BigTV English

Brahmamudi Serial Today October 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: గుడిలో కలుసుకున్న అత్తాకోడళ్లు – రాహుల్‌ ఎవరితోనో తిరుగుతున్నాడన్న అపర్ణ

Brahmamudi Serial Today October 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: గుడిలో కలుసుకున్న అత్తాకోడళ్లు – రాహుల్‌ ఎవరితోనో తిరుగుతున్నాడన్న అపర్ణ

Brahmamudi serial today Episode:  కావ్యను తిట్టి కోపంగా తన బెడ్‌ రూంలోకి వెళ్లిన రాజ్ లోంచి తన ఆత్మ బయటకు వస్తుంది. కళావతి గురించి మాట్లాడుతుంది. నీకు కళావతి అంటే ఇష్టమే కానీ కావాలని తిడుతున్నావు కదా? అంటూ ప్రశ్నిస్తుంది. ఎక్కడ కళావతి ఫోటో రోజు చూస్తూ వెళ్లి మాట్లాడేస్తావనో ఆ ఫోటోలు బయటపడేశావు కదా అంటూ నిలదీస్తుంది. దీంతో రాజ్‌ కోపంగా అలాంటిదేం లేదని నువ్వు బయటకు ఎందుకు వచ్చావని తిడుతూ ప్లవర్‌ వాజ్‌ విసిరే సరికి ఆత్మ మాయం అయిపోతుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఇక కళావతిని కలిసే ప్రసక్తే లేదని డిసైడ్‌ అవుతాడు రాజ్‌.


అపర్ణ, కావ్య ఒక గుడిలో కలుసుకుంటారు. ఇద్దరూ చూస్తూ ఉంటారు కానీ మాట్లాడుకోరు కొద్దిసేపటికి కావ్యనే అత్తయ్యా అంటూ అపర్ణను పలకరిస్తుంది. దీంతో అపర్ణ ఎవరు నువ్వు నన్నెందుకు గుడికి రమ్మని పిలిచావు. నీకు నాకు ఏ సంబందం ఉందని రమ్మన్నావు అంటూ ప్రశ్నిస్తుంది. షాక్‌ అయిన కావ్య నేను మీకు తెలియదా? అంటూ నిలదీస్తుంది. నువ్వు నాకు తెలుసు కానీ ఈ నువ్వు నాకు తెలియదు. నాకు తెలిసిన కావ్య నువ్వు కాదు అంటుంది అపర్ణ. అయితే అప్పుడైనా ఇప్పుడైనా ఒకలాగే ఉన్నాను కదా అంటుంది కావ్య. కానీ ఒక్కచోట లేవు  అప్పుడు మా ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు పుట్టింట్లో ఉన్నావు అంటుంది అపర్ణ.

అది మీ ఇల్లు కనుకనే.. మీ ఇంట్లో చోటు లేదని. మీ అబ్బాయి మనసులో స్థానం లేదనే మా ఇంటికి వెళ్లిపోయాను అని కావ్య చెప్పగానే.. నా ఇల్లు నీ ఇల్లు కాదా. నా కొడుకు నీ భర్త కాడా..? వాడి మనసులో స్థానం లేకపోతే సంవత్సరం పాటు కలిసి కాపురం చేసేవాడా? అంటూ అపర్ణ అడుగుతుంది. అవునా.. మీరు బలవంతం చేస్తేనే నాతో కాపురం చేశాను అన్నాడు మీ అబ్బాయి. అని కావ్య కన్నీళ్లు పెట్టుకోగానే. అపర్ణ ఎమోషనల్‌ అవుతూ కావ్యను హగ్‌ చేసుకుంటుంది.


ఇన్ని రోజులు నన్ను చూడడానికి రాలేదు కానీ ఇప్పుడు గుడికి పిలిచావా? అంటూ అపర్ణ అడగ్గానే మిమ్మల్ని చూడలేదు అత్తయ్యా కానీ ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. అయినా మళ్లీ నేను అక్కడికి వస్తే మీ అబ్బాయి ఎంత గొడవ చేస్తాడోనని రాలేదు అని కావ్య చెప్తుంది. అయితే జరిగిందేదో జరిగింది. ఇకనైనా మన ఇంటికి వెళ్దాం పద అని అపర్ణ, కావ్యను అడుగుతుంది. అయితే కావ్య తాను రానని చెప్పడంతో అపర్ణ కోపంగా నాలుగు తగిలించి నిన్ను తీసుకుపోతాను అంటుంది.

కావ్య ఏడుస్తూ మీరు నన్నే అంటున్నారా? అక్కడ మా అమ్మా నన్నే అంటుంది అంటూ బాధపడుతుంటే.. మీ ఇద్దరికి ఈగో పై నుంచి కిందకు నిండిపోయింది. లేకుంటే ఇద్దరు ఒకేలాగా పంతం పట్టుకుని కూర్చుంటే ఎలా అంటుంది. సరే అయితె వెళ్దాం పద అని ఇద్దరు వెళ్లబోతుంటే అదే గుడి దగ్గరకు గర్ల్‌ఫ్రెండ్‌ తో వచ్చిన రాహుల్‌. గుడిలో ఉన్న కావ్య, అపర్ణలను చూసి రుద్రాణికి ఫోన్‌ చేసి చేప్తాడు. సరే నువ్వ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు ఇక నేను చేయాల్సింది నేను చేస్తాను అని ఫోన్‌ కట్‌ చేసి కిందకు వెళ్తుంది.

హాల్లో కూర్చున్న  రాజ్ పేపర్‌ చూస్తూ..  అమ్మ ఎక్కడ నాన్నమ్మా అని ఇందిరాదేవిని అడుగుతాడు.  ఇందిరాదేవి తనకు తెలియదని చెప్తుంది. ఇంతలో కిందకు వచ్చిన రుద్రాణి  నీకు తెలియదా? అమ్మా.. వదిన ఎక్కడికి వెళ్లిందో నీకు నిజంగా తెలియదా?  అమ్మా  అంటూ నాన్చుతుంటే నువ్వేదో మధ్యలో చెప్పడానికి దూరావు కదా అత్త చెప్పు ఏంటో అంటాడు రాజ్‌.

ఇందిరాదేవి నువ్వేంటే చెప్పేది ఇక్కణ్నుండి వెళ్లు అంటుంది. చెప్పాల్సిందంతా చెప్పనివ్వు నానమ్మ లేకపోతే అత్తకు కడుపు ఉబ్బిపోతుంది. అందులో మా అమ్మ గురించి నాతోనే చెప్పడానికి వచ్చింది కదా? అని రాజ్‌ అడగ్గానే మీ అమ్మా గుడికి వెళ్లింది. ఎవరి దర్శనానికి వెళ్లిందో తెలుసా? నీ భార్యను కలవడానికి వెళ్లింది. అని రుద్రాణి చెప్పగానే రాజ్‌ కోపంతో ఊగిపోతుంటాడు. నిన్నటి వరకు మొగుగు పెళ్లాల మధ్య తగువు పెట్టావు. ఇప్పుడు తల్లికొడుకులను విడదీయాలని చూస్తున్నావా? అంటూ ఇందిరాదేవి, రుద్రాణిని తిడుతుంది. ఇంతలో అపర్ణ వస్తుంది. అందరికీ ప్రసాదం ఇస్తుంది.

రాజ్‌ మాత్రం కోపంగా అపర్ణను నువ్వు గుడిలో ఎవరిని కలవడానికి వెళ్లావు మమ్మీ  అని అడుగుతాడు. కావ్యను కలవడానికే నేను గుడికి వెళ్లానని అక్కడికి వెళ్లాక అనామిక ఎలా మోసం చేసి తనను వాడుకుందో కావ్య చెప్పిందని అపర్ణ చెప్పగానే రాజ్‌ సీరియస్‌ గా ఇంకోసారి నువ్వు ఆ మనిషిని కలవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి  పైకి వెళ్తాడు.  రాజ్‌ వెళ్లిపోయాక అపర్ణ కోపంగా ఎప్పుడు నా కొడుకు కోడలు మీద పడి ఏడ్వడం కాదు నీ కొడుకు ఎవరితోనో కారులో తిరుగుతున్నాడు అని చెప్తూ స్వప్న నీ కాపురం జాగ్రత్త అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Intinti Ramayanam Today Episode: పండక్కి గొడవ పెట్టిన పల్లవి.. శ్రీయాకు స్ట్రాంగ్ వార్నింగ్.. డబ్బులు మాయం..

Nindu Noorella Saavasam Serial Today october 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ఆరుతో మాట్లాడటం చూసిన అమర్   

GudiGantalu Today episode: నోరు జారిన బాలు.. మీనాకు కోపం తెప్పించిన ప్రభావతి..ఇంట్లోంచి వెళ్ళిపోయిన మీనా..

Brahmamudi Serial Today October 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు నిజం చెప్పబోయిన కళ్యాణ్‌  

Illu Illalu Pillalu Today Episode: పార్టీ కోసం ప్రేమ రెడీ.. ధీరజ్ మాటకు ఫిదా.. ఐశ్వర్య ఎంట్రీతో ప్రేమకు షాక్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మిస్ చేయొద్దు..

Jayammu Nischayammuraa: నాగ చైతన్య శోభిత మధ్య గొడవలు.. మాట్లాడడం లేదంటూ!

Intinti Ramayanam Today Episode: అవనిని ఇరికించబోతున్న పల్లవి.. శ్రీకర్ కు డెడ్ లైన్.. అక్షయ్ డబ్బులు కొట్టేసింది ఎవరు..?

Big Stories

×