Krishnam Raju : తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా విలన్ గా పలు సినిమాల్లో నటించిన స్టార్ కృష్ణంరాజు.. ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకొని జనాల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. ఈయన గురించి ఎంత చెప్పిన తక్కువే.. హీరోగా ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలు ఆయనకు అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇక విలన్ గా చేసిన ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ పై ప్రశంసలు కురిసాయి. థియేటర్లలో ఆయన విలన్ గా చేసిన సినిమా వస్తే విజిల్స్ పడ్డాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అలాంటి కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే పేరు ఉంది. ఆ రెబల్ స్టార్ అనే బిరుదును ఆయనకు ఎవరు బహుకరించారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
కృష్ణం రాజుకు రెబల్ స్టార్ ఎలా వచ్చింది..?
సినీ హీరో కృష్ణం రాజు గురించి అందరికి తెలుసు.. కన్నెర్ర చేసి పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. విలన్ గా కృష్ణంరాజు చేసిన సినిమాలు అన్నీ కూడా ఎంత బాగా హిట్ అయ్యాయో అందరికీ తెలుసు.. ఇలా ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఈయనకు రెబల్ స్టార్ అనే పేరు కూడా ఉంది. ఇండస్ట్రీలో కృష్ణంరాజుకు రెబల్ స్టార్అనే పేరు ఎలా వచ్చిందన్న విషయం చాలామందికి తెలియదని గతంలో ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారు. అయితే అసలు రెబెల్ స్టార్ అనే బిరుదు ఆయనకి ఎవరు ఇచ్చారు అని ఇంటర్వ్యూలో అడగ్గా.. కళ్ళెర్ర చేస్తూ రెబల్ గా మాట్లాడుతూ ఉండటం వల్ల ఆయనకు ఆ బిరుదు ఇచ్చారని కృష్ణంరాజు. అలా అప్పటినుంచి ఆయన్ను కృష్ణంరాజు కన్నా రెబల్ స్టార్ అనే పేరుతో ఎక్కువగా పిలిచే వాళ్ళని చెప్పారు. ఆయన కొడుకుగా వారసత్వం పొందిన ప్రభాస్ ఆ రెబల్ స్టార్ అనే పేరు వచ్చేసింది. ఈయన పాన్ ఇండియా హీరోగా పెద్ద నాన్నకు తగ్గ కొడుకుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ యాక్టర్ అయ్యారు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజన్ సినిమా లు ఉన్నాయి.
కృష్ణం రాజు సినిమాలు..
కృష్ణంరాజు రాజుల వంశానికి చెందిన వ్యక్తి. ఎంత ఆస్తి ఉన్నా కూడా ఒదిగి ఉండడం ఆయన లక్షణం. ఇప్పుడు ప్రభాస్ కూడా అంతే వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంటాడు. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 183 పైగా చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన చిలకా గోరింక అనే మూవీతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు. ఆయన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డు, నంది అవార్డు ఇలా అనేక గౌరవప్రదమైన అవార్డులు గెలుచుకున్నారు. 1973లో వచ్చిన జీవనతరంగాలు సినిమా, 1974 లో వచ్చిన కృష్ణవేణి, 1978లో వచ్చిన మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించడమే కాకుండా కెరియర్లో బెస్ట్ ఫిలిమ్స్ గా నిలిచాయని చెప్పవచ్చు.. హీరోగా, విలన్ గా మాత్రమే కాదు.. హీరోలకు తండ్రి పాత్రల్లో కూడా నటించాడు.. చివరి శ్వాస వరకు సినిమాల కోసమే బ్రతికారు. ప్రస్తుతం ఆయన వారసత్వంగా ప్రభాస్ సినిమాల్లో రానిస్తున్నాడు..