E-Paper
Advertisement

Brahmamudi Serial Today October 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  కళ్యాణ్‌పై అలిగిన అప్పు – రాజ్‌ భయంతో వణికిపోయిన సామంత్‌

Brahmamudi Serial Today October 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  కళ్యాణ్‌పై అలిగిన అప్పు – రాజ్‌ భయంతో వణికిపోయిన సామంత్‌
Advertisement

Brahmamudi serial today Episode: కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన అప్పుకు ఆటో నడుపుతూ కళ్యాణ్‌ కనబడతాడు. దీంతో అప్పు కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి నువ్వు చేస్తున్న పికప్‌ అండ్‌ డ్రాపింగ్‌ జాబ్‌ ఇదేనా? అని ప్రశ్నిస్తుంది. అప్పును చూసిన కళ్యాణ్ తప్పు చేసిన వాడిల తల దించుకుంటాడు. అప్పు మాత్రం నాకు కూడా అబద్దం చెప్పావా? అంటూ ఏడుస్తుంది. దీంతో కళ్యాణ్‌ ఏదో చెప్తుంటే వినకుండా ఈరోజు నువ్వు ఇంటికి వస్తావు కదా? అప్పుడు చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆఫీసు టైం అయిపోయినా కూడా రాజ్‌ ఆఫీసులోనే కూర్చుని డిజైన్స్‌ వేస్తుంటాడు. ఉద్యోగులు ఒక్కొక్కరిగా ఆఫీసు నుంచి వెళ్లిపోతుంటారు. శృతిని కూడా వస్తావా? అని అడుగుతే ఇంకా న మొగుడు ఆఫీసులోనే ఉన్నాడు కదా? నేనెలా వస్తాను. అంటూ సారీ ఫ్లోలో మొగుడు అనేశానేంటి? అని రాజ్ సార్‌ ఇంకా ఉన్నారు నేను రాలేని అని చెప్తుంది.

Advertisement

తన కూతురుకు కనకం భోజనం వడ్డిస్తుంటే కావ్య తింటూ ఉంటుంది. ఇంతలో సురేష్‌, కావ్యకు ఫోన్‌ చేస్తాడు. హలో సురేష్‌ గారు చెప్పండి అని అడుగుతుంది కావ్య. కావ్య గారు మీకో గుడ్‌ న్యూస్‌ మీరు వేసిన డిజైన్స్‌ అన్ని బాగున్నాయి అని అప్రూవల్‌ వచ్చింది అని సురేష్‌ చెప్పగానే హ్యాపీగా కావ్య అవునా  థాంక్యూ సార్‌ అంటుంది. దీంతో మీకు ఇంకో గుడ్‌ న్యూస్‌ కూడా ఉదండి అంటాడు సురేష్‌. అవునా ఏంటండి అది అని అడుగుతుంది కావ్య. దీంతో ఎక్స్‌ ఫోకు మీరు కూడా రావాలని అక్కడ మన క్లయింట్స్‌ కు మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్తాడు.

అక్కడకు రాజ్ కూడా వస్తాడని గుర్తు చేసుకున్న కావ్య నేను రాలేనండి. నాకు రేపు వేరే వర్క్‌ ఉంది అని చెప్తుంది. దీంతో అదేం లేదండి మీరు వస్తున్నారు అంతే అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు సురేష్‌. రేపు నీకేం పని ఉందే అంటూ కనకం ప్రశ్నిస్తుంది.  నాకేం పని లేదమ్మా కానీ అక్కడికి రాజ్‌ కూడా వస్తాడని చెప్తుంది కావ్య. అయితే నువ్వు అక్కడికి వెళ్లి రాజ్ ను చూడగానే వెంటనే రాజ్‌ ఒడిలోకి వెళ్లిపోతావని భయపడుతున్నావా? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది కనకం.  అమ్మా… నేను అంత బలహీనరాలును కాదమ్మా రేపు అక్కడికి వెళ్లి నేనేంటో నీకు ఫ్రూవ్‌ చేస్తాను అంటుంది కావ్య.

Advertisement

తాను వేసిన  డిజైన్స్‌ ఫైనల్‌  చేసిన రాజ్‌ వాటిని శృతికి ఇచ్చి ఇవే రేపు మనం ఎక్స్‌ ఫో కు పంపాల్సిన డిజైన్స్‌ అందుకు ఏర్పాట్లు త్వరగా చేయించు అని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడడు. రుద్రాణి, అనామిక ఫోన్ లో మాట్లాడుకుంటారు. కావ్య డిజైన్స్‌ గురించి అనామిక చెప్పగానే రుద్రాణి ఆశ్యర్యంగా ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అని అడుగుతుంది. దీంతో అనామిక అవును ఆంటీ డాక్టర్‌ దగ్గర లాయర్‌ దగ్గర కాదు ఒక దొంగ ఇంకొక దొంగ దగ్గర కూడా అబద్దం చెప్పకూడదు అంటుంది.

రుద్రాణి దొంగా..? నేనా…? అంటూ  సరేలే తిడితే తిట్టావులే కానీ ఇంతకీ ఆ కావ్యను వాడుకుని రాజ్‌ ను ఎలా దెబ్బకొడుతున్నావో చెప్పు అని అడుగుతుంది. దీంతో అనామిక తన ప్లాన్‌ మొత్తం చెప్తుంది. కావ్య డిజైన్స్‌ వేసిందని అవే డిజైన్స్‌ రాజ్‌ పాలిట శాపాలుగా మారనున్నాయని స్వరాజ్ కంపెనీకి రావాల్సిన అవార్డు రానీయకుండా చేస్తున్నానని  అనామిక చెప్పడంతో రుద్రాణి సంతోషిస్తుంది. ఈ విషయం కావ్యకు తెలియకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇంతలో స్వప్న వచ్చి వింటుంది. రుద్రాణి సంతోషంగా వెళ్లగానే మా అత్త మరో గూడు పుఠాణీకి రెడీ అవుతున్నట్లు ఉంది. దీన్ని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంటుంది.

ఇంటి ముందు మెట్ల మీద కూర్చుని కళ్యాణ్‌ కోసం ఎదురుచూస్తుంది అప్పు. ఇంతలో కళ్యాణ్‌  ఆటో తీసుకుని వస్తాడు. కళ్యాణ్‌ ను చూసిన అప్పు కోపంగా అలిగి లోపలికి వెళ్తుంది. కళ్యాణ్‌ వెళ్లి ఏదో చెప్పబోతుంటే అప్పు కోపంగా కళ్యాణ్‌ ను తిట్టూ నువ్వింక నాతో మాట్లాడొద్దు అంటుంది. దీంతో కళ్యాణ్‌ బాధగా నాకు ఉన్నది నువ్వొక్క దానివే పొట్టి నువ్వు కూడా మాట్లాడొద్దు అంటే నేను ఎక్కడికి వెళ్లాలి. ఎవరితో మాట్లాడాలి అంటాడు. తన మాటలతో అప్పును కన్వీన్స్‌ చేస్తాడు.

మరుసటి రోజు కావ్య ఎక్స్‌ ఫోకు వెళ్తుంటే కనకం వచ్చి అక్కడికి అల్లుడుగారు వస్తున్నారు అని చెప్పావు కదా..? ఆయనతో నువ్వేం గొడవ పెట్టుకోకు అంటూ చెప్తుంది. కావ్య ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతుంది. ఇంకోవైపు రాజ్‌ ఎక్స్‌ ఫోకు  వెళ్తుంటే అపర్ణ హారతి ఇచ్చి ఆల్‌ ది బెస్ట్ చెప్తుంది. ఇంతలో ఎక్స్‌ ఫోకు తాను  వస్తానని రుద్రాణి చెప్పడంతో అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. రాజ్‌ సరే అంటాడు. స్వప్న కూడా తాను వస్తానని అడుగుతుంది. రాజ్‌ వద్దంటాడు. సుభాష్‌ రావాల్సిందేనని చెప్తాడు.

అనామికతో కలిసి ఎక్స్‌  ఫోకు వెళ్లిన సామంత్‌ రాజ్‌ ఎప్పుడు ఎలాంటి ప్లాన్ తో తనను దెబ్బ కొడతాడోనని భయపడుతుంటాడు. అనామిక కూల్‌ గా ఉండు ఆ రాజ్‌ ఏమీ చేయలేడు అని చెప్తుంది. నువ్వు ఇంట్లో నవ్వుతూ ఉండే రాజ్ ను చూశావని రాజ్‌ అసలు రూపం నీకు తెలిదని భయపడతుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×