E-Paper
Advertisement

Crime Thriller OTT : 4 అవార్డులు 9 అంతర్జాతీయ నామినేషన్లు… IMDbలో 7.2 రేటింగ్‌… ఇది కదా క్రైమ్ థ్రిల్లర్ అంటే

Crime Thriller OTT : 4 అవార్డులు 9 అంతర్జాతీయ నామినేషన్లు… IMDbలో 7.2 రేటింగ్‌…  ఇది కదా క్రైమ్ థ్రిల్లర్ అంటే
Advertisement

Crime Thriller OTT : పెద్ద స్టార్లు లేకపోయినా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో తక్కువ బడ్జెట్ లో వచ్చిన కూడా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా 4 అవార్డులతో పాటు తొమ్మిది అంతర్జాతీయ నామినేషన్లను కూడా పొందింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇది ఏం సినిమా అంటే

2022లో విడుదలైన ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వాద్’ (Vadh). దీనిని జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్వాల్ రచించి దర్శకత్వం వహించారు. ఇది 2022 డిసెంబర్ 9 న థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ చిత్రం పెద్ద తారలు లేకుండానే నాలుగు అవార్డులు, తొమ్మిది అంతర్జాతీయ నామినేషన్లు అందుకుంది. జస్పాల్ సింగ్ సంధు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును గెలుచుకున్నాడు. సంజయ్ మిశ్రా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. ఈ సినిమా IMDbలో 7.2 రేటింగ్‌ను కూడా పొందింది. మీరు ఈ సినిమా చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

దీనికి సీక్వెల్ కూడా వస్తోంది

Advertisement

ఒక వృద్ధ జంట చుట్టూ తిరిగే ఈ చిత్రానికి సీక్వెల్ తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రైమ్-థ్రిల్లర్‌లో తమ నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ జంట “వాధ్ 2″తో తిరిగి వస్తున్నారు. దీని ట్రైలర్ జనవరి 27న విడుదల కానుంది. ఇది మొదటి భాగం మాదిరిగానే ఉత్కంఠతను కలిగి ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. “వాధ్ 2” 2026 ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో సంజయ్ మిశ్రా, నీనా గుప్తా మరొక్క సారి మెరవనున్నారు.

కథ ఏమిటి ?

ఈ చిత్రం ఒక వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ కొడుకు విదేశాలకు చదువు కోసం వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. అతని భవిష్యత్తు కోసం తమ ఇంటిని కూడా తాకట్టు పెడతారు ఈ తల్లిదండ్రులు. కానీ కొడుకు క్రమంగా వాళ్ళకు దూరమవుతాడు. ఆ జంట ఆర్థికంగా కుదదేలవుతారు. ఒక వడ్డీ వ్యాపారి డబ్బు కోసం వారిని వేధించడం మొదలు పెడతాడు. పరిస్థితులు శంభునాథ్ ఒక నేరం చేయడానికి దారితీస్తాయి. దీంతో వీళ్ళ జీవితాలు పూర్తిగా తలకిందులు అవుతాయి. దీని నుంచి వీళ్ళు ఎలా బయట పడతారన్నదే ఈ కథ.

Advertisement

Read Also : 8వ రాత్రి శాపం… చూశారంటే పోతారు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×