప్పదనుకుంటే తన అనుచరుడు ఆంజనేయలకు అవకాశం కల్పిస్తానని వెల్లడించారు.


దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌తో మాట్లాడుతానని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. వున్నట్లుండి జగ్గారెడ్డి నిర్ణయం వెనుక అసలేం జరుగుతోంది? దీనిపై ప్రత్యర్థులు ఆరా తీయడం మొదలుపెట్టేశారు. ఒకవిధంగా చెప్పాలంటే సంగారెడ్డి నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ALSO READ: మూసీ కాంట్రాక్ట్‌పై తప్పుడు ప్రచారం… మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు

గడిచిన ఎన్నికల్లో తన ఓటమికి బీఆర్ఎస్ కారణమన్నారు జగ్గారెడ్డి. ఓటు కోసం వేలకు వేలు ఆ పార్టీ ఖర్చు చేస్తున్నారన్నది ఆయన మాట. తన వద్ద డబ్బులు లేవని, అందువల్లే ఓటమి పాలయ్యానని చెప్పుకొచ్చారు. మొత్తానికి తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చేశారు జగ్గారెడ్డి.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×