E-Paper
Advertisement

Horror thriller OTT: గదిలో భయపెట్టే దయ్యం… తల్లికూతుర్ల అగచాట్లు… ఊహకు అందని క్లైమాక్స్

Horror thriller OTT: గదిలో భయపెట్టే దయ్యం… తల్లికూతుర్ల అగచాట్లు… ఊహకు అందని క్లైమాక్స్
Advertisement

Horror thriller OTT : ఒక అద్భుతమైన సూపర్‌నేచురల్ హారర్ చిత్రం చూడాలని ఉంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. ఇది ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో సాగే భయంకరమైన హారర్ కథ. IMDbలో దీనికి మంచి రేటింగ్ కూడా ఉంది. ఒక దుష్టశక్తి నుండి తన కూతురిని కాపాడుకోవడానికి ఆ తల్లి చేసిన పోరాటమే ఈ సినిమా. హారర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ పర్షియన్ సూపర్‌నేచురల్ హారర్ చిత్రం పేరు ‘అండర్ ద షాడో’ (Under the Shadow). బాబాక్ అన్వారి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1980ల టెహ్రాన్‌లో ని వార్ నేపథ్యంలో సాగుతుంది. 2016 లో వచ్చిన ఈ చిత్రంలో నర్గేస్ రషీది, అవిన్ మన్షాది, బాబీ నాదేరి, రే హరాటియన్, అరష్ మరాండి నటించారు. ఇది 89వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కోసం బ్రిటిష్ ఎంట్రీగా ఎంపికైంది. కానీ నామినేట్ కాలేదు. ఇది బ్రిటిష్ అకాడమీ (BAFTA) అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1988లో ఇరాన్-ఇరాక్ యుద్ధం జరుగుతున్న టైమ్‌లో షిదే అనే మహిళ, తన కూతురు డోర్సాతో కలిసి టెహ్రాన్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. ఆమె భర్త డాక్టర్ కావడంతో యుద్ధం వల్ల దూరంగా వెళ్లాల్సి వస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో వాళ్ళ అపార్ట్‌మెంట్ మీద ఒక మిస్సైల్ వచ్చి పడుతుంది. కానీ అది పేలకుండా అలానే ఉండిపోతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళంతా భయపడి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. కానీ షిదే మాత్రం తన కూతురితో కలిసి అక్కడే ఉండిపోతుంది. అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఏవో వింత శబ్దాలు రావడం, వస్తువులు మాయమవ్వడం మొదలవుతాయి.

మెల్లమెల్లగా అక్కడ ఏదో దెయ్యం ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దెయ్యం షిదే కూతురికి ఇష్టమైన బొమ్మను దొంగిలించి, పాపను భయపెడుతూ తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. అటు బయట బాంబుల భయం, ఇటు ఇంట్లో దెయ్యం వేధింపుల మధ్య ఆ తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకుంది? ఇంతకీ ఆ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also : మ్యూజిక్ రాపర్ అవ్వాలనుకునే పిజ్జా బాయ్… మాట్లాడే బాతుతో కష్టాలు… ప్రతి ఎపిసోడ్ సరదాగా

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×