E-Paper
Advertisement

పుంగనూరులో నామినేషన్ల తొలిరోజు.. టీడీపీ-వైసీపీ మధ్య రాళ్ల దాడులు, వాహనాలు ధ్వంసం-పలువురికి గాయాలు

పుంగనూరులో నామినేషన్ల తొలిరోజు.. టీడీపీ-వైసీపీ మధ్య రాళ్ల దాడులు, వాహనాలు ధ్వంసం-పలువురికి గాయాలు
Advertisement

Punganur Nominations: ఏపీలో స్థానిక  సంస్థల రెండో అంకం మొదలైంది. నేటి నుంచి నామినేషన్ల అంకం మొదలుకావడంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో పుంగనూరులో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు చేటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అసలు ఏం జరిగింది?

ఏపీలో వేడెక్కిన స్థానిక సంస్థలు ఎన్నికలు

ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల వేడి మొదలైంది. తొలిరోజు అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుంగనూరు పట్టణంలోని ఓ స్కూలులో నామినేషన్లు కోసం స్వీకరించారు అధికారులు. ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దిగారు. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి అనుచరులు, టీడీపీ నాయకులపై దాడి చేశారు.

పుంగనూరులో తొలిరోజు.. టీడీపీ-వైసీపీ మధ్య రాళ్ల దాడులు

Advertisement

ఈ దాడిలో మధు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ మిధున్ రెడ్డి వాహనంపై రాళ్లతో దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. దీంతో టీడీపీ-వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులకు దిగాయి. రాళ్లు రువ్వుకోవడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. వెంటనే అలర్టయిన పోలీసులు ఇరువర్గాలను చెరదగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇంకా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

వాహనాలు ధ్వంసం – పలువురికి గాయాలు

పుంగనూరులో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఏకగ్రీవాలకు తెరలేపింది వైసీపీ. అందులోనూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అడ్డా కావడంతో జాగ్రత్తగా పావులు కదిపారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రాంతానికి ఇరు ప్రాంతాల నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించారు.

Advertisement

ALSO READ: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

 

Related News

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

వేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. కూటమి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన, ఫస్ట్ లిస్టులో ఎవరెవరంటే..

కూటమి మధ్య తేలిన సీట్ల పంచాయితీ.. టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పంపకాలు పూర్తి, ఎవరెవరు ఏ స్థానాలంటే..

చూడటానికి సాధారణ ఇల్లాలు.. కట్ చేస్తే 14 కేసులు ఉన్న లేడీ విలన్.. ఎవరో తెలుసా?

ప్లాస్టిక్, చైనా బొమ్మలు చెక్.. అమరావతి యువకుడి అద్భుత ప్రయోగం?

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ టికెట్ ఎవరికి?.. రేసులో ఉన్న టాప్ నేతలు వీరే!

ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విచిత్రం.. ఒకే గ్రామం నుంచి జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నిక!

Big Stories

Advertisement
×