Sony Bravia 9 : జపాన్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ తో సినిమాలు చూడాలనుకునే మూవీ ప్రియులకు కోసం కృత్రిమ మేధ ఆధారంగా ఆధారంగా 85 అంగుళాల 4k ఎల్ఈడి టెలివిజన్లను ఆవిష్కరించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఆవిష్కరణకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
సోనీ బ్రేవియా – సోనీ కంపెనీ జూలైలో రిలీజ్ చేసిన సోనీ బ్రేవియా 7 సిరీస్ మినీ టీవీలకు లేటెస్ట్ వెర్షన్ ను తీసుకువచ్చింది. కృత్రిమ మేధ ఆధారంగా 4K ఎల్ఈడీ టెలివిజన్లను ఆవిష్కరించింది. సోనీ బ్రావియా 7 (75/65/65 అంగుళాలు, రూ.1,82,000), బ్రావియా 8 (65/55 అంగుళాలు, ధర.2,19,900) బ్రావియా 9 (85/75 అంగుళాలు, ధర.రూ. 4,49,990)ను టెలివిజన్స్ ఆవిష్కరించారు.
రాజమౌళీ ప్రచార కర్తగా వ్యవహరిస్తూ సోని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ అయ్యర్ తో కలిసి సోనీ టెలివిజన్స్ ను ఆవిష్కరించారు. టీవీలతో పాటూ థియోటర్ బార్ సిరీస్ 8,9లనూ సోనీ విడుదల చేసింది. సోనీ బ్రావియా టెలివిజన్స్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్, సోనీ రిటైల్ ఔట్ లెట్లు, ఎలక్ట్రానిక్ స్టోర్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ALSO READ : ఐఫోన్లకు భారీగా పెరిగిన గిరాకీ – డైమండ్స్‌ను అధిగమించిన స్మార్ట్ ఫోన్ల విలువ!
సోనీ బ్రేవియా 7 – ఇక జులైలో విడుదలైన సోనీ బ్రేవియా 7 సిరీస్ లో మినీ టెలివిజన్స్… కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్, మినీ LED స్క్రీన్, ఎక్స్ఆర్ ట్రిల్యుమినోస్ ప్రో టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్స్ ను తో తీర్చిదిద్దింది. బెస్ట్ సౌండ్ క్వాలిటీతో మల్టీ ఆడియో టెక్నాలజీ, ఎక్స్ ఆర్ సౌండ్ పొజీషినింగ్ తో సౌండ్ సిస్టమ్ ను అధునాతనంగా తీర్చిదిద్దింది. గేమ్స్ ఆడే యూజర్స్ కు అనుగుణంగా ఆటో హెచ్డీఆర్ టోన్ మ్యాపింగ్, ఆటో లో ల్యాటెన్సీ మోడ్ ఫీచర్లను జోడించింది.
ఇందులో 4 లక్షల సినిమాలు, టీవీ ఎపిసోడ్స్, 10వేల యాప్స్ తో పాటు గేమ్స్ సైతం అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఫోటోలు, వీడియోలు క్లియర్ గా కనిపంచే ఎక్స్ఆర్ ట్రిల్యుమినోస్ ప్రో టెక్నాలజీతో అనేక రంగుల్లో ఈ టెలివజన్స్ ను ఆవిష్కరించింది. యాక్షన్ సీన్స్ లో సైతం వేగంగా కదిలే ఇమేజస్ స్పష్టంగా కనిపించటానికి ఎక్స్ఆర్ క్లియర్ ఇమేజ్ టెక్ తో తీర్చిదిద్దింది.
అకౌస్టిక్ మల్టీ ఆడియో టెక్నాలజి, ఎక్స్ఆర్ సౌండ్ పొజిషనింగ్ తో బ్రేవియా సిరీస్ టెలివిజన్స్ లో హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ ఉంటుంది. ఇక 3డీ సరౌండ్ సౌండ్ సిస్టమ్ తో థియోటర్ ఫీల్ ఇచ్చేలా స్పేషల్ ఫీచర్స్ ను జోడించి ఈ టెలివిజన్ ను డిజైన్ చేసింది సోనీ కంపెనీ.
ఇక 55 అంగుళాల టీవీ ధర రూ. 1,82,990, 65 అంగుళాల టీవీ ధర రూ. 2,29,990గా నిర్ణయించింది. వీటితో పాటూ 75 అంగుళాల టెలివిజన్ ను ఆవిష్కరించినా ధరను నిర్ణయించలేదు. తాజాగా బ్రావియా 9లో 85/75 అంగుళాల టీవీ ధరను రూ. 4,49,990 గా నిర్ణయించింది.