E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 16th : మీనా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. గుడిలో మాలలు తెచ్చి ఇచ్చిన తర్వాత పసుపు కుంకుమ ని అమ్మవారికి పెట్టాలి అని అక్కడున్న పూజారి చెప్పడంతో మీనా అలాగే అని అంటుంది.. కానీ ఆ పసుపు కుంకుమలు మీనా చేజారిపోవడంతో కంగారు పడిపోతుంది. మీనా ఎంతగా తన భర్త గురించి ఆలోచించినా కూడా అది కింద పడిపోయింది అని కంగారు పడిపోవడంతో పూజారి తన భర్తకి ఒక కంకణం కట్టమని అమ్మవారి దగ్గర పూజ చేసి ఇస్తాడు. అయితే ఆ కంకణం తీసుకున్న మీనా బాలుకి కట్టాలి అని ఇంటికి వెళ్లి సత్యంతో చెప్తుంది. ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు అది చూసి ఏంటి నీకేమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని మీనాకు ధైర్యం చెప్పే పని చేస్తాడు. కానీ మీనా మాత్రం బాధపడిపోతూనే ఉంటుంది..

ప్రభాను కొట్టిన మీనా..

ప్రభావతి ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు మీరు ఇద్దరు అలా తిరుగుతున్నారు అని అడుగుతూ కిందికి వస్తుంది. అయితే బాలుని కొట్టబోయిన మీనా ప్రభావతిని కొట్టేస్తుంది. నన్ను దిండుతో కొడతావా ఎంత ధైర్యం నీకు అంటూ మీనా మీదికి ప్రభావతి రావడంతో మధ్యలో బాలు తాను ఏం చేసింది మేమిద్దరం కొట్టుకుంటుంటే మధ్యలో నువ్వు వచ్చావు అని అంటాడు.. ఇక సత్యం కి కూడా ప్రభావతి అదే చెప్తుంది నన్ను దిండుతో కొట్టిందండి అని చెప్పగానే వాళ్ళిద్దరి నువ్వెందుకు వెళ్లావు అని సత్యం అరుస్తాడు. నీకెంత దమ్ముంటే నన్నే కొడతావే అంటూ ప్రభావతి కూడా మళ్లీ కొట్టడంతో అది బాలు మీనాలకు తగిలి మళ్ళీ మనోజ్ వరకి వస్తుంది. తనకి ప్రభావతి అయితే రచ్చ రచ్చ చేస్తుంది.

బాలును ఇరికిస్తున్న రోహిణి..

Advertisement

దినేష్ బాధ నుంచి బయట పడాలి అంటే నేను కచ్చితంగా ఆ గుణానికి సాయం చేయాలి అప్పుడే వాడు నాకు దినేష్ నుంచి విముక్తి కల్పిస్తాడు అని అనుకుంటుంది. అయితే, బాలు కారు కీస్ ఇస్తాను అని చెప్తుంది.. గుణకి ఎలాగైనా సాయం చేయాలి అని రోహిణి అనుకుంటుంది అసలు గుణ కారు తాళాలు తీసుకుని ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే గుణ మాత్రం రోహిణికి ఇంకాస్త టెన్షన్ పెంచితే తనే తాళాలు తెచ్చి ఇస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మీనా మాత్రం బాలు కోసం టెన్షన్ పడిపోతూనే ఉంటుంది. బాలు ఏదో ప్రమాదంలో చిక్కుకుంటాడు అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఏదో కీడు శంకుస్తుంది అని మేన బాధపడుతూ వస్తుంది..

శృతి బాలు మాట ఒకటే..

ప్రభావతి మీనా తెచ్చిన తాయత్తును చూసి వీడికి ప్రమాదం ఏముండదు వీడు వల్లే ఇంకొకరికి ప్రమాదం ఉంటుంది తప్ప వీడికి ఏ ప్రమాదం ఉండదు నువ్వేం కంగారు పడకు అంటూ అనేసి వెళ్ళిపోతుంది. కానీ మీనా మాత్రం మీరు ఆ తాయత్తుని కట్టుకోవాల్సిందే నా కోసమైనా కట్టుకోవాలి అని ఎంత బ్రతిమలాడినా కూడా బాలు మాత్రం నేను అస్సలు కట్టుకొని అంటాడు. అయితే మేన వంట గదిలో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి ఏంటి మీనా పాలు పొంగిపోతున్న కూడా చూడకుండా ఎక్కడో నీ మనసు ఉంది అని అంటుంది. అయితే నాకు ఏమి కాలేదు శృతి నేను ఇక్కడే ఉన్నాను అని అంటే శృతి నిజం చెప్పు మీనా నువ్వు ఎక్కడ ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంది. అప్పుడే బాలు గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పగానే ఇవన్నీ నమ్మకాలు ఈ రోజుల్లో లేవు నువ్వు ఏమి కంగారు పడొద్దు అని శృతి చెప్తుంది అప్పుడే వచ్చిన బాలు కూడా శృతికి సపోర్ట్ గా మాట్లాడడంతో మీరిద్దరూ ఒక్కటే అని మీనా అంటుంది..

రోహిణికి కొత్త టెన్షన్..

Advertisement

బాలు మీనా దగ్గరికి వెళ్లి నువ్వు ఏమి టెన్షన్ పడవద్దు నాకు ఏమీ కాదు మంచోళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అండగనే ఉంటాడు నువ్వు కంగారుపడి నన్ను బాధ పెట్టొద్దు అని ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం నా కోసమే నువ్వు ఆ కంకణం కట్టుకోవాలి అని అంటుంది.. ఇకపోతే బాలు మనము రేపు చింటూ స్కూల్ కి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అనుకున్నాం కదా దాని గురించి ఆలోచించు అని అంటాడు వీళ్ళిద్దరూ ఆ మాట మాట్లాడటం విన్న రోహిణి ఎలాగైనా సరే బాలుని రేపు స్కూల్ కి వెళ్ళనివ్వకుండా చేయాలి అని అనుకుంటాడు. అయితే బాలు ఆ మాట అనగానే రోహిణి విని ఏదో ఒకటి చేయాలి ముందు ఆ గుణానికి సాయం చేస్తే బాలు రేపు స్కూలుకు వెళ్లకుండా ఉంటాడు అని ఆలోచిస్తుంది రోహిణి. నువ్వు నాకు ఫోన్ చేసి ఎలాగైనా సరే బాలుని స్కూల్ కి వెళ్ళనివ్వకుండా చేయాలి అని కారు తీసేస్తానని అంటుంది. బాలు నిద్రపోగానే ఆ పని చేయాలని దొంగగా మారుతుంది కానీ శృతి టెన్షన్ పడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : జమున పై మహాకు అనుమానం.. కేశవకు అండగా కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న కేశవ..

Related News

Intinti Ramayanam Pallavi : పల్లవి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Podarillu Today Episode : జమున పై మహాకు అనుమానం.. కేశవకు అండగా కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న కేశవ..

Karthika Deepam 2 Serial Today Episode October 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తిరిగొచ్చిన జ్యోత్స్న – కొట్టబోయిన సూరజ్           

Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×