OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా ఇటువంటి వెబ్ సిరీస్ లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సోనాక్షి సిన్హా పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్రలో నటించిన ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఒక సైకో కిల్లర్ ను పట్టుకునే క్రమంలో ఈ సిరీస్ నడుస్తుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిపోయే ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
అంజలి భాటి (సోనాక్షి సిన్హా) రాజస్థాన్‌లోని మందావా పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె ఒక సాధారణ మహిళా పోలీస్ అధికారిగా సమాజంలో జరిగే అసాంఘీక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక మహిళ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేయడం మొదలు పెడుతుంది అంజలి. అయితే ఆ కేసులో ఏదో రహస్యం ఉందని అనుమానిస్తుంది.
ఈ కేసును అంజలి లోతుగా దర్యాప్తు చేస్తే దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలుస్తుంది. ఈ మహిళల మరణాలు మొదట ఆత్మహత్యలుగా కనిపిస్తాయి, అయితే ఇవన్నీ ఒక సీరియల్ కిల్లర్ చేసిన హత్యలని అంజలి గుర్తిస్తుంది. మరోవైపు ఈ హత్యలను ఆనంద్ స్వర్ణకర్ అనే వ్యక్తి చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లర్ ఒక హిందీ ప్రొఫెసర్ గా పని చేస్తుంటాడు. బయటికి మంచివాడిలా నటిస్తూ, లోపల క్రూరమైన మనస్తత్వం కలిగి ఉంటాడు.
అతను వివాహం చేసుకోబోయే మహిళలను మాత్రమే టార్గెట్ చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లర్ మొదట అమ్మాయిలను ప్రేమలో పడేసి, ఆ తర్వాత వారిని అనుభవించి హత్య చేస్తుంటాడు. ఒక దళిత మహిళగా ఉండే అంజలి, ఈ కేసును ఎదుర్కొనే క్రమంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తుంది. ఆమె తన ధైర్యం తెలివితో ఈ కేసును ఛేదించడానికి ట్రై చేస్తుంది. చివరికి అంజలి సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటుందా ? పెళ్ళికి ముందే అమ్మాయిలను కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు ? అంజలి ఈ కేసును ఎలా ఛేదిస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : భర్తను ముక్కలు ముక్కలుగా నరికి, కూర వండే భార్య… ఇదేం అరాచకంరా సామీ
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్ పేరు ‘దహాద్’ (Dahaad). ఈ మూవీకి, రీమా కాగ్తీ, రుచికా ఒబెరాయ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహం షా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది రాజస్థాన్‌లో వరుస హత్యలు చేస్తున్న, ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో 2023 మే 12న విడుదలైంది.