Intinti Ramayanam Pallavi : ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రతిరోజు కూడా డిఫరెంట్ స్టోరీ తో రావడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తున్న పల్లవి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. పల్లవి గతంలో మారింది అని అందరూ అనుకున్నారు కానీ పల్లవిలో వచ్చిన మార్పు కి కారణం డబ్బుల కోసమే అని తెలియగానే ఈ సీరియల్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాప్ అవుతారు.. గత కొన్ని రోజులుగా ఆమె క్యారెక్టర్ లో మళ్ళీ ట్విస్టులు రావడంతో పల్లవి గురించి మళ్ళీ ఇన్ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పల్లవి నెలకు ఎంత సంపాదిస్తుంది అనేదానిపై ఒక చర్చ జరుగుతుంది.. మరి పల్లవి మొత్తంగా నెలకి ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం.
ఇంటింటి రామాయణం పల్లవి పాత్రలో నటిస్తున్న హీరోయిన్ పేరు యశస్విని గౌడ. ఈమె గతంలో కన్నడలో అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. కన్నడలో ఈమె సీరియల్స్ మాత్రమే కాదు సినిమా లు కూడా చేసి అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో ఈమె తెలుగులోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాదు.. అటు పలు యాడ్లలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నెలకు దాదాపు 20 లక్షల వరకు ఓన్లీ సోషల్ మీడియా యాడ్ ల ద్వారానే సంపాదిస్తుంది అని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఇంత సంపాదిస్తుంటే ఇక కన్నడలో తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తున్న అమ్మడు ఇంకా ఎంత సంపాదిస్తుందో అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇంటింటి రామాయణం సీరియల్ తో ఒక్కసారిగా పాపులారిటిని సొంతం చేసుకున్న కన్నడ నటి యశస్విని గౌడ ఒక్క సీరియల్ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈమధ్య కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సీరియల్ యాక్టర్ కి ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తెలుగులో వాళ్లకున్న డిమాండ్ ను బట్టి రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ వస్తుంది.. కన్నడలో నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా ఒక్కో సీరియల్ తో బాగానే సంపాదిస్తూ వస్తుంది. ఒక్క రోజుకి సీరియల్ ద్వారా దాదాపు 50 వేల వరకు ఇప్పుడు తీసుకుంటుంది అని టాక్ వినిపిస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. రోజుకి 50 వేలు అంటే నెలకి 25 రోజులు షూటింగ్ ఉండటంతో బాగానే సంపాదిస్తుంది అని తెలుస్తుంది. లక్షల్లోనే ఈయన సంపాదన ఉండడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే ఈ మధ్య సినిమాలు కూడా చేస్తుంది అని టాక్ వినిపిస్తుంది.
Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..