Gundeninda GudiGantalu Today Episode October 1st : నిన్నటి ఎపిసోడ్ లో మనోజ్ తెచ్చిన ప్రీ కుపన్స్ తీసుకొని ప్రభావతి ఫ్యామిలీ షాపింగ్ కు వెళ్తుంది. అక్కడ చీరలు తీసుకొనే విషయంలో ప్రభావతికి బాలుకు మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఇద్దరు కలిసి సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటారు. ఇక శృతి ప్రేమను ఒప్పుకున్న రవి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలాగే సంజు శృతితో షాపింగ్ కు వస్తాడు.. రవి షాపింగ్ కు వచ్చిన విషయం ఇంట్లో వాళ్లకు తెలిసీపోతుంది. అందరు షాపింగ్ చేస్తూ బిజీగా ఉంటారు. కామాక్షిని శృతి డ్యాష్ ఇస్తుంది. అలాగే ప్రభావతిని కూడా.. ఆ అమ్మాయినే రవి బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడని కనిపెట్టాలని అనుకుంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి, కామాక్షిలు రవి, శృతిలను ఎలాగైనా పట్టుకోవాలని వెతకడం ప్రారంభిస్తారు. ట్రయల్ రూమ్ లో దూరిన విషయం తెలియక .. శృతి కూడా అందులోకే వెళ్తుంది. సడెన్ గా రవిని చూసిన ఆమె నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్ అని ప్రశ్నించగా.. మా అమ్మ నీతో చూస్తే.. నా పరిస్థితి అంతే’ అంటాడు. వెంటనే రియాక్ట్ అయినా శృతి ఇంత భయపడితే.. నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావ్ ? ప్రశ్నిస్తుంది. దీంతో రవి కొంచెం టైం ఇవ్వు అంటాడు. అంత టైం లేదు నన్ను వాడు వదలడు అంటుంది. మనం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని శృతి రవిని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక పక్కన ఉన్న ట్రయిల్ రూమ్ లోకి మీనా, బాలు వస్తారు. అందరు చూస్తారు తలుపు వెయ్యి అంటాడు. ఇక పక్కన ఉన్న శృతి తలుపు ఆల్రెడీ వేసి ఉంది కదా అంటుంది. శృతి సడెన్ గా రవికి ముద్దు పెట్టేస్తుంది. దీంతో రవి గాలిలో తేలుతాడు. మరో ట్రయల్ రూమ్లో ఉన్న బాలు మీనా కూడా కాస్త రొమాన్స్ లో ముగినిపోతారు. అంతలోనే బాలు ఇక చాలు అని బయటకు వచ్చేస్తాడు. రవి కూడా ట్రయల్ రూమ్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా.. బాలు బయటనే ఉండటంతో మళ్లీ లోపలి వెళ్లిపోతాడు.
ఇక శృతి బయటకు వస్తుంది. మీనా రావడం చూసి మీ వదిన ఉంది అంటుంది. ఇద్దరు కాసేపు అయ్యాక ఎలాగోలా బయటకు వచ్చేస్తారు. బయటకు రాగానే శృతి సంజు చూస్తాడు. ఇంతసేపు ట్రైయిల్ చేస్తున్నావా అంటే.. అవును డ్రెస్స్ బాగా టైట్ అయ్యింది. విప్పడానికి కష్టంగా ఉంది అంటుంది. సరేలే నీ కోసం శారీ తీసుకున్నా.. ఎలా ఉంది అని అడుగుతాడు. ఎలాంటి మొహామాటం లేకుండా నచ్చలేదని చెప్పేస్తుంది శృతి . నాకు నచ్చింది అని సంజూ అనగా.. కట్టుకోవాల్సింది నేను అంటూ శృతి సమాధానం ఇస్తుంది కానీ సంజు మాత్రం ఆకట్టుకోవాల్సింది నన్ను అంటూ రిప్లై ఇస్తాడు.. దాంతో శృతి ఏమి అనకుండా చిరాకు పడుతూ నేను వెళ్తున్న అని అంటుంది.
ఇక షాపింగ్ మొత్తం అయిపోయిన ప్రభావతి ఫ్యామిలీ బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి చేరుకుంటుంది. మీ కూపన్ల సంగతి మీరు చూసుకోండి మా ఆవిడ చీర సంగతి నేను చూసుకుంటా అంటూ బాలు వారు తెచ్చిన బట్టలను సైడ్ కు చూస్తాడు. దర్జాగా డబ్బులు కట్టేసి వాళ్ళ ముందు ఓ రేంజ్ లో ఫోజు ఇస్తాడు. అయితే బిల్ కట్టే సమయం ట్విస్ట్ జరుగుతుంది. షాప్ అతను అవి టైం అయ్యాయని చెబుతాడు.. దానికి అందరు షాక్ అవుతారు. కానీ, మొత్తం బిల్లు కట్టాలంటూ షాప్ కీపర్ బాంబేస్తాడు. దీంతో అవాక్కైనా ప్రభావతి ఫ్యామిలీ ఎందుకు.. ఎందుకు.. అంటూ అడుగుతారు. ఈ కూపన్స్ వ్యాలిడిటీ నిన్నటితో అయిపోయింది అని రిప్లే ఇస్తాడు షాప్ కీపర్. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు..
చివరకు బాలు డబ్బులు కడతాడు. కూపన్సు ఎక్స్పైర్ అయిన విషయం ముందుగానే తెలుసుననీ, మిమ్ములను కావాలని రెచ్చగొట్టి ఎక్కువ రేటు బట్టలు కొనిచ్చా. ఎలా ఉంది నా దెబ్బ డబ్బావతి అంటూ కట్టరా డబ్బులు అంటూ మనోజ్ కు పంచ్ వేస్తాడు. ఇక అందరు అక్కడనుంచి వెళ్తారు. ఇక శృతి రవీతో ఫోన్ మాట్లాడటం చూసి వాళ్ల అమ్మ రవికి వార్నింగ్ ఇచ్చింది. ఇక సంజు దగ్గరకు శృతిని తీసుకొని వస్తుంది.. ఇక చీర ఇచ్చి సంజు వెళ్తాడు. శృతిని శోభా నాలుగు పీకుతుంది. ఇక ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తుంది. రవికి తనని గదిలో పెట్టిన విషయాన్ని చెబుతుంది. రవికి డెడ్ లైన్ పెడుతుంది. తర్వాత రోజు డ్యూటీ వెతుక్కోవడానికి వెళ్తున్నావా.. నీకు జాబ్ దొరకదా అని ప్రభావతి అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో బాలు వాళ్ల నాన్నకు చేంజ్ ఇస్తాడు. అది మనోజ్ తీసుకుంటాడు. క్యాబ్ ఎక్కినందుకు చిల్లర మనోజ్ దగ్గరకు ఓ వ్యక్తి తీసుకుంటాడు. అది చూసి బాలుకు నిజం తెలిసిపోతుందా? మనోజ్ ఉద్యోగం లేదన్న విషయం ఇంట్లో చెబుతాడా రేపటి ఎపిసోడ్ లో చూడాలి..