Illu Illalu Pillalu Today Episode October 20th: నా కూతుర్ని మళ్ళీ మహారాణి లాగా తీసుకొని వెళ్ళాలి అని భాగ్యం అందరికీ వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతుంది. కానీ వేదవతి మాత్రం నీ కూతుర్ని ఇక నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను మీరు చేసిన మోసాలు మీరు తీసిన పరువు వల్ల మేము తలుచుకోలేకపోతున్నాము అని వేదవతి అంటుంది. పదండి అయితే కోర్టులోనే మేము తేల్చుకుంటాము అని భాగ్యం అందరికీ షాక్ ఇచ్చేలా మాట్లాడుతుంది కానీ వల్లి మాత్రం అక్కర్లేదు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అయితే నేను ఈ కేసును వాపు తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వల్లి మాటలు విని భాగ్యం కూడా షాక్ అవుతుంది. ఇక వల్లి ఎస్ఐ గారు నన్ను ఎవరు కొట్టలేదు ఇది చేయలేదు నేను ఈ కేసును వాపస్ తీసుకుంటున్నాను అని అనగానే ఎందుకు పోలీసులు తప్పుదోవ పట్టించారు అని ఎస్ఐ సీరియస్ అవుతుంది కానీ మళ్ళీ మాత్రం కేసును వెనక్కి తీసుకుంటుంది.
రామరాజు వాళ్ళు ఇంటికి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు కానీ రామరాజు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. కూతురు లాగా చూసుకున్న కోడలు పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి మేము రాచిరంపాలు పెడుతున్నాము అని అంటుందా. అస్సలు ఊరుకునేదే లేదు అని అనుకుంటూ ఉంటారు అయితే అప్పుడే చందు లోపలి నుంచి వచ్చి నాన్న మీరు ఈ విషయాన్ని ఒక మచ్చలాగా మర్చిపోండి. ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచించకండి అని అంటాడు. అయితే నేను వల్లికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. చందు కి ఎంతగా చెప్పాలని చూసినా కానీ చందు మాత్రం అస్సలు వినడు. నా జీవితం మీద మళ్లీ దాన్ని తెచ్చి పెట్టాలి అని అనుకుంటే నేను అసలు ఊరుకోను అని చందు నర్మదకు వార్నింగ్ ఇస్తాడు.
శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని బాధ పడిపోతూ ఉంటుంది. తన జీవితం ఇలా మారిపోయిందని కంగారు పడిపోతూ తన జీవితం మారదని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే భాగ్యం అక్కడికి వచ్చి ఏంటే నువ్వు ఏమన్నా మంచి దానివి అని మారిపోయి అందరి దగ్గర మంచిది అని అనిపించుకోవడానికి కేసు వాపస్ తీసుకున్నావా అని అంటుంది.. అయితే వల్లిని ఇంట్లో నుంచి అక్కడ పెడుతుంది. అత్తింటి వాళ్ళు వదిలేస్తే పుట్టింట్లో తలదాచుకోవడానికి వచ్చిన నాకు నువ్వు కూడా ఇలా మాట్లాడతావా నేను అసలు ఊహించలేదు అని బల్లి చాలా బాధపడిపోతుంది. నువ్వు మంచి దానివి అనిపించుకోవడానికి చేసిన ఈ పని నీకే ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు కదా అని షాక్ అవుతుంది. నువ్వు చాలా మంచి దానివి కదా నా ఇంట్లో నువ్వు పుట్టినప్పటినుంచి దరిద్రమే ఉంది అని భాగ్యం అనగానే మళ్ళీ ఒక్కసారిగా కుమిలి కుమిలి ఏడుస్తుంది నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది.
సుకన్య వల్లికి ఏమవుతుందో ఏంటో అని బాధపడిపోతూ ఉంటుంది. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన తిరుపతి ఏంటి దేని గురించి బాధ పడిపోతున్నావు. అక్క బావ వాళ్ళు ఇంటికి రావడం నీకు సంతోషంగా లేదా అని అంటుంది.. అయితే సుక్కు వల్లికి ఏమవుతుందో ఏంటని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే అప్పుడే ఆనందరావు సుకన్యకు ఫోన్ చేసి మళ్లీ గురించి చెప్తాడు. వల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది అయితే మనం వెళ్లి బల్లి ఎక్కడుందో వెతుకుదాం పద అని సుక్కు అంటుంది. అయితే తిరుపతి మనం వెళ్లడం కాదు ముందు ధీరజ్ కెళ్ళి ఈ విషయం చెబుదాము వాడే ఏదో ఒకటి చేస్తాడని అంటాడు.
కమల్ ఇంకా రెచ్చిపోతాడు ధీరజ్ పెట్టాలి అని ఒక దుప్పటి కప్పుకొని లోపలికి వస్తాడు అప్పటికే ప్రేమ ధీరజ్ ఎక్కడికెళ్లాడో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది. ధీరజ్ ప్రేమని భయపెట్టేలా లోపలికి రావడంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మొత్తానికి ప్రేమ ధీర ఇద్దరు కూడా ఒక్కసారిగా కేకలు పెట్టి రొమాన్స్ చేస్తూ ఉండగా నర్మదా ప్రేమ ఏమైంది అని ఆడుచుకుంటూ లోపలికి రావడంతో ఏంటక్కా ఎప్పుడు రావాలా కూడా తెలీదు సడన్గా నువ్వు వచ్చేసావు అంత చెడగొట్టేసావు అని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది. అయితే మీరిద్దరు అంత గట్టిగా అరుస్తుంటే రొమాన్స్ చేస్తున్నారో లేకపోతే ఏదైనా జరిగిందని మాకు ఎలా తెలుస్తుంది అని ప్రేమతో నర్మదా అంటుంది. మొత్తానికి ప్రేమ ధీరజులు కూడా రొమాన్స్ లు మునిగిపోతారు.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా తిరుపతి సుకన్య ఇద్దరు కూడా ధీరజ్ వాళ్ళ దగ్గరికి వస్తారు.. వల్లిని ఇంట్లో నుంచి గెంటేసారంట మా భాగ్యమత్త అన్నంత పని చేసేసింది అని సుకన్య అనగానే ఏంటే ఇక్కడ అక్కడక్కడ మోస్తున్నావా ఈ విషయం నీకు ఎలా తెలుసు అని ప్రేమ అంటుంది. నిజంగానే భాగ్యాన్ని సంగతి అందరికీ తెలిసిందే కదా తన మాట నెగ్గలేదు అని ఇంట్లో నుంచి పంపించేసింది అంట పాపం మళ్ళీ ఎక్కడుందో ఏంటో రాత్రిపూట తను ఎటు వెళ్లిపోయిందని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ధీరజ్ ఎక్కడికి వెళ్ళిందో నేను వెళ్లి చూస్తానని అంటాడు.. ప్రేమ ఎంతగా వద్దని చెప్పిన సరే ధీరజ్ మాత్రం అస్సలు వినకుండా వెళ్తాడు. వల్లి చందు కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది కానీ చందు మాత్రం ఎవరు అసలు నాకెందుకు ఫోన్ చేశావు అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది తనని ఎవరు పట్టించుకోలేవాళ్ళు లేరు అని బాధపడిపోతూ ఉంటుంది. అటు భద్ర ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ కి గండి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..