E-Paper
Advertisement

సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?

సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?
Advertisement

Bigg Boss 10 Promo 2:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎట్టకేలకు అధికారికంగా సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం అయింది. అగ్నిపరీక్ష2లో సత్తా చాటుతూ ఏకంగా 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఇటు సెలబ్రిటీలు 10 మంది హౌస్ లోకి వచ్చారు.. అలా మొత్తం 16 మందితో ప్రారంభమైన ఈ సీజన్ లో వీరిని ఏకంగా రెండు గ్రూపులుగా బిగ్ బాస్ డివైడ్ చేశారు. సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా.. రెడ్ అండ్ బ్లూ టీములుగా విడగొట్టడం జరిగింది. ఇకపోతే ఈ రెండు టీం ల మధ్య మొదలైన గొడవలు షోపై ఆసక్తిని కలిగించడమే కాకుండా అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు సామాన్యులపై విరుచుకుపడడం ఆడియన్స్ కు మింగుడు పడడం లేదు. అంతేకాదు ప్రత్యేకించి ఒక సామాన్యుడిని సెలబ్రిటీలంతా టార్గెట్గా చేసుకొని దాడి చేస్తుంటే.. ఇంత అసూయ ఎందుకు ? కప్పు కొట్టేస్తాడని భయపడుతున్నారా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సామాన్యుడిపై మూకుమ్మడిగా దాడి చేస్తున్న సెలబ్రిటీస్..

విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ సీజన్ 10 3వ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ ప్రోమోని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. తాజా ప్రోమో లో కామనర్ రోహిత్ నాయుడు (Rohit Naidu) వద్దకు వచ్చి యాంకర్ సుధీర్ రెడ్డి(Sudheer Reddy) మాట్లాడుతూ.. “అక్కడ అంట్లు ఉన్నాయా? లేదా? అన్నది డైరెక్ట్ గా మీరు కిచెన్ రూమ్ కి వచ్చి చూసుకోవాలి. నీకు వచ్చి చెప్పాలంటే ఎలా చెబుతారు”.. అంటూ చెబుతాడు..దానికి రోహిత్ నాయుడు మాట్లాడుతూ..” నేను ఎలా పిలుస్తాను. నీకు జాబ్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి కదా.. వచ్చి అంట్లు తోమాలంటే నావల్ల కాదు. బ్లౌజ్ లేదు. నా చేతులు హార్డ్ అయిపోతాయి. మాయిశ్చర్ లాస్ అయిపోతాయి ” అంటూ తోటి కామనర్ అమన్ (Aman) వద్ద తన గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటాడు రోహిత్.

బాధ్యత మీదే అంటూ చిచ్చు పెట్టిన బిగ్ బాస్..

Advertisement

కట్ చేస్తే బిగ్ బాస్ మాట్లాడుతూ..” ఈ ఇంట్లో ఉన్న అందరూ పనులు చేయాల్సిన అవసరం లేదు. ఒక ఇంటిలోని సభ్యులు మాత్రమే మొత్తం ఇంటి పని బాధ్యతలు చూసుకోవాలి. మరో టీం సభ్యులు ఆ పనులను మానిటర్ చేయాలి. ఏ టీం పనులు చేయాలి ? ఏ టీం మానిటర్ చేయాలి? అనే విషయంపై రెండు టీమ్స్ చర్చించుకుని చెప్పండి” అంటూ బిగ్ బాస్ చెబుతాడు .

రోహిత్ నాయుడు పై కృష్ణుడు ఫైర్..

ఇక దీనికి రోహిత్ నాయుడు మాట్లాడుతూ.. కంపారిజన్ నేనేమీ చేయట్లేదు.. సృష్టి , చైత్ర కిచెన్ టీం కి హెల్ప్ చేసేది వాళ్లే.. అని చెబుతూనే బ్లూ టీం గురించి ప్రస్తావిస్తూ ఇక్కడి నుంచి జీరో హెల్పింగ్ అంటూ తన అభిప్రాయాన్ని చెబుతాడు. దీంతో కృష్ణుడు ఒక్కసారిగా రోహిత్ నాయుడు పై విరుచుకుపడ్డారు.” ముందు నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేయలేదు . నువ్వు తిన్న ప్లేటు నువ్వు కడిగావా?” అంటూ ఫైర్ అయ్యాడు .

సామాన్యుడు కప్పు కొట్టేస్తాడని భయమా?

Advertisement

అక్కడితో ఆగకుండా ముఖేష్ గౌడ, వంశీ ఇలా ఎవరికి వారు రోహిత్ నాయుడు పై విరుచుకు పడడం ఈ ప్రోమోలో చూపించారు . ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక సామాన్యుడిపై ఇంత మంది సెలబ్రిటీలు విరుచుకుపడుతున్నారు ఏంటి? సామాన్యుడు చెప్పే మాటలు వినరా? ఇంత అసూయ ఎందుకు? కప్పు కొట్టేస్తారని భయపడుతున్నారా? అంటూ ఎవరికి వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమందేమో రోహిత్ మీద పిచ్చి కుక్కల్లా పడిపోతున్నారు.. న్యాస్టీ సెలబ్రిటీస్.. ఇన్ సెక్యూర్ త్రిగుణ్ , ఫ్యాట్ కృష్ణుడు.. అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికైతే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాద ఉండదు .. నాగార్జునకు బిగ్ వార్నింగ్!

మగపిల్లలే కాదు.. ఆడపిల్లలు కూడా…బిగ్ బాస్ ఝాన్సీ ఎమోషనల్!

‘వీసా స్కామ్ ‘.. మీడియాతో నందన కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

స్టేజ్ పై గొడవపడ్డ కృష్ణ భగవాన్, యమునా?

దిష్టి పెట్టకండి.. లావైపోతా.. అనసూయ వీడియో వైరల్!

బిగ్‌బాస్ ఓటింగ్.. ఎలిమినేషన్ కి దగ్గరగా ఆ ఇద్దరే!

బిగ్ బాస్ కి టాలెంట్ అక్కర్లేదా.. రిజెక్ట్ చేయడంతో నిజాలు బయటపెట్టిన రాజకుమారి!

Big Stories

Advertisement
×