Mamagaru Serial: బుల్లితెరపై ప్రేక్షకులను ఎక్కువగా అలరించే వాటిలో సీరియల్స్ ఒకటి.. ఈమధ్య టీవీ చానల్స్ ఒకసారి నవ్వుతున్న వాటిలో సీరియల్స్ కు ఎక్కువ డిమాండ్ మన సంగతి తెలిసిందే. ఈమధ్య ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ ఏదో ఒక పాయింట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్స్ లో ఎక్కువగా సీరియల్స్ లకు జనాల్లో డిమాండ్ కూడా ఉంటుంది. అందుకే బుల్లితెరపై క్రేజ్ ను పెంచుకోడవసం సినిమాల్లో ఒకప్పుడు స్టార్స్ అయిన వాళ్లు కూడా సీరియల్స్ చేస్తున్నారు. అందులో సుహాసిని ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన ఈమె ఇప్పుడు బుల్లితెర పై సీరియల్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈమె మామగారు అనే సీరియల్ లో నటిస్తుంది. ఈమెకు సీరియల్స్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మామగారు సీరియల్ స్టోరీ…
స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో ఒకటి మామగారు. బుల్లితెరపై సీరియల్స్ హవా మామూలుగా లేదని చెప్పాలి. అన్ని ఛానల్స్ లలో సీరియల్స్ బాగా దూసుకుపోతున్నాయి. కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు సైతం సీరియల్స్ కు అతుక్కుపోతున్నారు. సీరియల్ సమయం ప్రారంభం అవ్వగానే ఆ సమయంలో ఎన్ని పనులు ఉన్నా వాయిదా వేసేస్తున్నారు. అంతలా సీరియల్స్ కు అడిక్ట్ అవుతున్నారు ప్రేక్షకులు.. ఈ సీరియల్ లో మెయిన్ రోల్ లో సుహాసిని నటించింది.
కొడుకులు, కోడళ్లు, భార్య, కూతురు చివరికి మనవళ్లు కూడా ఆయన చెప్పిందే వినాలి. అయితే ఈ ఇంట్లోకి సుహాసిని చిన్న కోడలిగా అడుగుపెడుతుంది. తను పుట్టింట్లో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని పోషించటానికి తను ఉద్యోగం చేసేది. ఇక అత్తారింట్లో అడుగుపెట్టగా తన పుట్టింటి కోసం ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. అలా అందరు అనుకుంటారు.. అది స్టోరీ..
Also Read :కృష్ణం రాజుకు ‘రెబల్’ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా..?
సుహాసిని రెమ్యూనరేషన్..
సినిమాల నుంచి సీరియళ్ల వైపు మళ్లిన హీరోయిన్ సుహాసిని. అచ్చ తెలుగు అమ్మాయి సుహాసిని.. చంటిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈమెకు సీరియళ్లలో ప్రస్తుతం ఫుల్లు డిమాండ్. తనకు రోజుకు 25 వేల రూపాయల పారితోషికం ఇస్తారని టాక్. ఇది కూడా ఒకప్పటి మాట. ప్రస్తుతం ఈ అమ్మడు ఫుల్ గా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కూడా.. ఒక్కరోజు 50 వేలు తీసుకుంటుందట.. రోజు షూటింగ్ ఉండటంతో నెలకు 15 లక్షలు తీసుకుంటుందట.. ఈమె గురించి అందరికి తెలుసు సినిమాల నుంచి టర్న్ తీసుకొని సీరియల్స్ చేస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే ఎవరైన సీనియల్స్ నుంచి సినిమాలకు వెళ్తారు. కానీ ఈమె రివర్స్. ఏది ఏమైనా కూడా బుల్లితెరపై హవాను కొనసాగిస్తుంది సుహాసిని..
సుహాసిని తెలుగు, తమిళం, కన్నడ మరియు భోజ్‌పురి భాషలలో నటించింది.”చంటిగాడు” సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి, ఆమె టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన సినిమా. ఈ సినిమా ఒక లవ్ స్టోరీగా తెరకెక్కింది.ఇది సుహాసినికి మంచి పేరు తెచ్చిందంట. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. ఇప్పుడు బుల్లితెరపై మెరుస్తుంది..