BigTV English

Arvind Kejriwal: మోదీ అలా చేస్తే.. బీజేపీ తరపున ప్రచారం చేస్తా.. కేజ్రీవాల్ సవాల్

Arvind Kejriwal: మోదీ అలా చేస్తే.. బీజేపీ తరపున ప్రచారం చేస్తా.. కేజ్రీవాల్ సవాల్

Kejriwal Challenges PM Modi: ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే.. తాను బీజేపీ కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


ఈ మేరకు ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే తాను బీజేపీ మద్దతు ఇస్తానని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేదని, అవినీతి, నిరుద్యోగమేనని అర్థమైందని విమర్శలు చేశారు. కాగా, హర్యానా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఓటమి చెందుతాయన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలోనూ ఇదే జరుగుతుందని ఎద్దేవా చేశారు.

22 రాష్ట్రాల్లో బీజేపీ కరెంట్ ఫ్రీ చేస్తే.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ సూచించనట్లుగా హర్యానా, జమ్మూకశ్మీర్ లో బీజేపీ తన పట్టును కోల్పోయిందన్నారు.


జూన్ నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే సాధించిందని, వారి ఇంజిన్ ఒకటి విఫలమైందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ భావన అభివృద్ధి గురించి కాదని.. డబుల్ లూట్, డబుల్ అవినీతి గురించి అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మాత్రం అభివృద్ధి ఆగిపోనివ్వమని తేల్చి చెప్పారు.

Also Read: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

కొన్ని నెలల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, వారు ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఏడేళ్ల పాటు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, మణిపూర్ లో ఏడేళ్లు ఉందని గుర్తు చేశారు. కానీ మణిపూర్ మండుతోందని, దేశం మొత్తాన్ని మణిపూర్ చేయాలనుకుంటున్నారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×