E-Paper
Advertisement

2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?

2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?
Advertisement

Pushpa 3:ఇప్పటిదాకా ఒక లెక్క ..ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టుగా పుష్ప 2 కి ముందు తర్వాత అన్నట్టుగా బన్నీ కెరీర్ ని డివైడ్ చేయొచ్చంటే సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం అవుతుంది.సీక్వెల్ సినిమాలు సక్సెస్ కాలేవు అన్న నానుడిని పటాపంచెలు చేసి ఏకంగా వరల్డ్ వైడ్ గా 1800 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఇది. ఇక బాలీవుడ్ బాబులకే సాధ్యం కాని విధంగా ఏకంగా ఒక్క హిందీలోనే ఈ సినిమా 800 కోట్లు కొల్లగొట్టి నార్త్ బెల్ట్ ని షేక్ చేసింది.ఇక ఈ సినిమానే అల్లు అర్జున్ ని ప్రభాస్ కి దీటుగా మార్కెట్ లో నిలిపింది.అలాంటి సినిమాకి మూడో భాగం రావాలని ఎవరు కొరుకోరు.కాని నేను కోరుకోవట్లేదు అంటున్నాడు మన ఐకాన్ స్టార్.ఈయన గారు వరుసగా సినిమాలని లైనప్ లో పెడుతున్న వాలకం చూస్తుంటే అలాగే ఉంది మరి.

గ్యాప్ కూడా లేకుండా వరుస సినిమాలని లైనప్

Advertisement

అవును..ఆ సినిమాకి దర్శకత్వం వహించిన సుక్కు మహా అయితే చరణ్ తో ఒక సినిమాని లైనప్ చేసుకున్నాడు.చూస్తుంటే అది వచ్చే దసరా బరిలో దిగుతున్నట్టే కనిపిస్తుంది.ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియారా అద్వాని నయనతార కీ రోల్ చేయనుందని, సాయి అభ్యంకర్ లేదా తమన్ సంగీతం అందించనున్నాడన్న వార్తలు ఇబ్బడి ముబ్బడిగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. అంటే ఎటు చూసిన ఈ లెక్కల మాష్టారు వచ్చే ఏడు చివరికల్లా ఫ్రీ అయ్యేలానే ఉన్నాడు.

కానీ ఎటొచ్చి మన పుష్పరాజ్ మాత్రమే కాసింత గ్యాప్ కూడా లేకుండా వరుస సినిమాలని లైనప్ లో పెట్టేస్తున్నాడు.ఇప్పటికే అట్లీతో రాకా అనే విజువల్ వండర్ ని పరుగులు పెట్టిస్తున్నాడు.ఇక సినిమా స్కేల్ చూస్తుంటే హైఫై సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్ అవడం, దానికి తోడు వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ భారీగా ఉండటం మూలాన ఈ సినిమా ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం.చూస్తుంటే రిలీజ్ డేట్ 2027 క్యాలెండర్ లోకి ఎంటర్ అయ్యేలానే ఉంది.

Advertisement

పుష్పరాజ్ కి తీరిక దొరకాలంటే మరో మూడు మూడేళ్ళు

ఇక్కడి తో ఆగితే సుక్కు, బన్నీకలిసే చాన్స్ ఉండేదేమో,కానీ నా రేంజ్ ఇపుడు ఫ్యాన్స్ వరల్డ్ అంటూ ఇప్పటికే రాకా తర్వాత లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా చేస్తానంటూ కమిట్ అయిపోయాడు. అంటే ఈ సినిమాకి కూడా మరో ఏడాది సమయం ఖచ్చితంగా తినేస్తాడు బన్నీ.ఇక దీని తర్వాత అయినా పుష్ప౩ వైపు మళ్లుతాడనుకుంటే మళయాళ మల్టీ టాలెంటెడ్ బాసిల్ జోసెఫ్ ని లైన్ లోకి తీసుకొచ్చాడు.అంటే ఈ లెక్కన్న మన పుష్పరాజ్ కి తీరిక దొరకాలంటే మరో మూడు మూడేళ్ళు పట్టనుందన్నమాట.

also read :ఒక షాపుతో మొదలైన కథ.. అబిడ్స్ గా ఎలా మారింది?

అలా అని ఈ రెండు సినిమాల తర్వాత అయినా పుష్ప ౩ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అంటే చెప్పలేం.ఎందుకంటే ఈ మధ్యలో మరే ప్యాన్ ఇండియా డైరెక్టర్ వచ్చి టెంప్ట్ చేయక్యుండా ఉంటారన్న గ్యారంటీ ఇవ్వలేము.ఏది ఏమైనా తనని అంత వాడిని చేసిన పుష్ప కోసం ఈయన గారు కాసింత గ్యాప్ దొరకబుచ్చుకొని సినిమా చేస్తే బాగుండు అన్నది పుష్పరాజ్ ఫ్యాన్స్ మనసులో ఉన్న మాట. మరి వీటిని చక చక పూర్తీ చేసి ఈ లోపే దానిని పట్టాలెక్కిస్తాడా లేక అబ్బే నా రేంజ్ ఇప్పుడు వేరు అంటున్న ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ చుట్టూ చక్కర్లు కొడతాడా వేచి చూడాల్సిందే!

Related News

ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ రష్మి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

హైపర్ ఆది మార్కుల వెనుక ఉన్న అసలు కథ ఇదే!

సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

నాగార్జున 100వ మూవీ నుండీ బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

రూ.100 కోట్ల ఆస్తి.. ఊహించని స్టార్డం.. అయినా నోకియా ఫోన్ వాడుతున్న పోసాని.. అసలు కథేంటంటే?

విజయ్ ‘జన నాయగన్’ సినిమాలో మార్పులు.. ఆ సీన్స్ అన్నీ కట్!

జిగేలు రాణిలా మెరిసిపోతున్న రాశిఖన్నా.. హీట్ పుట్టించే లుక్స్ తో!

Big Stories

Advertisement
×