Karthika Deepam Monitha : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా టాప్ సీరియల్స్ లో ఒకటి కార్తీకదీపం. టైటిల్ సాంగ్ నుంచి స్టోరీ వరకు ఈ సీరియల్ జనాలని బాగా కట్టిపడేసింది. ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమైంది. వంటలక్క దీప, డాక్టర్ బాబు కార్తీక్ వీరిద్దరూ ఎప్పుడు కలుస్తారు అన్నా ఒకే ఒక స్టోరీ లైన్ తో ఈ సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్లో లేడీ విలన్ పాత్రలో నటించిన మౌనిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీ విలన్ గా తన నటనతో విలనిజంతో జనాలని బాగా ఆకట్టుకుంది శోభ శెట్టి.. ఈమె గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో నెటిజన్లు తెగ వెతికిస్తున్నారు.. అయితే ఆమె సీరియల్స్ లోకి రాకముందు ఎలాంటి జాబ్ చేసింది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి మోనిత ఏం జాబ్ చేసిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
కార్తీక దీపం సీరియల్ లో హీరోయిన్ పాత్రతో సమానంగా క్రేజ్ ని దక్కించుకున్న పాత్ర విలన్. అందులో మౌనిత అలియాస్ శోభాశెట్టి నటించింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భామ.. తెలుగుతోపాటు పలు కన్నడ సీరియల్స్‌లో కూడా చేస్తుంది. తెలుగులో మొదటగా అగ్నిసాక్షి సీరియల్‌తో టీవీ తెరమీద కనిపించింది. ఈటీవీలో లాహిరి లాహిరి లాహిరిలో అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కన్నడ నాట హీరోయిన్‌గా రుక్కు అనే సీరియల్‌లో లీడ్ రోల్ లో నటించింది.. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన గురించి బయటపెట్టింది. నటి కాకపోయి ఉంటే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదానిని అని శోభా శెట్టి చెప్పారు. కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఈవెంట్‌లో డైరెక్టర్ దృష్టిలో పడింది. ఆ తర్వాత సీరియల్ ఆడిషన్స్ జరిగిందని, అలా కన్నడ ఇండస్ట్రీలోకి ఆమె అడుగు పెట్టింది.. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ తో పాటుగా తెలుగులో కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది..
తెలుగులో కార్తీకదీపం సీరియల్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. ఈ సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శోభ శెట్టి. ఈమె కన్నడలో పలు సీరియల్స్లలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. అలా తెలుగులో కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది.. కన్నడ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి క్రేజ్ ని సంపాదించుకుంది.. అంతేకాదు తెలుగు బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి బాగానే పాపులారిటీని తగ్గించుకుంది.. ఇక్కడ పాజిటివిటీ కన్నా నెగెటివిటీ ఎక్కువగా మూట కట్టుకోవడంతో ఆ తర్వాత సీరియల్స్లలో ఈమె కనిపించలేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటుంది.. అయితే ఈమె చేసిన సీరియల్ కి ఒక్కరోజు రెమ్యూనరేషన్విషయానికి వస్తే దాదాపు 35 వేలకు పైగా తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇక ఇటీవలే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.. ఇకముందు ఏదైనా సీరియల్లో నటిస్తుందేమో చూడాలి..