E-Paper
Advertisement

డైరెక్టర్ అనిల్ గొప్ప మనసు.. కన్నీళ్లు పెట్టించిన చిన్నారి.. నిజంగా గ్రేట్ సార్..

డైరెక్టర్ అనిల్ గొప్ప మనసు.. కన్నీళ్లు పెట్టించిన చిన్నారి.. నిజంగా గ్రేట్ సార్..
Advertisement

Drama Juniors Season 9: బుల్లితెరపై ఎన్నో రకాల టాలెంట్ షోలు ప్రసారమవుతు ఉంటాయి. అందులో కొన్ని జనాలని విపరీతంగా ఆకట్టుకునేలా చేస్తాయి.. అందులో ఈమధ్య చిన్నపిల్లల షోలు ఎక్కువవుతున్నాయి.. వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. అలాంటి కిడ్స్ కామెడీ షోలలో డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఒకటి.. ఈ సీజన్ కి జడ్జిలుగా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో శ్రీకాంత్, హీరోయిన్ రోజా వ్యవహరిస్తున్నారు.. జబర్దస్త్ సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఈ షో యొక్క తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ ప్రోమోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన పనికి జనాలు ఫిదా అవుతున్నారు… అసలు ఆ ప్రోమోలో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

అనిల్ గొప్పమనసుకు ఫిదా…

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డ్రామా జూనియర్స్ సీజన్ 9 కు జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఆయన చేసిన ఒక మంచి పని ప్రస్తుతం తెలుగు ప్రజలతో ప్రశంసలు అందుకుంటుంది.. అనిల్ రావిపూడి గ్రేట్ అంటూ నెటిజన్లు సైతం ఆ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు.. ఆ ప్రోమోలో ఒక చిన్నారి స్కిట్ చేస్తుంది.. అనిల్ రావి ఇప్పుడు నీ తమ్ముడుగా చూపించి చేసిన స్కిట్ జనాలని కడుపుబ్బా నవ్వించింది.. స్కిట్ అయిపోయిన తర్వాత సుధీర్ మీ అమ్మను చూడాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు.. దాంతో ఆ పాప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు సుధీర్ ఈ పాప వాళ్ళ అమ్మకి చిన్న ఆక్సిడెంట్ జరగడంతో ఆమె కాళ్ళకి బాగా గాయాలు తగిలాయి. అక్క అని పిలిచినా ఆప్యాయతతో డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఆమె హాస్పిటల్ ఖర్చులన్నీ చూసుకున్నారు అని సుధీర్ చెప్పగానే అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. డైరెక్టర్ గొప్ప మనసుకి ఫిదా అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అనిల్ రావిపూడి నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కంటతడి పెట్టిస్తున్న ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..

Advertisement

డైరెక్టర్ అనిల్ రావిపూడి మంచోడు సామి..

తెలుగు ప్రేక్షకులను తన సినిమాలతో కడుపుబ్బ నవ్విస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా స్టార్ హీరోలతో సినిమాల చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ప్రతి ఏడాది ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఇక ఈ ఏడాది వచ్చినా మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ కూడా ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని పడేలా చేసింది.. ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఈ మూవీ ఉంది.. ఇకపోతే అనిల్ రావిపూడి కి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం.. చాలా ఇంటర్వ్యూలలో ఆయన ఇదే విషయాన్ని బయటపెట్టారు. అందుకే బుల్లితెరపై ప్రసారమవుతున్న కిడ్స్ షోలలో అనిల్ రావిపూడి ఉంటున్నారన్న విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు.. అంతేకాదు టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో డైరెక్టర్ గారు ఒక అడుగు ముందే ఉంటారు.. ఎంతోమంది చిన్నారులకు తమ సినిమాలలో అవకాశాలు కూడా ఇస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్నాడు.. నిజంగా అనిల్ రావిపూడి గ్రేట్ అంతే..

Advertisement

Also Read :సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

Related News

తాత గారితో పందెం సీక్రెట్ బయటపెట్టిన రామోజీరావు మనవడు..!

పెళ్లిపీటలెక్కిన ‘జగధాత్రి’ సీరియల్ నటి…ఫోటోలు వైరల్!

పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్.. పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి!

“మాధురి రాథోడ్ నోరు విప్పితే అంతా జైలుకే”.. నిజాలు బయటపెట్టిన ఫోక్ ప్రొడ్యూసర్!

సనాతన ధర్మం.. ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !

సుధీర్ రాకతో స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!

తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?

Ninnu kori Serial Today Episode September 1st  ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ ఆపేందుకు చంద్ర కొత్త ప్లాన్      

Big Stories

Advertisement
×