BigTV English

Karthi: కార్తీ 29వ సినిమా షురూ..పోస్టర్ అదిరిందిగా

Karthi: కార్తీ 29వ సినిమా షురూ..పోస్టర్ అదిరిందిగా

Kollywood hero Karthi upcoming 29th movie announced: తమిళ నటుడు కార్తీక్ శివకుమార్ గా పరిచయమైన కార్తీ తమిళనాడే కాదు తెలుగునాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. మూడు ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. అన్నయ్య సూర్య కూడా విలక్షణ నటుడే. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ ఎంతో మంది అభిమానులకు దగ్గరయ్యారు. దాదాపు కార్తీ నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగులోనూ డబ్బింగ్ అయి మంచి కలెక్షన్లు నమోదు చేస్తాయి. ముందుగా మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా చేరిన కార్తీ పరుత్తి వీరన్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాలో నటించిన ప్రియమణికి జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇది 2007లో రిలీజై అద్భుత విజయం సాధించింది.


అవారాగా..

2010లో పెయ్యా మూవీతో కోలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టింది.
తమన్నా హీరోయిన్ గా నటించింది ఈ చిత్రంలో. ఈ మూవీ తెలుగులో ఆవారాగా విడుదలై ఇక్కడా అపూర్వ విజయం అందుకుంది. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విజయంతో ఇక కార్తీ వెనుదిరిగి చూసుకోలేదు. తన ఓన్ ట్యాలెంట్ తో కోలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో హీరో నాగార్జున కేర్ టేకర్ గా ఊపిరి మూవీలో నటించిన కార్తీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఖైదీ, సర్ధార్ సినిమాలతో కమర్షియల్ హీరో రేంజ్ కి ఎదిగారు. కార్తీ వ్యక్తిగతంగానూ పలు సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు.ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో వచ్చిన వరదలకు అపార ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించింది. కార్తీ తన అన్న సూర్య, వదిన జ్యోతికలతో కలిసి వరద సాయం రూ.50 లక్షలు అందించారు. అయితే అన్నయ్య సూర్య తో కలిసి కార్తీ నటిస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై పలువురు నిర్మాతలు కూడా వీరిని సంప్రదిస్తున్నారు.


కంగువలో గెస్ట్ పాత్రలో..

సరైన సబ్జెక్టు దొరికతే చేద్దామని అనుకుంటున్నారు ఈ బ్రదర్స్. అయతే సూర్య హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ కంగువ లో కార్తీ ఓ క్యామియో రోల్ ప్లే చేశాడని ప్రచారం జరుగుతోంది. తన కెరీర్ లో 28 చిత్రాలు చేసిన కార్తీ ప్రస్తుతం 29వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు దర్శకుడు తమిళ్. తానక్కరన్ అనే మూవీతో సత్తా చాటారు దర్శకుడు తమిళ్. ఇప్పుడు కార్తీ హీరోగా రూపొందించబోయే సినిమాకు దర్శకుడిగా ఎంపికయ్యారు. డ్రీమ్ వారియర్, ఐవీ ఎంటర్టైన్మెంట్స్, బీ4యు మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాయి. దీనిపై నిర్మాతలు అధికారికంగా ప్రకటన ఇచ్చారు. పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందించబోతున్నారు.

Also Read: బయ్యర్లకు లాభాల పంట పండిస్తున్న మత్తు వదలరా 2 టోటల్ కలెక్షన్లు ఇవి

హై బడ్జెట్ మూవీ

కార్తీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాపై కథానాయిక ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు, సాంకేతిక నిపుణులు ఎవరు అనే విషయాలు ఇంకా ప్రకటించలేదు చిత్ర యూనిట్. కేవలం హీరో, దర్శకుడి పేర్లు మాత్రమే రివీల్ చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతామంటున్నారు. వచ్చేసమ్మర్ కు ఈ మూవీని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×