E-Paper
Advertisement

Etela Rajender: రోడ్లెక్కి ధర్నాలా? రాహుల్, ప్రియాంకలపై ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు!

Etela Rajender: రోడ్లెక్కి ధర్నాలా? రాహుల్, ప్రియాంకలపై ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Etela Rajender: స్వేచ్ఛ బ్యూరో: దేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా వీధుల్లో ధర్నాలు చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా అపహాస్యం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.

కాంగ్రస్ ప్రభుత్వంపై ఈటల ఫైర్..

Advertisement

ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి పార్లమెంట్ వేదికగా ప్రజల గొంతుక కావాలని, సమస్యలను సభ దృష్టికి తెచ్చి పరిష్కారాలు సాధించాల్సింది పోయి.. తన బాధ్యతను విస్మరించి రోడ్లపై కూర్చొని ధర్నాలు చేయడం అత్యంత విచారకరమని చురకలంటించారు. ఒకవైపు సభ నడవకుండా ఆటంకాలు సృష్టిస్తూ పార్లమెంట్ సమయాన్ని వృథా చేయడం, మరోవైపు ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నాలకు దిగడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఫైరయ్యారు.

ఇప్పటికైనా నిరసనలు ఆపండి..

Advertisement

కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లాలనే కుట్రపూరిత ఆలోచనతోనే రాహుల్, ప్రియాంక ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంట్‌లో నిలదీసి చర్చించేవారన్నారు. సభలో మాట్లాడే ధైర్యం, తగిన ఆధారాలు లేకే వీరు రోడ్లపైకి వచ్చి ఈ రకమైన నాటకాలకు తెరలేపారని ఈటల మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న ఈ రాజకీయ డ్రామాలను తక్షణమే స్వస్తి పలకాలని, ఇప్పటికైనా నిరసనలు ఆపి, ప్రజాహితం కోసం పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఈటల సూచించారు.

రాహుల్, ప్రియాంక గాంధీపై ఫైర్..

ఇదిలాఉండగా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ చేస్తున్న ధర్నాలు ప్రజా సమస్యల పరిష్​కారం కోసం కావని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలను వదిలేసి వీధుల్లో రచ్చ చేయడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని చురకలంటించారు. ప్రధాని మోడీ నివాసం ముట్టడి పేరుతో రాహుల్ గాంధీ చౌకబారు విన్యాసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల వైఫల్యంపై ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని తట్టుకోలేక, దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఢిల్లీ నాటకాల్లో భాగస్వామి అవుతోందని ఆయన ఫైరయ్యారు.

Also Read: రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్.. ‘దేశ సమగ్రతను దెబ్బతీస్తే తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే!’

Related News

RTO Brokers: ఆర్టీఏలో ఏజెంట్ల రాజ్యానికి ఎండ్ కార్డ్?.. యాక్షన్‌లో అధికారులు!

Karimnagar Robbery: కరీంనగర్ దోపిడీ ముఠా ప్లాన్ అట్టర్ ఫ్లాప్?.. చివరిలో సినిమా రేంజ్ లాంటి ట్విస్ట్..!

BJP Attack: రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్.. ‘దేశ సమగ్రతను దెబ్బతీస్తే తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే!’

Engineering Student: నా అవయవాలను దానం చేయండి అంటూ.. బీటెక్ విద్యార్ధి సూసైడ్ కలకలం!

KTR: ఆదిలాబాద్ CCI పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ!

Jurala Project: జూరాల ప్రాజెక్టు పోటెత్తిన వరద.. త్వరలో గేట్లు ఎత్తే అవకాశం!

Kiran Kumar Reddy: నీట్ స్కామ్‌పై కేంద్రానికి కాంగ్రెస్ డెడ్‌లైన్.. భువనగిరి ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×