BigTV English

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Nursing student death: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో  ఓ యవతి మృతి చెందింది. రూమ్‌లో రక్తపు మరకలు కనపించడంతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మృతురాలు రూమ్‌ ఎప్పుడు తీసుకుంది? ఎంతమంది వచ్చారు? అనేదానిపై ఆరా తీస్తున్నారు.


హైదరాబాద్ గచ్చిబౌలిలోని దారుణం చోటు చేసుకుంది. రెడ్ స్టోన్ హోటల్‌లో ఓ యువతి అనుమానా స్పదంగా మృతి చెందింది. మృతి చెందిన యువతి పేరు శృతి. సొంతూరు జడ్చర్ల ప్రాంతానికి చెందిన యువతి. జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఈమె యశోద ఆసుపత్రిలో నర్సుగా పని చేసింది.

యువతి చున్నీతో ఉరేసుకున్న విషయాన్ని హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రూమ్‌ని పరిశీలించారు. కాకపోతే రూమ్‌లో ఫుడ్, బీర్ బాటిళ్లు, రక్తపు మరకలు కనిపించాయి.   ఇది హత్యా, ఆత్మహత్యా అనేది తేల్చడానికి క్లూస్ టీమ్‌లు రంగంలోకి దిగేశాయి.


దీనికి సంబంధించి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో యశోద హాస్పటల్‌గా ట్రైనీ నర్సుగా పని చేసింది శృతి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వెళ్లిపోయింది. జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ఆదివారం నలుగురు ఇద్దరు అమ్మాయి, అబ్బాయిలు శృతి రూమ్‌కి వెళ్లారు. ఏం జరిగిందో తెలీదుగానీ, తెల్లవారుజామున సమయంలో ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.

ALSO READ: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

యువతి మృతి విషయం తెలియగానే కుటుంబసభ్యులు జడ్చర్ల నుంచి గచ్చిబౌలికి చేరుకున్నారు. అత్యాచారం చేసి హత్య చేశారన్నది కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. హోటల్ ముందు ధర్నాకు దిగారు. వైద్య పరీక్షలు నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శృతికి సంబంధించి బ్యాగ్, సెల్‌ఫోన్ వంటి వస్తువులు ఆ రూమ్‌లో ఉన్నాయి.

శృతి రూమ్‌ ఎప్పుడు తీసుకుంది? అనేదానిపై హోటల్ నిర్వాహకుల నుంచి డీటేల్స్ తీసుకున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. రూమ్‌లోకి వచ్చిన ఆ నలుగురు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. నర్సుగా పని చేసిన శృతి,  ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని అంటున్నారు కుటుంబసభ్యులు. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారనేది ఆసక్తిగా మారింది.

 

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×