Sudigali Sudheer:సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై మకుటం లేని మహారాజుగా గుర్తింపు సొంతం చేసుకుంటూ వరుస షోలతో దూసుకుపోతున్నారు. మెజీషియన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి స్క్రిప్ట్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ.. కమెడియన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏకంగా టీం లీడర్ గా ఎదిగి తన స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో కలసి పదుల సంఖ్యలో స్కిట్స్ చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు.
జబర్దస్త్ లో చేస్తున్నప్పుడే సినిమాలలో అవకాశాలు రావడంతో సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారిన ఈయన.. ఆ తర్వాత రెండు మూడు చిత్రాలు చేశారు కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. ఇటీవల డ్రామా జూనియర్స్ షో తో అందరినీ ఆకట్టుకున్న సుధీర్.. ఒకవైపు ది ఫ్యామిలీ స్టార్స్ షోతో పాటు సరిగమప వంటి సింగింగ్ కాంపిటీషన్ షోలకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సుధీర్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా వైవాహిక బంధానికి దూరంగా ఉండడంతో రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే
also read:దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!
ముఖ్యంగా జబర్దస్త్ లో ఉన్నప్పుడు యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్ ఆన్ స్క్రీన్ కు బాగానే వర్కౌట్ అయింది. ఇక ఇద్దరూ నిజ జీవితంలో పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకున్నారు. కానీ ఈ జంట తాము కేవలం స్నేహితులం మాత్రమేనని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక సుధీర్ ఎప్పుడు వివాహం చేసుకుంటాడు అంటూ.. ఈ విషయంపై ఏదో ఒక సందర్భంలో ఆయన హోస్టుగా చేస్తున్న షో లలో ప్రస్తావనకు వస్తున్నా..సుధీర్ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సడన్గా ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. సుధీర్ కి పెళ్లయిపోయింది అంటూ వైరల్ అవుతున్న ఆ ఫోటో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా ఇందులో చలాకి చంటి, ధనరాజు వంటి కమెడియన్స్ కూడా ఉండడం విశేషం . ఈ ఫోటో చూసిన చాలా మంది సుధీర్ కి పెళ్లి అయిపోయింది కదా.. మరి ఎందుకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే వైరల్ అవుతున్న ఫోటోలో.. అసలు నిజం ఎంత ? అనే విషయానికి వస్తే.. సుధీర్ కి పెళ్లి జరిగింది అంటూ వైరల్ అవుతున్న ఫోటో అది ఆయన నిశ్చితార్థానికి సంబంధించింది. ఆ నిశ్చితార్థ వేడుకల్లోనే జబర్దస్త్ కమెడియన్స్ కూడా సందడి చేశారు. అయితే ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది .అందుకే ఆయన మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు. అయితే మళ్లీ ఇప్పుడు ఎందుకు ఈ ఫోటోలు వైరల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. మరికొంతమంది లైక్స్, వ్యూస్ కోసం ఏదైనా చేస్తారా అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి అయితే సుధీర్ కి పెళ్లయిపోయిందంటూ వస్తున్న ఫోటోలలో నిజం లేదని తేలిపోయింది.