E-Paper
Advertisement

Demon -Ritu: అరె.. ఇలా దొరికిపోయారేంట్రా? రీతూ, పవన్‌ల డ్యాన్స్‌పై ట్రోలింగ్

Demon -Ritu: అరె.. ఇలా దొరికిపోయారేంట్రా? రీతూ, పవన్‌ల డ్యాన్స్‌పై ట్రోలింగ్
Advertisement

Demon -Ritu: డెమోన్ పవన్, రీతు చౌదరి వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చాలా క్లోజ్ గా ఉండడంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ అంతే చనువుగా ఉన్నారు. అయితే పవన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని రీతు పలు ఇంటర్వ్యూలలో తెలియచేశారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో వీరిద్దరూ చివరి వరకు హౌస్ లో కొనసాగారు. రీతూ 13వ వారం బయటకు రాగా, పవన్ టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.

బీబీ జోడి సీజన్ 2..

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం వీరిద్దరూ తిరిగి బీబీ జోడీ సీజన్ 2(B.B.Jodi 2) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. మొదటి పెర్ఫార్మన్స్ తో తమ అద్భుతమైన కెమిస్ట్రీ పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతు రెండవ పెర్ఫార్మెన్స్ ద్వారా పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల బీబీ జోడి ఎపిసోడ్ లో వీరిద్దరూ ఒక క్లాసికల్ పెర్ఫార్మెన్స్ చేశారు. అయితే ఈ పెర్ఫార్మన్స్ పై జడ్జెస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో రీతు స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా ఈ పర్ఫార్మెన్స్ కూడా కాపీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

రీతు పవన్ పై ట్రోల్స్..

Advertisement

రీతూ, డెమోన్ చేసిన ఈ పర్ఫామెన్స్ ప్రభాస్ హీరోగా రెబల్ సినిమాలో అలీ, ప్రభాస్ మధ్య వచ్చే కామెడీ సీన్ ను తలపిస్తున్న నేపథ్యంలో రీతూ, పవన్ పై సోషల్ మీడియా వేదిక భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదురవుతున్నాయి. అరే ఏంట్రా ఇలా దొరికిపోయారెంటీ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి తదుపరి పర్ఫార్మెన్స్ విషయంలో రీతు, పవన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తారా? లేదంటే ఇలాగే విమర్శలను ఎదుర్కొంటారా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక డెమోన్ విషయానికి వస్తే ఈయన ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అని చెప్పాలి. బిగ్ బాస్ కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరీలో భాగంగా పలువురికి అవకాశం కల్పించారు. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరీలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంపిక అయి ఈ కార్యక్రమం ద్వారా సెలబ్రెటీగా బయటకు వచ్చారు. ప్రస్తుతం పలు బుల్లి తెర కార్యక్రమాలలో పాల్గొంటూ పవన్ బిజీగా ఉన్నారు ఇక రీతూ సైతం బుల్లితెర సీరియల్స్ లో నటించి సందడి చేశారు అలాగే జబర్దస్త్ కార్యక్రమంతో పాటు పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రీతు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక బిగ్ బాస్ అనంతరం బీబీ జోడి కార్యక్రమంలో కంటెస్టెంట్ గా వీరిద్దరూ పాల్గొని సందడి చేస్తున్నారు.

Also Read: Ranabaali Movie: ‘రణబాలి’ గా విజయ్ దేవరకొండ మూవీ.. గ్లింప్స్ తోనే  ఫ్యాన్స్ ఆకలి తీర్చిన డైరెక్టర్?

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×