E-Paper
Advertisement

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!
Advertisement

Saudi Arabia Flight Alert: సౌదీ అరేబియాకు ప్రయాణించాలనుకుంటున్న భారతీయులకు కీలక అలర్ట్. అక్కడ మారుతున్న పరిస్థితులు మారుతున్నప్పటికీ, నాలుగు కీలక నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు సంబంధించి అంతరాయాలు కొనసాగుతున్నాయి. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు సంబంధించిన విమానాలు అక్టోబర్ 24, 2026 వరకు రద్దు చేసినట్లు తెలిపింది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.

అక్టోబర్ 24 వరకు విమానాల రద్దు

Advertisement

సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులకు ఈ విషయాన్ని ప్రకటించింది. అంతకుముందు ఇండిగో కూడా ఇదే నాలుగు నగరాలకు సంబంధించిన విమాన సర్వీసులను అక్టోబర్ 24 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణాలపై తాజా మార్పుల కారణంగా ఎఫెక్ట్ అయిన ప్రయాణికులకు బుకింగ్ సమయంలో ఇచ్చిన కాంటాక్ట్ వివరాల ద్వారా సమాచారం అందిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. ట్రావెల్ ఏజెంట్లు, ఇతర ట్రావెల్ ఏజెన్సీల ద్వారా  టికెట్లు బుక్ చేసుకున్నవారు.. రీ షెడ్యూల్, రీఫండ్స్ కోసం సంప్రదించాలని సూచించింది.

దాడి ఘటన తర్వాత పెరిగిన ఆందోళన!

అక్టోబర్ 10న రియాద్ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన తర్వాత విమాన ప్రయాణాలపై ఆందోళనలు పెరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు గాయపడినట్లు రాయబార కార్యాలయం ఇప్పటికే వెల్లడించింది. వారిలో ఒకరిని అక్టోబర్ 15న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారికి చికిత్స అందించినట్లు తెలిపింది.  ఇంతకుముందు అక్టోబర్ 17 వరకు విమాన సర్వీసుల రద్దుపై ప్రకటనలు వెలువడగా.. తాజా అడ్వైజరీలో ఆ గడువును అక్టోబర్ 24 వరకు పొడిగించారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్, అకాసా ఎయిర్, ఇండిగో లాంటి విమానయాన సంస్థల సర్వీసులపై ఈ అంతరాయాలు ప్రభావం చూపుతున్నాయి.

అత్యవసర ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలు!

Advertisement

అత్యవసరంగా ప్రయాణించాల్సిన భారతీయులు బహ్రెయిన్, కువైట్, ఖతార్ లాంటి పక్క దేశాల నుంచి విమాన సర్వీసులను పరిశీలించాలని రాయబార కార్యాలయం సూచించింది. అయితే, ఈ దేశాల్లోకి ప్రవేశించడానికి అవసరమైన వీసాలు, ఇతర ప్రయాణ అనుమతులు తప్పనిసరిగా ఉన్నాయో లేదో ముందుగానే నిర్ధారించుకోవాలన్నది. మరోవైపు, జెడ్డా, మక్కాలోని భారత కాన్సులేట్ బృందాలు విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు, ముఖ్యంగా ఉమ్రా యాత్రికులకు సహాయం అందిస్తున్నాయి.

సో, సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులు ఎయిర్‌లైన్ అధికారిక అప్‌డేట్స్, భారత రాయబార కార్యాలయం సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. టికెట్ బుక్ చేసుకున్నంత మాత్రాన విమానం నడుస్తుందని భావించకుండా.. బయలుదేరే ముందు సర్వీస్ స్టేటస్‌ను చెక్ చేసుకోవడం మంచిది.

Read Also: ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

Tags

Related News

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

Advertisement
×