E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు వేసిన ప్లాన్ తనకే బెడిసి కొడుతుందా..? 

Brahmamudi Serial Today Episode October 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు వేసిన ప్లాన్ తనకే బెడిసి కొడుతుందా..? 
Advertisement

Brahmamudi serial today Episode: అందరూ టిఫిన్‌ తింటుంటే ఐశ్వర్య వస్తుంది. లక్కీ మర్యాదగా కూర్చోబెట్టి మర్యాద చేస్తుంటాడు. ఐశ్వర్య మాత్రం జీవీర్‌ కాంట్రాక్ట్‌ తానే కొట్టేస్తానని తర్వాత రాజు, ఇందు చేపల మార్కెట్‌లో చేపలు అమ్ముకోవాలని వెటకారంగా మాట్లాడుతుంది. అందుకు అపర్ణ తన మనవడికి మనవరాలికి అటువంటి గతేం పట్టదని అంటుంది. రాజు కూడా ముందు టెంబర్‌ దక్కించుకో ఐషు అని చెప్తాడు. ఇందు మాత్రం ఏయ్‌ రాజు త్వరగా కానియ్‌ మనకు అర్జెంట్‌ పనుంది అంటూ తీసుకుని వెళ్లిపోతుంటాడు.

లక్కీ మాత్రం ఐషు టిఫిన్‌ చేశాక చేయి కడుక్కోవడానికి ఫింగర్‌ బౌల్‌ ఇస్తాడు. చేయి తుడుచుకోవడానికి తన షర్ట్‌ ఇస్తాడు. ఐషు వెళ్లిపోయాక శేషు కోపంగా చూస్తుంటే.. ఒరేయ్‌ లక్కీ నిన్ను చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకు వస్తుందిరా అంటే ఏంటి నన్ను చూస్తుంటే.. నిన్ను నువ్వు చూసుకున్నట్టు ఉందా..? అంటాడు. శేషు షాక్‌ అవుతాడు. వెంటనే భ్రమరాంబ ఏంటి నేను శేషును ఇబ్బంది పెట్టానని అంటున్నావా..? అంటూ కోప్పడుతుంది. లక్కీ అక్కడి నుంచి పారిపోతాడు.

Advertisement

ఆఫీసులో కూర్చుని కాఫీ తాగుతుంటారు ఇందు, రాజు. అప్పుడే ఆఫీస్‌ బాయ్‌ వచ్చి డిజైనర్‌ ఇంటర్వ్యూ కోసం వచ్చారు అని చెప్తాడు. ఆ మాటలకు రాజు. ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఇందు మనసులో మాటను బయట పెట్టించాలి అని మనసులో  అనుకుంటాడు. ఇందు డిజైనర్‌ కాస్త యంగ్ గా ఉండాలి ఓల్డ్‌ ఫీపుల్‌ ను మాత్రం తీసుకోకు అంటాడు.. అప్పుడే ఇంటర్వ్యూకు వచ్చింది అమ్మాయి కాదని అబ్బాయి అని తెలుసుకుని రాజు షాక్‌ అవుతాడు. కుర్చీలోంచి కింద పడబోతే ఇంటర్వ్యూ కు వచ్చిన వ్యక్తి అడ్డుపడి ఆపేస్తాడు. ఇందును చాలా అందంగా ఉన్నవంటూ పొగుడుతుంటాడు… అది విని రాజు కోపంతో రగిలిపోతుంటాడు.

వీడిని కోపంగా ఏదైనా అంటే ఇందుకు దొరికిపోతానని కూల్‌గా ప్రశాంత్‌కు క్లాస్‌ తీసుకుంటాడు. అంతా గమనించిన ఇందు కూడా రాజు జెలసీ గా ఫీల్‌ అవుతున్నట్టు ఉన్నాడు ఇప్పుడు ఆడుకుంటాను చూడు అంటూ నేను అంత అందంగా ఏమీ లేను ప్రశాంతం అంతా మీ అభిమానం అంటే.. లేదు మేడం మీ అందం గురించి చెప్పాలంటే మీ కళ్లు చాలు అంటే.. రాజు ఫోన్‌ తీసుకుని ఎవరినో తిట్టినట్టు తిడుతుంటే.. ఇందు నవ్వుకుంటుంది. ఇంటర్వ్యూ తర్వాత రాజు కోపంగా ప్రశాంత్‌ను బయటకు పంపిస్తాడు. ఇందు నవ్వుతూ రాజు ఎక్కడో కాలుతున్న వాసన వస్తున్నట్టు ఉంది కదా అంటుంది. రాజు నాకేం రావడం లేదు అంటూ వెళ్లిపోతాడు. ఇందు నవ్వుకుంటూ ఇన్ని రోజులకు దొరికావు బావ.. అనుకుంటుంది.

Advertisement

కంపెనీ టెండర్ల గురించి ఐశ్వర్య మేనేజర్‌తో మాట్లాడుతుంది. పీఏను తన డిసీజన్‌ ఎలా ఉందని అడుగుతుంది చాలా బాగుందని ఈ నిర్ణయం వల్ల కంపెనీ ఎక్కడికో వెళ్తుంది అంటాడు. మరోవైపు ఇంట్లో లక్కీ, ఐశ్వర్య కోసం లంచ్‌ తీసుకెళ్తుంటే.. రేఖ ఎవరికి అని అడిగితే ఐషు కోసం తీసుకెళ్తున్నాను అంటూ చెప్తాడు. రేఖ, భ్రమరాంబ ఇద్దరూ లక్కీని మెచ్చుకుంటారు. నువ్వు గ్రేట్‌ లక్కీ.. సూపర్‌ అంటూ మెచ్చుకుంటే.. లక్కీ ఎమోషనల్‌ అవుతూ.. మాట్లాడతాడు. పనిమనిషి బాక్స్‌ ఇవ్వగానే.. తీసుకుని వెళ్లిపోతాడు.

ఆఫీసులో ఉన్న రాజు, ఇందును సర్‌ఫ్రైజ్‌ చేసేందుకు బేగంపేటలో ఉన్న రెస్టారెంట్‌ నుంచి లంచ్‌ తెప్పిస్తాడు. అంతా గమనించిన ఇందు.. నాకు పర్‌ప్రైజ్‌ ఇస్తాడా..? ఆట పట్టిస్తాను ఉండు అంటూ ప్రశాంత్‌ భోజనం చేస్తుంటే అక్కడికి వెళ్లి ప్రశాంత్‌ తినే ఫుడ్‌ ఇవ్వమని అడుగుతుంది అంతా చూస్తున్న రాజు షాక్‌ అవుతాడు. నాతోనే ఆటలాడతావా..? అనుకుంటూ వెళ్లి తను తీసుకొచ్చిన పార్శిల్‌లో ఫుడ్‌ లొట్టలేసుకుంటూ తింటుంటాడు అది చూసిన ఇందు షాక్ అవుతుంది.

మరోవైపు   ఫుడ్‌ తీసుకుని ఐశ్వర్య ఆఫీసుకు వెళ్లిన లక్కిని చూసి కోపంతో ఊగిపోతుంది. ఆఫీసులో నా హస్బెండ్‌ అని చెప్పకు అంటూ కోప్పడుతుంది. నా లైఫ్‌లోకి ఎందుకు వచ్చావురా నువ్వు అంటూ తిడుతుంది. నా ప్లాన్‌ మొత్తం చెడగొట్టావు.. అంటూ ఆఫీసును నుంచి బయటకు గెంటేస్తుంది. మరోవైపు ప్రశాంత్‌ వేసిన డిజైన్స్‌ చూస్తుంటుంది ఇందు. రాజు వెళ్లి ఆ డిజైన్స్‌ బాగాలేవని మరో డిజైనర్‌ను చూద్దామని చెప్తాడు. ఇందు మాత్రం చాలా బాగున్నాయని చెప్తుంది. ఆ మాటలకు రాజు షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : కన్నా తల్లి కోసం కన్నీళ్లు.. నారాయణ మాటతో షాక్.. చక్రికీ నిజం చెప్పిన మహా..

Karthika Deepam 2 Serial Today Episode October 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మరోసారి జ్యోత్స్నను తీసుకెళ్లి అప్పగించిన సూరజ్‌           

Intinti Ramayanam Today Episode: చక్రధర్ టెన్షన్.. కమల్ ఫుల్ హ్యాపీ.. పల్లవికి చక్రధర్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన భాగ్యం.. చందు మాటతో షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 20th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి అదిరిపోయే షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ  

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

కావ్య శ్రీతో ఏడు అడుగులు వెయ్యబోతున్న సుధీర్..ఇదెక్కడి ట్విస్ట్ మావా?

Big Stories

Advertisement
×