Gundeninda Gudigantalu Balu: బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లలో ఒకటి గుండె నిండా గుడిగంటలు.. మధ్యతరగతి కుటుంబ కథా స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. ఇందులోని క్యారెక్టర్లు జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో ఈ సీరియల్కు మంచి రేటింగ్ కూడా వస్తుంది. ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ఇది ప్రసారం అవుతుంది. ఈమధ్య ఈ సీరియల్ ని చూసే సంఖ్య రోజురోజుకీ పెరిగిందని తెలుస్తుంది. ఇకపోతే ఇందులో లీడ్ రోల్ నటిస్తున్న వ్యక్తి పేరు బాలు. బాలు అసలు పేరు విష్ణు కాంత్.. తెలుగులో ఈయన చేసిన మొదటి సీరియల్ ఇదే.. ఈ సీరియల్ ద్వారా అతని క్రేజ్ పదింతలు పెరిగింది అని చెప్పడంలో సందేహం లేదు.. ఇకపోతే బాలు సీరియల్స్ ద్వారా బాగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఎంత క్రేజ్ పెరిగినా సరే తన పనిని మాత్రం మానలేదు అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు బాలు చేస్తున్న పనేంటి? ఎందుకు బాలు దాన్నింకా వదల్లేదు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
గుండె నిండా గుడి గంటలు బాలు ఒక తమిళ నటుడు. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియస్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈమధ్య తెలుగులో మరో సీరియల్ లో కూడా నటిస్తున్నాడు.. అయితే బాలు ఇండస్ట్రీలోకి రాకముందు తన కులవృత్తిని చేస్తూ ఉండేవాడు. మగ్గంపై చీరలు నేయడం వల్ల కుల వృత్తి.. సీరియల్స్ ద్వారా ఇంత పాపులారిటీని సంపాదించుకున్న కూడా బాలు ఇప్పటికీ కూడా చీరలు నేస్తూ ఉంటాడని గతంలో ఓ వీడియోలో చెప్పాడు.. ఈరోజుల్లో సోషల్ మీడియాలోనే కేవలం వ్యూస్ పెరిగితే చాలామంది సెలబ్రిటీ లెక్క ఫీల్ అయిపోతుంటారు. వాళ్లు చేసే పనుల గురించి ప్రత్యేకంగా వీడియోలు తీసి మరి వివరిస్తుంటారు. అలాంటిది బాలు ఇలా చేయడం నిజంగా గ్రేట్ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఈమధ్య బాలు సమాజ సేవ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం ఈ బాలు ఏం చేసినా సెన్సెషనల్ అవుతుంది..
Also Read :విజయ్ సేతుపతి చేతుల మీదుగా గోట్ ఫైట్ మూవీ ‘జాకీ’ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
గుండె నిండా గుడి గంటలు బాలు అలియాస్ విష్ణు కాంత్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాడు.. అతని తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఒక తమిళ్ అయి ఉండి కూడా తెలుగు అభిమానులను ఈ రేంజ్ లో ఆకట్టుకోవడం మామూలు విషయం కాదు. ఈమధ్య ఎక్కువగా తెలుగులో మాట్లాడటం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అతనికి తన సొంత యూట్యూబ్ ఛానల్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అందులో ఆయన చేసే ప్రతి వీడియోలో కూడా తెలుగులో మాట్లాడుతూ కనిపిస్తాడు. దాంతో తెలుగు జనాలు బాలుకి బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం బాలు గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా.. మా ఇంటి దీపం అనే సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. అయితే ఆ సీరియల్ ద్వారా బాలు క్రేజ్ పెద్దగా పెరగలేదు. కానీ రెండో సీరియల్ కావడంతో అతని రెమ్యూనరేషన్ మాత్రం భారీగా పెరిగింది. ఇకముందు బాలు ఎలాంటి ప్రాజెక్టులలో నటిస్తాడో చూడాలి..