E-Paper
Advertisement

Dhurandhar 2: అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన రణ్ వీర్ సింగ్.. అసలు ఏం జరిగిందంటే?

Dhurandhar 2: అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన రణ్ వీర్ సింగ్.. అసలు ఏం జరిగిందంటే?
Advertisement

Dhurandhar 2: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ (Dhurandhar 2: The Revenge) ప్రభంజనం ఆగడం లేదు. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. తాజాగా ఈ చిత్రం హిందీ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రను తిరగ రాసింది. ఎన్నో రికార్డులను నెలకొల్పింది.

Read also-‘ విశ్వంభర ‘ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్..!

రెండో శనివారం కూడా

Advertisement

విడుదలైన రెండో వారంలో కూడా ఈ సినిమా వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. శనివారం (10వ రోజు) నాడు ఈ చిత్రం ఏకంగా రూ.62.85 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇందులో కేవలం హిందీ వెర్షన్ నుండే రూ.58 కోట్లు రావడం విశేషం. దీంతో, హిందీ చిత్ర పరిశ్రమలో ‘రెండో శనివారం’ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది. గతంలో ఈ రికార్డు ‘పుష్ప 2’ (రూ.46 కోట్లు) పేరుతో ఉండగా, ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ ఆ రికార్డును భారీ తేడాతో బద్దలు కొట్టారు.

Read also-Sharwanand: బైకర్ కోసం శర్వానంద్ అన్ని కేజీల బరువు తగ్గారా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

10 రోజుల్లో

Advertisement

ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ, భారీ తారాగణం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. 10 రోజుల బాక్సాఫీస్ గణాంకాలను పరిశీలిస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.778.77 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,226 కోట్లు రాబట్టింది. దక్షిణాదిలో కూడా ఈ చిత్రం బలంగా కొనసాగుతోంది. రెండో శనివారం తెలుగులో రూ.3 కోట్లు, తమిళంలో రూ. 1.4 కోట్లు వసూలు చేసింది. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ తర్వాత ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం, ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు ఎక్కించింది. రెండో ఆదివారం నాటి వసూళ్లతో ఈ సినిమా ఇండియాలో రూ.850 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో (ఇండియా నెట్) చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘ధురంధర్ 2’ సృష్టిస్తున్న ఈ రికార్డులు చూస్తుంటే, బాలీవుడ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చిందని స్పష్టమవుతోంది.

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×