E-Paper
Advertisement

Ramya Moksha : పచ్చళ్ళ పాప నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ల కన్నా ఎక్కువే..

Ramya Moksha : పచ్చళ్ళ పాప నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ల కన్నా ఎక్కువే..
Advertisement

Ramya Moksha : అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే.. అలాగే ఎవరి జీవితం తలకిందులు అవుతుందో చెప్పడం కూడా కష్టమే. ఈమధ్య సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రపంచాన్ని చూపిస్తున్న సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజీని సంపాదించుకుంటున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. కాంచర్ల అలేఖ్య అనే యువతి నిర్వహిస్తున్న పికిల్స్ వ్యాపారం గురించి అందరికీ తెలిసిందే..

ఇంస్టాగ్రామ్ వేదికగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు కలిసి ప్రారంభించిన ఈ పికిల్స్ వ్యాపారం బాగా సక్సెస్ అయి అందరికీ రీచ్ అయింది. కస్టమర్ తో దురుసుగా ప్రవర్తించిన తీరు వాళ్ల జీవితాలనే మార్చేసింది. ఆ ముగ్గురిలో ఒకరైన రమ్య మోక్ష ఎంతగా ఫేమస్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇటీవలే బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన క్రేజ్ ని పెంచుకుంది. ఇదిలా ఉండగా ఈమె నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ పచ్చళ్ళ పాప నెలకు ఎంత సంపాదిస్తుందో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

పచ్చళ్ళ పాప నెల సంపాదన ఎంతంటే..? 

Advertisement

బ్రతక నేర్చినవాడు ఎలాగైనా బ్రతుకుతాడు అన్న సామెత అందరికీ తెలిసిందే.. అలా ఒక్కో మెట్టు ఎదగాలనే కసితో చాలామంది ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా వల్ల ఎంతో మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయి. అలాంటి వారిలో పచ్చళ్ల పాప రమ్య మోక్ష ఒకరు. కస్టమర్ తో ప్రవర్తించిన తీరు ఆమె జీవితానికి ఒక మైలురాయిగా మారింది. ఆ తర్వాత ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో ఫెమస్ అయ్యింది. పచ్చల వ్యాపారంతో పాటుగా సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య ఈ సుందరి జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలతో పాటుగా లేటెస్ట్ ఫోటోలను వదులుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ నెలకు ఎంత సంపాదిస్తుంది? పచ్చల వ్యాపారంతో ఎంత లాభాలను అర్జిస్తుంది? సోషల్ మీడియా ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె దాదాపు నెలకు 15 లక్షల వరకు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి పచ్చల పాప ఎంత సంపాదిస్తుందో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదూ.. ఇది కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు మాత్రమే. మరి నిజంగానే రమ్య అంత సంపాదిస్తుందా? అన్నదానిపై క్లారిటీ రావాలంటే సోషల్ మీడియా ద్వారా రమ్య రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

రమ్య కెరీర్ విషయానికొస్తే.. 

Advertisement

రమ్య మోక్ష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అంతగా జనాలను మెప్పించలేదు. దాంతో కొన్ని రోజులకే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. బిగ్ బాస్ చాలామంది జీవితాలని మార్చేస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు.. అందరిలాగే ఈమె కూడా వరుసగా సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటుంది అని ఆమధ్య వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈమె చేతికి సినిమా అవకాశాలు ఏవి రాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. మరి ఈమె అందాలను చూసి చిత్ర దర్శకులు సినిమా అవకాశాలను ఇస్తారేమో చూడాలి…

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×