E-Paper
Advertisement

Jabardast Rohini : జబర్దస్త్ రోహిణి నెలకు సంపాదన ఎంతో తెలుసా..? నోర్లు వెల్లబెట్టాల్సిందే..

Jabardast Rohini : జబర్దస్త్ రోహిణి నెలకు సంపాదన ఎంతో తెలుసా..? నోర్లు వెల్లబెట్టాల్సిందే..
Advertisement

Jabardast Rohini : బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. అందులో రోహిణి కూడా ఒకరు. జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ముందుగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. డిఫరెంట్ స్లాంగ్ తో ఉండడంతో ఆమె ఒక్కసారిగా స్టార్ ఇమేజెను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత పరిచయాన్ని పెంచుకుంది. ఈ షో తర్వాత పలు షోలలో కూడా అవకాశాలు అందుకుంది.. ఈమె ఒక వైపు సినిమాలు.. మరోవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది.. అయితే ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజురోజుకీ తన క్రేజ్ ను పెంచుకుంటూ వరుసగా అవకాశాలను అందుకుంటు ఫుల్ బిజీగా మారుతుంది. అయితే రోహిణి నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. మరి రోహిణి నెలకు ఎన్ని లక్షల వరకు సంపాదిస్తుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రోహిణి నెలకు ఎంత సంపాదిస్తుంది..?

జబర్దస్త్ కమెడియన్ రోహిణి గురించి ఈ మధ్య అనేకల వార్త వినిపిస్తూనే ఉన్నాయి. తను త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. దీనికన్నా ముందు రోహిణి ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్, అలాగే ప్రోగ్రాంలలో రోహిణి ఎంట్రీ కన్ఫామ్ ఉంటుంది. బాగా క్రేజ్ ఉన్న యాక్టర్ కావడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రోహిణికి ఒక ప్రోగ్రాంకి దాదాపు 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక సీరియల్ సినిమాలకు ఆమె ఏమైనా రెమ్యూనరేషన్లక్షల్లోనే ఉంటుంది. అంటే నెలకు దాదాపు 15 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు నల్లగా ఉందని రిజెక్ట్ చేసిన ఇండస్ట్రీని ఇప్పుడు తన టాలెంట్ ని గుర్తించి వరుసగా అవకాశాలు ఇవ్వడం మామూలు విషయం కాదు.. ఏమాత్రం సంపాదిస్తుంది కాబట్టి తన తల్లికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది అని పలువురు నెటిజెన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రోహిణి కెరీర్ విషయానికొస్తే.. 

Advertisement

ఒక చిన్న సీరియల్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోహిణి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొట్టి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టీవీ షోలో కూడా చేస్తూ వస్తుంది. వీటితో పాటుగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తనకి సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉండడంతో కాలే టైమ్ లో అందులో వీడియోలను పోస్ట్ చేస్తూ అక్కడ కూడా బాగానే సంపాదిస్తూ వస్తుంది. ప్రస్తుతం రోహిణి బుల్లితెరపై ప్రసారమవుతున్న జగదాత్రి అనే సీరియల్లో కీలకపాత్రలో నటిస్తుంది. వీటితో పాటుగా నాలుగు సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చిన ఏ అవకాశాన్ని వృధా చేయకుండా.. సద్వినియోగం చేసుకుంటూ వరుసగా తన టాలెంట్ నిరూపించుకునే అవకాశాన్ని అందుకుంటూ బిజీగా మారింది జబర్దస్త్ కమెడియన్ రోహిణి.

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×