BigTV English

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కామెడీ, సస్పెన్స్‌తో ఒక కన్నడ సినిమా ప్రేక్షకులకు రిఫ్రెషింగ్ కంటెంట్ గా నిలిచింది.ఈ చిత్రం శ్రీలంకలో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఈ కథ డార్క్ కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన థ్రిల్లర్‌గా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ పొందింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ‘టేస్టీ బిర్యానీ విత్ ఫ్యూ ఎలాచీస్” అని ప్రశంసించింది. ఇక మరెందుకు ఆలస్యం, ఫ్యామిలీతో కలసి కడుపుబ్బా నవ్వుకోండి. ఈ సినిమా ఎక్కడ ఉంది ? పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాలపై కూడా ఓ లుక్ వేద్దాం.


కథలోకి వెళ్తే

చిదంబర ఒక ప్రొఫెషనల్ చెఫ్. అతను ఆర్థిక పరిస్థితిలో అంతంత మాత్రమే ఉంటుంది. ఈసమయంలో అతని ప్రేమికురాలు అను అతని మద్దతుగా ఉంటుంది. ఇంతలో మోనా అనే ఒక రిచ్ లేడి అతనికి సహాయం చేస్తానని వస్తుంది. అయితే ఒక డీల్ అతని ముందు ఉంచుతుంది. చిదంబర ఆమెకు సహాయం చేస్తే, ఆమె అతని ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ ఈ డీల్ వల్ల చిదంబర అతని ఫ్లాట్‌లో ఒక వ్యక్తి మరణానికి కారణమవుతాడు. ఇది అతన్ని పెద్ద సమస్యల్లో పడేస్తుంది. ఇక్కడే డాన్ అనే వ్యక్తి, ఒక కరప్ట్ పోలీస్ ఆఫ్సీసర్ ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు మరణించిన వ్యక్తి మొబైల్ ఫోన్‌ను వెతుకుటుంటారు. అందులో ఏదో సీక్రెట్ దాగి ఉంటుంది.

చిదంబర శవాన్ని దాచడానికి చేసే ప్రయత్నాలు కదుపబ్బ నవ్విస్తాయి. ఈ కథ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన డార్క్ కామెడీగా మారుతుంది. చిదంబర డాన్, పోలీస్, మోనా మధ్య చిక్కుకుని, శవాన్ని దాచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌లు వస్తాయి. ఈ రగడ నుంచి చిదంబర తప్పించుకోగలడా ? చిదంబరతో మోనా చేసుకున్న డీల్ ఏమిటి ? చిదంబర తన ఆర్థిక సమస్యల నుంచి బయట పడగలడా ? అనేది ఈసినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘చెఫ్ చిదంబర’ (Chef Chidambara) 2024లో విడుదలైన కన్నడ కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఎం. ఆనంద్ రాజ్ దర్శకత్వంలో డామ్తి పిక్చర్స్ పతాకంపై రూపా డి.ఎన్. దీనిని నిర్మించింది. ఇందులో అనిరుద్ధ జాత్కర్ (చిదంబర – ప్రధాన పాత్ర), రాచెల్ డేవిడ్ (అను – చిదంబర ప్రేమికురాలు), నిధి సుబ్బయ్య (మోనా – లోన్ షార్క్ భార్య), శరత్ లోహితశ్వ (కరప్ట్ పోలీస్ ఆఫీసర్), శివమాణి (డాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 14, 2024న థియేటర్లలో విడుదలైంది. 2024 జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ, తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ తో IMDb లో 5.8/10 రేటింగ్ పొందింది.

Read Also : అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే సైకో… వీడికి ఇదేం మాయ రోగం సామీ… క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్

Related News

kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?

OTT Movie : పని మనిషితో యజమాని యవ్వారం… ఇంటి పని కోసం పిలిచి ఇదేం పని సామీ… క్లైమాక్స్ ట్విస్ట్‌కు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

OTT Movie : ఏడుగురిని పెళ్లాడి, ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్‌లో ఘోరంగా చంపే లేడీ కిల్లర్… పెళ్లంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

OTT Movie : ఈ ఊర్లో ఫ్యామిలీకో సైకో… అడుగు పెడితే చావును వెతుక్కుంటూ వచ్చినట్టే… ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉండే థ్రిల్లర్

Big Stories

×