BigTV English
Advertisement

Brahmamudi Serial Today September 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతిని చూసిన రుద్రాణి – నిజం చెప్పొద్దన్న రాహుల్‌

Brahmamudi Serial Today September 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతిని చూసిన రుద్రాణి – నిజం చెప్పొద్దన్న రాహుల్‌

Brahmamudi serial today Episode: హాల్లో కూర్చుని వీడియోలు చూస్తూ నవ్వుకుంటున్న కావ్య దగ్గరకు ఇంద్రాదేవి, అప్పు వెళ్తారు. ఎంటక్కా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతుంది. మాకు ఆ జోకేంటో చెబితే మేము కూడా నవ్వుకుంటాము కదా మనవరాలా అంటుంది ఇంద్రాదేవి.. ఇవి జోక్స్‌ కాదు అమ్మమ్మ చిన్న పిల్లల వీడియోలు.. ఒక్కొక్కరు చేసే అల్లరి పనులు చూస్తుంటే భలే నవ్వొస్తుంది తెలుసా..? అంటుంది కావ్య.. ఆ నవ్వుకో నవ్వుకో.. ఇంకో తొమ్మిది నెలలు అయితే నీ కడుపులోని పిల్లాడు బయటకు వస్తాడు కదా..? అప్పుడు ఏడిపిస్తాడు నిన్ను వాడి అల్లరి పనులతో అంటుంది ఇంద్రాదేవి.


అయితే నాకు చాలా ఆశగా ఉంది అమ్మమ్మ వీడు నా కడుపులోంచి బయటకు వచ్చి నన్ను అమ్మా అని పిలిస్తే నాకు వినాలని ఉంది అమ్మమ్మ అంటుంది కావ్య. పక్కనే నిలబడ్డ అప్పు మాత్రం బాధగా కానీ ఆ దేవుడు నీకు ఆ అదృష్టాన్ని ఇస్తాడో లేడోనని భయంగా ఉంది అక్కా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో కావ్య అమ్మమ్మ నిజంగా అమ్మ తనంలో ఇంత ఆనందం ఉంటుందా..? అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వేం చూస్తావే మనవరాలా..? ముందు ముందు అన్నీ నీకే తెలుస్తాయి. మీ అదృష్టం అక్కా చెల్లెలు ఇద్దరూ ఒకేసారి తల్లి కాబోతున్నారు అని చెప్తుంది. ఇంతలో కావ్య ఫోన్‌కు డాక్టర్‌ కాల్‌ చేస్తుంది. ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి ఉంటుంది. ఫోన్‌ కోసం కావ్య వెళ్లబోతుంటే.. అప్పు వెళ్లి ఫోన్‌ తీసుకొస్తానని చెప్పి ఫోన్‌ దగ్గరకు వెళ్లి చూస్తుంది. డాక్టర్‌ గారు ఫోన్‌ చేస్తున్నారేంటి..? అని కాల్‌ లిప్ట్‌ చేయగానే.. కావ్యకు అబార్షన్‌ చేయాలని డాక్టర్‌ చెప్తుంది. అప్పు షాక్‌ అవుతుంది. వీలు చూసుకుని అక్కకు తర్వాత చెప్తాను అంటుంది.

తర్వాత రేవతి బయటకు వెళ్లి జగదీష్‌తో ఫోన్‌ మాట్లాడుతుంది. ఇంతలో అపర్ణ బయటకు వస్తుంది. రాహుల్‌, రుద్రాణి అడ్డుపడి అపర్ణను ఆపేస్తారు. ఆగు వదిన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. భోజనాలు చేయాలి కదా..? అరటి ఆకులు కట్‌ చేసి తీసుకొద్దామని వెళ్తున్నాను అని అపర్ణ చెప్పగానే.. ఆ మాత్రం దానికి నువ్వు వెళ్లడం ఏంటి అత్తయ్యా.. నాకు చెప్తే నేను తీసుకొస్తాను కదా.. మీరెళ్లండి అత్తయ్యా నేను తీసుకొస్తాను అంటాడు రాహుల్‌. సరే త్వరగా తీసుకునిరా అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. రుద్రాణి ఇరిటేటింగ్‌ గా నీకెందుకురా ఈ పనులు అంటుంది. చేయాలి అమ్మా అప్పుడే కదా మంచి పేరు వస్తుంది. నీకు తెలియదులే నువ్వు వెళ్లు అంటూ రాహుల్‌ అరటి ఆకుల కోసం బయటకు వెళ్తాడు. అప్పుడే రేవతి ఫోన్‌ మాట్లాడటం చూస్తుంది రుద్రాణి.


అమ్మా నా రేవతి డైరెక్టుగా వస్తే మీ అమ్మ నిన్ను గెంటేస్తుందని ఇలా ముసుగులో వచ్చి మీ అమ్మను బురిడీ కొట్టిస్తున్నావా..? చెప్తా నీ పని అనుకుంటుండగా వెనక నుంచి రాహుల్ వచ్చి మమ్మీ ఏమైంది అలా తొంగి చూస్తున్నావేంటి..? అని అడుగుతాడు.  ఆ ముసుగులో వచ్చింది ఎవరో కాదురా.. అపర్ణ వదిన పెద్ద కూతురు రేవతి అని చెప్తుంది. ఏంటి మమ్మీ రేవతి అక్కనా..? అంటూ రాహుల్‌ షాకింగ్‌ గా అడుగుతాడు. అవును నాకు ఇందాకే ఫోన్‌ మాట్లాడుతుంటే తెలిసింది పద దాని బండారం బయటపెట్టేద్దాం.. అంటూ వెళ్లబోతుంటే.. రాహుల్ ఆపి మమ్మీ ఆగు ఇప్పుడు నువ్వు తొందర పడి నిజం బయట పెట్టేశావు అనుకో రాజ్‌కు నీ మీద కోపం వస్తుంది అంటాడు. దీంతో అందుకే తను రేవతి అన్న విషయం ఆ రాజ్‌తోనే చెప్పించబోతున్నాను అంటుంది రుద్రాణి. అది ఎలాగ మమ్మీ అని రాహుల్‌ అడిగితే దొంతగనంగా ముసుగు వేసుకుని వచ్చిన దాని మీద దొంగతనం నెంప మోపితే వాళ్లే ఆటోమాటిక్‌ గా బయటపడతారు అని చెప్పగానే.. నువ్వు సూపర్‌ మమ్మీ పద అంటాడు రాహుల్‌.. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.

తర్వాత కావ్య రూంలో నెక్లెస్‌ తీసుకెళ్లి రేవతి హ్యండ్ బ్యాగ్‌ లో వేయాలనుకుంటుంది రుద్రాణి. అందుకోసం ఎవ్వరూ చూడకుండా కావ్య రూంలోకి వెళ్లి నెక్లెస్‌ కొట్టేసుకుని వస్తుంది. లోపలికి వెళ్లి రేవతి బ్యాగ్ లో నెక్లెస్‌ వేస్తుంది. అప్పుడే కనకం, రేవతి, స్వరాజ్‌ అక్కడకు వస్తారు. కనకం అనుమానంగా ఏంటి రుద్రాణి గారు మీ రూం అటువైపు ఉంది కదా ఇటు వచ్చారేంటి అని అడుగుతుంది. నీ కోసమే వచ్చాను అని చెప్తుంది రుద్రాణి. దీంతో ఏంటి మా కోసం వచ్చారా..? అని కనకం అడగ్గానే.. మీ కోసం అంటే మీకోసం కాదు నేను తన కోసం వచ్చాను అని చెప్తుంది. దీంతో అంతా అబద్దం తను మా అమ్మ కోసం రాలేదు.. నా చాక్లెట్స్‌ కొట్టేయడానికి వచ్చింది. అమ్మో మా అమ్మ హ్యాండ్‌ బ్యాగ్‌లో నా చాక్లెట్స్‌ ఉన్నాయో లేదో చూడాలి అంటూ బ్యాగ్‌ ఓపెన్ చేయడానికి వెళ్తుంటే.. రుద్రాణి ఆపాలని చూస్తుంది. రేవతి కూడా స్వరాజ్‌ను బ్యాగ్‌ చూడొద్దని రుద్రాణికి సారీ చెప్పమని చెప్తుంది. స్వరాజ్‌ సారీ చెప్పి వెళ్లిపోతాడు.

కిందకు వెళ్లిన రుద్రాణి.. కావ్యను ఎందుకు నెక్లెస్‌ వేసుకోలేదని మీ అత్త మీద ప్రేమ ఉంటే నెక్లెస్‌ వేసుకుని వస్తావు అంటుంది. దీంతో కావ్య నెక్లెస్‌ కోసమని లోపలికి వెళ్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

DSP: బాబునే మెస్మరైజ్ చేసిన డీఎస్పీ.. మామూలు ముదురువి కాదయ్యో!

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట దీపావళి పూజ.. ధీరజ్ ప్రేమ గొడవ.. పోలీసుల ఎంట్రీ.. ప్రేమ కన్నీళ్లు..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు షాకిచ్చిన కమల్.. పల్లవికి క్లాస్ పీకిన పార్వతి.. అక్షయ్ కు అవని సపోర్ట్..

Brahmamudi Serial Today October 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్‌ చేత అబద్దం చెప్పించిన కావ్య – నిజం తెలుసుకున్న రాజ్‌  

GudiGantalu Today episode: తాగొచ్చిన బాలు.. ఒక్కొక్కరికి క్లాస్ పీకిన మీనా.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు..

Hyper Aadi : నోరు జారి బుక్కయిన ఆది..దీపిక పరువు అడ్డంగా పోయిందిగా..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మస్ట్ వాచ్..

Gundeninda Gudigantalu Satyam: ‘గుండెనిండా గుడి గంటలు ‘ సత్యం క్యూట్ ఫ్యామిలీ.. బాగా సౌండే..

Big Stories

×