E-Paper
Advertisement

Brahmamudi Serial Today September 16th: రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన ఇందిరాదేవి – జాబ్‌ కోసం సందీప్‌‌ను కలిసిన కావ్య

Brahmamudi Serial Today September 16th: రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన ఇందిరాదేవి – జాబ్‌ కోసం సందీప్‌‌ను కలిసిన కావ్య
Advertisement

Brahmamudi Serial September 16th Today Episode : నేను కావ్య గురించి అడిగినప్పుడల్లా మాట దాటేస్తున్నారేంటి? అని అపర్ణ అడగ్గానే అందరూ షాక్‌ అవుతారు. అసలు కావ్య ఎక్కడుంది. ఇంట్లోనే ఉందా? నేను కళ్లు తెరవగానే మొదట కావ్యనే చూస్తాను అనుకున్నాను కానీ కావ్య కనబడలేదు. ఇప్పుడు ఇంటికి వస్తే కూడా కావ్య కనిపించడం లేదు. కావ్యకు ఏమైనా అయిందా? అంటూ అపర్ణ ప్రశ్నించడంతో.. ఇంకెక్కడి కావ్య వదిన. నీ కోడులు ఎప్పుడో వెళ్లిపోయిందిగా అంటుంది. దీంతో అపర్ణ షాక్‌ అవుతూ.. వెళ్లిపోవడం ఏంటి? అని అడగ్గానే రాజ్‌ వెళ్లిపోవడం అంటే గుడికి వెళ్లిందని అత్తయ్య చెప్తుంది మమ్మీ.. నీకు ఇలా జరగడంతో.. నీకు మంచి జరగాలని  కళావతి అమ్మవారికి మొక్కుకుందట. అందుకే వారం రోజుల నుంచి ప్రతిరోజూ గుడికి వెళ్లి వ్రతం చేస్తుందట అని రాజ్‌ చెప్పగానే.. వ్రతం చేస్తే.. అక్కడే ఉంటుందా? ఇంటకి రావడం లేదా? అప్పుడైనా నన్ను చూడటానికి రావాలి కదా? అంటూ అపర్ణ ప్రశ్నించడంతో రాజ్‌ ఏం చెప్పాలో తెలియక వెంటనే స్వప్న అమ్మ చాలా సేపు నిలబడకూడదు త్వరగా హారతి ఇవ్వు అని చెప్పాగానే స్వప్న హారతి ఇస్తుంది. రాజ్, అపర్ణను తీసుకుని లోపలికి వెళ్తాడు.

రుద్రాణిని వాయించిన ఇందిరాదేవి

Advertisement

రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్‌ ఇస్తుంది. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే బాగుండదు అంటూ హెచ్చరిస్తుంది. దీంతో ఏదో నోరు జారిందని రుద్రాణి అంటే నీ నోరు కాస్త కొద్ది రోజులు అదుపులో పెట్టుకో.. డాక్టర్‌ గారు చెప్పారు కదా? అపర్ణకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పొద్దని రాజ్ కూడా అందుకేగా సైలెంట్‌ గా ఉన్నాడు అంటూ ఇందిరాదేవి, రుద్రాణికి గడ్డి పెట్టి లోపలికి వెళ్తుంది. దీంతో రుద్రాణి నువ్వెన్ని అన్నా సరే నాకు ఇప్పుడు కావాల్సింది. రాజ్‌ పిచ్చోడు కావడం. ఓంటరి వాడుగా మిగిలిపోవడం. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటుంది. అయితే కావ్య విషయం అత్తయ్యకు నువ్వే చెప్పేస్తావా? మమ్మీ.. అని రాహుల్‌ అడిగితే.. రాజ్‌ కు అబద్దం చెప్పడం కూడా చేత కాదురా.. ఇలాంటి పరిస్థితుల్లో కావ్య ఏ ఊరికో వెళ్లిందని చెప్పాలి కాని గుడికి వెళ్లిందని ఎవరైనా చెప్తారా? రాత్రి అయ్యాక కూడా కోడలు ఇంటికి రాకపోతే మా వదిన ఊరుకుంటుందా? అనగానే అయితే అత్తకు నవ్వే నిజం చెప్పేస్తావు కదా మమ్మీ అంటాడు రాహుల్‌. అవును ఆ నిజం విన్నాక మా వదిన గుండె ఏకంగా పైకే పోతుందో.. లేక నరాలు చిట్లి పోతుందో కళ్లారా చూద్దాం. పద అని లోపలికి వెల్లిపోతారు.

Also Read: మహాలక్ష్మీని మీడియా ముందు ఇరికించిన సీత – సీత మాటలకు అర్చన షాక్‌

Advertisement

జాబ్‌ కోసం సందీప్‌ ను కలిసిన కావ్య

మరోవైపు కావ్య తనతో  ఇంతకు ముందు డిజైన్స్‌  వేయించుకున్న సందీప్‌ తో మాట్లాడుతుంది. ఇప్పుడు డిజైన్స్‌ వేసే  అవకాశం ఇవ్వమని అడుగుతుంది.  ఒకప్పుడు నువ్వు వేసిన డిజైన్స్‌ దుగ్గిరాల వారి కంపెనీకి అమ్మేవాణ్ని ఇప్పుడు నువ్వు అదే ఇంటికి కోడలు అయిపోయావు కదా ఇప్పుడు నేనేం చేయగలను అంటాడు సందీప్‌. దీంతో  పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా సందీప్‌ గారు. కాలాన్ని బట్టి మారిపోతుంటాయి అంటుంది. అయితే మీ మాటలు బట్టి చూస్తుంటే నువ్వు అత్తారింటికి దూరమై సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టావని అర్థం అవుతుంది. కానీ నేను ఇప్పుడు ఎవరితోనైనా కాంటాక్ట్‌ కుదుర్చుకుని డిజైన్స్‌ ఇస్తానని చెప్పాకా.. నువ్వు మళ్లీ తిరిగి వెళ్లిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా..? నీలా నేను డిజైన్స్‌ వేయలేను కదా? అంటాడు. దీంతో అలాంటి పరిస్థితి మళ్లీ రానివ్వను మీకు కంటిన్యూగా డిజైన్స్‌ వేస్తాను అంటూ హామీ ఇస్తుంది కావ్య. దీంతో సందీప్‌ పాత క్లయింట్స్‌ ను అడుగుతాను ఎవరైనా డిజైన్స్‌ కావాలంటే అప్పుడు నీకు చెప్తాను అంటాడు.

కావ్యను ఇంటికి తీసుకురమ్మన్న అపర్ణ

మరోవైపు బెడ్‌ రూంలో కూర్చు్న్న అపర్ణ కావ్య గురించి ఆలోచిస్తుంది. ఇంతలో రాజ్‌ ట్యాబ్లెట్స్‌ వేసుకోమని ఇస్తాడు. కావ్య ఇంకా రాలేదా? అని అడుగుతుంది. రాజ్ బయటకు వెళ్లిపోతాడు. తర్వాత ధాన్యలక్ష్మీని నేను హాస్పిటల్‌ కు వెళ్లాక ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అని అడుగుతుంది అపర్ణ. దీంతో ధాన్యలక్ష్మీ మౌనంగా ఉంటుంది. తర్వాత రుద్రాణిని నిలదీస్తుంది అపర్ణ దీంతో రుద్రాణి నీ కోడలే చేయరాని తప్పు చేసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో స్వప్న, రుద్రాణిని తిట్టి చేసిందంతా చేసి ఇప్పుడు నా చెల్లి మీద అబాండాలు వేస్తే ఎలా అంటూ అపర్ణను మీరు చెప్తే కావ్య ఆఫీసుకు వెళ్లిందా? లేక తనే వెళ్లిందా? అని అడుగుతుంది స్వప్న దీంతో నేనే బలవంతంగా కావ్యను పంపించానని అపర్ణ చెప్పడంతో తర్వాత ఇంట్లో జరిగిన గొడవ గురించి కావ్య వెళ్లిపోయిన విషయం గురించి మొత్తం చెప్తుంది స్వప్న. దీంతో అపర్ణ ఎమోషనల్ అవుతూ.. నా కోడలు నిప్పు అలాంటి దాన్ని ఇంట్లోంచి ఎలా వెళ్లిపోయేలా చేశారని నిలదీస్తుంది. ఇంతలో రాజ్ రాగానే వెంటనే వెళ్లి నువ్వే స్వయంగా నా  కోడలిని ఇంటికి తీసుకురమ్మని ఆర్డర్‌ వేస్తుంది.  ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ ముగుస్తుంది.

Tags

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×