E-Paper
Advertisement

మెట్టెల సవ్వడి, స్నేహ సీరియల్స్ నటి కావేరి గుర్తుందా.. ఆమె అసలు పేరు తెలిస్తే షాక్?

మెట్టెల సవ్వడి, స్నేహ సీరియల్స్ నటి కావేరి గుర్తుందా.. ఆమె అసలు పేరు తెలిస్తే షాక్?
Advertisement

Sneha Serial:ఒకప్పుడు సినిమాలతో పోల్చుకుంటే.. బుల్లితెర సీరియల్స్ కి అందులోని నటీనటులకు గుర్తింపు చాలా ఉండేది. ముఖ్యంగా వారు ఎక్కడ కనిపించినా సరే ఆ సీరియల్ లోని పాత్రల పేరుతోనే వారిని పిలుస్తూ ఉండేవారు అభిమానులు. ఈ క్రమంలోనే ఒకప్పుడు మెట్టెల సవ్వడి, స్నేహ వంటి సీరియల్స్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న కావేరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేటి జనరేషన్ కంటే నాటి ఆడియన్స్ కి ఈమె ఒక ఫేవరెట్ హీరోయిన్. స్నేహ సీరియల్ విషయానికి వస్తే.. స్నేహ సీరియల్లో స్నేహ పాత్రతో మరింత ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది.

స్నేహ సీరియల్తో ఊహించని గుర్తింపు..

ఒకరకంగా చెప్పాలి అంటే.. ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ కి ఈ సీరియల్స్ వల్లే ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఎండమావులు, అంతరంగాలు, అన్వేషణ, స్నేహ , లేడీ డిటెక్టివ్ వంటి ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం అయితే చాలు ఎక్కడ ఉన్నా సరే టీవీ ముందు వాలిపోయే వాళ్ళు. ఇక అంతలా ఈ సీరియల్స్ హవా నడిచింది . అలా 1995లో ఈటీవీలో వచ్చిన ఈ స్నేహ సీరియల్ కి కూడా అంతే ఆదరణ ఉండేది. దీనికి వంశీ దర్శకత్వం వహించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకం పై రూపొందించబడిన ఈ సీరియల్ 200 ఎపిసోడ్లతో ప్రేక్షకుల మనసుల్లో స్థిరపడిపోయింది.

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం..

Advertisement

మహిళా సమానత్వం, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ సాగిపోయిన ఈ సీరియల్.. అందులో నటించిన కావేరి ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇక ఈ సీరియల్ తర్వాత తమిళంలో బిజీ అయిపోయిన ఈమె తెలుగులో చిన్నారి ముద్దుల పాప , సాహసం వంటి చిత్రాలలో కూడా నటించింది. 2013లో రాకేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని బెంగళూరులో సెటిల్ అయిన ఈమె.. పెళ్లి తర్వాత మళ్లీ సీరియల్ లో కానీ సినిమాలో కానీ నటించలేదు.

ALSO READ:శ్రీవారి సన్నిధిలో మరో వివాదం.. పెద్ది పోస్టర్ తో మహిళా హల్ చల్!

సడన్గా ప్రత్యక్షమై బక్క చిక్కిపోయిన స్నేహ..

Advertisement

అయితే సడన్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. స్నేహ సీరియల్లో చాలా బొద్దుగా ముద్దుగా కనిపించిన ఈమె.. ఇప్పుడు బక్క చిక్కిపోయి కనిపించింది. దీనికి కారణం థైరాయిడ్ అని తెలిపింది. ఒకే సమయంలో తల్లి చనిపోవడం.. ఆ తర్వాత పెళ్లి కావడం.. థైరాయిడ్ రావడం.. తన సోదరుడు చనిపోవడం అన్నీ వరుసగా ఇబ్బందులు తలెత్తడంతో తన బరువులో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

తల్లిదండ్రులు పెట్టిన పేరు తెలిస్తే షాక్..

ఇకపోతే అదే ఇంటర్వ్యూలో కావేరి అని పిలిచే ఈమెను తన స్కూల్లో ఏంజలా అని పిలిచే వాళ్ళని చెప్పిన ఈమె.. అసలు తన ఇంట్లో వాళ్ళు తనకు పెట్టిన పేరును చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. తనకు ఇంట్లో వాళ్ళు.. ‘ఏంజలా మరియా క్యాండీస్టికాస్టా’ అని ఒక పెద్ద పేరును పెట్టారు. నేనొక ఆంగ్లో ఇండియన్. పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే 12 వరకు క్రిస్టియన్ చర్చిలో చదివి 12 తర్వాత నటన ప్రారంభించాను అంటూ తెలిపింది.

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×