BigTV English

Punganur Minor Girl Incident: పుంగనూరు చిన్నారి ఘటన.. బాబు Vs జగన్

Punganur Minor Girl Incident: పుంగనూరు చిన్నారి ఘటన.. బాబు Vs జగన్

Punganur Minor Girl Incident Latest News: మైనర్ బాలిక హత్య కేసుతో పుంగనూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మొత్తి పోసుకుంటున్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు అడుగులు వేస్తున్నారు. ఏకంగా జగన్, చంద్రబాబు కూడా ఈ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయారు. పుంగనూరు మైనర్ బాలిక హత్య కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( YS Jgan) ఈ నెల 9న పుంగనూరు వెళ్లనున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దీంతో.. పుంగనూరు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.


చిత్తూరు జిల్లా పుంగనూరు(Punganur)లో మైనర్ బాలిక గత నెల 29న అదృశ్యమైంది. 2 రోజుల పాటు 11 టీమ్‌లు డాగ్ స్కాడ్‌ తో కలిసి గాలించాయి. కానీ ఫలితం లేకపోయింది. చివరికి అక్టోబర్ 2న పుంగనూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక మృతదేహం బయటపడింది. ఇంత జరిగినా పోలీసులు నిందితుల గురించి నోరు మెదపలేదు. ఓ వైపు చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తుంటే.. పోలీసులు మాత్రం ఆ స్థాయిలో రెస్పాండ్ అవ్వలేదు. స్థానిక టీడీపీ ఇన్‌చార్జీ చల్లా బాబు రెడ్డి బాధితులను పరామర్శించి వెళ్లిపోయారు.

పోలీసులు, అధికారం పార్టీ నేతలు ఈ ఇష్యూని లైట్ తీసుకున్నట్టు కనిపించడంతో వైసీపీ దాన్ని క్యాచ్ చేసుకునే పనిలో పడింది. వెంటనే సీన్‌లోకి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంటర్ అయ్యారు. మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించి.. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నెల 9న వస్తున్నాడని ప్రకటించారు. అంతేకాదు.. పోలీసులతో పాటు అధికార పార్టీపై విమర్శలు చేశారు. మదనపల్లి పైల్స్ ఫైర్ కేసులో అత్యుత్సాహం చూపిన చంద్రబాబు(chandrababu) ఈ కేసును ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు.


Also Read: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

వైసీపీ దూకుడు పెంచడంతో టీడీపీ(TDP) నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది. హోంమంత్రి అనితా, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, పరూఖ్‌‌లు బాధితులను పరామర్శించారు. చిన్నారి తండ్రితో సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని.. బాధ్యులను శిక్షిస్తామని చంద్రబాబు వారికి దైర్యం చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని అనిత అన్నారు. అత్యాచారం జరిగిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిదేమీ లేదని ఐదుగురు డాక్టర్లు చెప్పారని ఆమె చెప్పారు. హత్యకేసులో ఐదుగురు అనుమానితులను గుర్తించామన్న ఆమె వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి చనిపోతే రాజకీయం చేయడమేంటని ఫైర్ అయ్యారు. బాధితులకు అండగా ఉంటామని.. వైసీపీ ప్రచారాన్ని నమొద్దని రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. టీడీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టినా వైసీపీ మాత్రం దూకుడుగా వెళ్తోంది. ఈ నెల 9న బాధితులను పరామర్శించడానికి జగన్ వెళ్లనున్నారు. ఆయన ఏం మాట్లాడుతారు? ఆ తర్వాత ఈ కేసు ఏ టర్న్ తీసుకుంటుందో? పుంగనూరు పాలిటిక్స్‌లో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×